Tattoo Safety Tips: టాటూ వేయించుకుంటున్నారా?.. ముందు ఈ విషయాలు తెలియకపోతే రిస్కే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tattoo Safety Tips: టాటూ వేయించుకోవడం చాలామందికి జీవితంలో ఒక ప్రత్యేక అనుభవం.. ఇప్పుడు టాటూ కూడా ఓ ఫ్యాషన్ అయిపోయింది.. చిన్న టాటూ వేయించుకునేవారు కొందరైతే.. తమ చేతులు, మెడ, శరీరంపై పెద్ద పెద్ద టాటూలు వేయించుకునేవారు ఎంతో మంది ఉన్నారు.. ఇక, తమకు నచ్చిన డిజైన్‌ను ఎంచుకోవడానికి గంటల తరబడి సమయం కేటాయిస్తారు. అయితే టాటూ అందంగా ఉండటంతో పాటు, దానిని వేయించే స్టూడియోలో పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనేది కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
టాటూ వేయించే ముందు తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే..
* టాటూ వేయించే ముందు ఉపయోగించే సూది (నీడిల్) పూర్తిగా కొత్తదేనా, సీల్ చేసిన ప్యాక్‌ను మీ ముందే తెరిచారా అనే విషయాన్ని తప్పకుండా పరిశీలించాలి. అలాగే సూది గడువు తేదీ (ఎక్స్పైరీ డేట్) కూడా చూసుకోవడం మంచిది. వాడిన సూదులను మళ్లీ ఉపయోగించడం తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీయొచ్చు.
Also Read
- White Shoes Cleaning Tip: వైట్ షూపై మొండి మరకలు పోవడం లేదా?.. రూ.10తో తెల్లటి బూట్లకు కొత్త లుక్..
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
- T-Shirt Hacks: మీ పాత టీ-షర్ట్‌లను పడేస్తున్నారా? ఒక్కసారి ఈ ట్రిక్ చూడండి.. 4 వస్తువులు ఫ్రీగా తయారు చేసుకోవచ్చు!
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
* టాటూ వేస్తున్న ఆర్టిస్ట్ కొత్త డిస్పోజబుల్ గ్లౌజ్‌లు ధరించి ఉండాలి. ఒకవేళ స్టెరైల్ కాని వస్తువులను తాకితే వెంటనే గ్లౌజ్‌లను మార్చి తిరిగి పని ప్రారంభించాలి. ఈ చిన్న జాగ్రత్తలు కూడా బ్యాక్టీరియా, వైరస్ల ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.
* టాటూ మెషీన్లు, ఇంక్ బాటిళ్లు, పని చేసే టేబుల్ వంటి పరికరాలు ప్రతి కస్టమర్‌కు ముందు శుభ్రపరిచి, అవసరమైన రక్షణ కవర్లతో సిద్ధం చేసి ఉండాలి. ఇంక్‌ను ఎప్పుడూ సింగిల్-యూజ్ ఇంక్ క్యాప్‌లలో మాత్రమే పోయాలి. మిగిలిపోయిన ఇంక్‌ను తిరిగి ఉపయోగించకుండా పారేయడం అత్యంత అవసరం.
* టాటూ వేయించే ముందు చర్మాన్ని కూడా సరిగ్గా సిద్ధం చేయాలి. ఆ భాగంలో వెంట్రుకలు ఉంటే కొత్త డిస్పోజబుల్ రేజర్‌తో తొలగించి, చర్మాన్ని పూర్తిగా శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం చికాకు, ఇన్ఫెక్షన్, గాయం నెమ్మదిగా మానడం వంటి సమస్యలను నివారించవచ్చు.
టాటూ వేసిన తర్వాత జాగ్రత్తలు
టాటూ వేయించిన తర్వాత కూడా జాగ్రత్తలు కొనసాగించాలి. మంచి టాటూ ఆర్టిస్ట్ తప్పనిసరిగా ఆఫ్టర్‌కేర్ సూచనలు ఇవ్వాలి. గాయాన్ని ఎలా శుభ్రంగా ఉంచాలి, ఎలాంటి క్రీమ్ వాడాలి, ఎంతకాలం నీటికి దూరంగా ఉంచాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకోవాలి. ఇవి టాటూ త్వరగా మానడానికి, రంగు ఎక్కువకాలం అందంగా ఉండేందుకు సహాయపడతాయి. ఏదైనా విషయంలో అనుమానం కలిగితే ప్రశ్నలు అడగడానికి వెనుకాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. పరిశుభ్రత, భద్రత విషయంలో రాజీ పడకుండా వ్యవహరించే స్టూడియోనే ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే టాటూ జీవితాంతం శరీరంపై ఉంటుంది. కాబట్టి డిజైన్ ఎంత ముఖ్యమో, భద్రత కూడా అంతే ముఖ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!