Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్‌లను మెరిపించే సీక్రెట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stainless Steel Railing Cleaning Tips: ఇంటి అందాన్ని పెంచే స్టెయిన్లెస్ స్టీల్ రెయిలింగ్‌లు కాలక్రమేణా దుమ్ము, నీటి మరకలు, వేలిముద్రలు, జిడ్డు కారణంగా తమ సహజ మెరుపును కోల్పోతాయి. దీనికి ప్రధాన కారణం.. ఇంటికి వచ్చే ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో వాటిని తాకడం.. పట్టుకొని నడవడంతో చేతులకు ఉన్న మరకరలు.. వాటికి.. వాటికి ఉన్న దుమ్ము చేతులకు అంటడం చూస్తుంటాం.. అయితే, వీటిపై ఏర్పడే మరకలు ఇబ్బంది కరంగా మారతాయి.. దీంతో, చాలామంది వాటిని శుభ్రం చేయడానికి ఖరీదైన రసాయన క్లీనర్లను ఉపయోగిస్తుంటారు. అయితే, ఇంట్లోనే సులభంగా దొరికే కొన్ని సహజ పదార్థాలతో ఎలాంటి రసాయనాలు అవసరం లేకుండానే స్టీల్ రెయిలింగ్‌లను కొత్తవాటిలా మెరిసేలా చేయవచ్చు.
గోరువెచ్చని నీరు, మైక్రోఫైబర్ గుడ్డతో శుభ్రపరచండి
రెయిలింగ్‌పై కేవలం దుమ్ము లేదా తేలికపాటి మురికి మాత్రమే ఉంటే, గోరువెచ్చని నీటిలో మైక్రోఫైబర్ గుడ్డను ముంచి బాగా పిండాలి. ఆ గుడ్డతో రెయిలింగ్‌ను మెల్లగా తుడవాలి. అనంతరం పొడి గుడ్డతో మరోసారి తుడిస్తే నీటి మరకలు లేకుండా శుభ్రంగా కనిపిస్తుంది.
Also Read
- Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
- Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
- How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
తెల్ల వెనిగర్‌తో మొండి మరకలకు చెక్
నీటి మరకలు, వేలిముద్రలు లేదా మొండి మురికిని తొలగించడంలో తెల్ల వెనిగర్ ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. సమాన మోతాదులో నీరు, వెనిగర్ కలిపి స్ప్రే బాటిల్లో నింపాలి. ఈ మిశ్రమాన్ని రెయిలింగ్‌పై స్ప్రే చేసి ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత మెత్తని గుడ్డతో తుడిస్తే మరకలు సులభంగా తొలగిపోతాయి.
బేకింగ్ సోడాతో జిడ్డుకు పరిష్కారం
రెయిలింగ్‌పై జిడ్డు లేదా గట్టిగా పేరుకున్న మరకలు ఉంటే, బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి పేస్ట్ తయారు చేయాలి. దానిని మరకలపై రాసి పది నిమిషాల తర్వాత మెత్తటి స్పాంజ్‌తో శుభ్రం చేయాలి. తర్వాత శుభ్రమైన నీటితో తుడిచి పొడి గుడ్డతో ఆరబెడితే మంచి ఫలితం కనిపిస్తుంది.
నిమ్మరసంతో సహజ మెరుపు
నిమ్మకాయలో ఉండే సహజ ఆమ్ల గుణాలు స్టెయిన్లెస్ స్టీల్‌ను శుభ్రపరచడంతో పాటు మెరుపును కూడా తిరిగి తీసుకువస్తాయి. సగం నిమ్మకాయను రెయిలింగ్‌పై మెల్లగా రుద్ది, కొన్ని నిమిషాల తర్వాత తడి గుడ్డతో తుడిస్తే రెయిలింగ్ శుభ్రంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
కొబ్బరి లేదా ఆలివ్ నూనెతో అదనపు షైన్
శుభ్రం చేసిన తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను మృదువైన గుడ్డపై వేసి రెయిలింగ్‌పై మెల్లగా రుద్దాలి. దీనివల్ల రెయిలింగ్‌పై పలుచని రక్షణ పొర ఏర్పడి మెరుపు పెరగడమే కాకుండా దుమ్ము త్వరగా పేరుకుపోకుండా కూడా సహాయపడుతుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
స్టీల్ రెయిలింగ్‌లను శుభ్రం చేసేటప్పుడు స్టీల్ వూల్ లేదా గరుకైన బ్రష్‌లను ఉపయోగించకూడదు. ఇవి ఉపరితలంపై గీతలు పడేలా చేస్తాయి. ఎల్లప్పుడూ మృదువైన గుడ్డ లేదా స్పాంజ్ మాత్రమే ఉపయోగించాలి. శుభ్రం చేసిన తర్వాత రెయిలింగ్‌ను పొడి గుడ్డతో తుడవడం వల్ల నీటి మరకలు ఏర్పడవు. వారానికి ఒకసారి తేలికగా శుభ్రం చేస్తే స్టెయిన్లెస్ స్టీల్ రెయిలింగ్‌లు చాలా కాలం పాటు కొత్తవాటిలా మెరిసిపోతాయి.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం