Cooler Tips: కూలర్ వల్ల మీ గది జిగటగా మారుతోందా..? ఈ చిన్న చిట్కాతో చెక్ పెట్టండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cooler Tips: మండే ఎండల నుంచి ఉపశమనం కోసం ఫ్యాన్స్ వళ్ల కావడం లేదు.. దీంతో.. ఇళ్లలో కూలర్లను.. ఇంకా కొందరు ఏసీలను ఉపయోగిస్తున్నారు. అయితే కూలర్‌ను ఎక్కువసేపు నడపడం వల్ల గదిలో తేమ పెరిగి, జిగటగా.. తడిగా అనిపించడం సాధారణ సమస్యగా మారుతోంది. గదిలో బరువైన వాతావరణం, దుర్వాసన, గోడలు లేదా బట్టలపై తడి ఏర్పడటం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. కూలర్లు గాలిని చల్లబరచడానికి నీటిని ఉపయోగిస్తాయి. అందువల్ల గదిలో తేమ శాతం పెరుగుతుంది. ముఖ్యంగా గది పూర్తిగా మూసివేసి, సరైన వెంటిలేషన్ లేకపోతే ఈ తేమ మరింత ఎక్కువై అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కూలర్ నడుస్తున్న సమయంలో దుప్పట్లు, దిండ్లు లేదా బట్టలు తడిగా అనిపించడం కూడా ఇదే కారణం.
ఉప్పుతో చెక్ పెట్టండి..!
ఈ సమస్యకు ఖరీదైన వస్తువులనను కొనాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోనే చాలా సులభంగా అందుబాటులో ఉండే ఉప్పుతో ఈ సమస్యను కొంతవరకు తగ్గించవచ్చని సూచిస్తున్నారు. ఉప్పుకు గాలిలోని తేమను పీల్చుకునే ప్రత్యేక గుణం ఉంటుంది. శాస్త్రీయంగా దీనిని “హైగ్రోస్కోపిక్” లక్షణం అంటారు. అంటే గాలిలోని అదనపు తేమను ఉప్పు తనలోకి ఆకర్షిస్తుంది. గదిలో ఒక గిన్నెలో ఉప్పును ఉంచితే, అది క్రమంగా గాలిలోని తేమను పీల్చుకుని గదిని కొంత పొడిగా ఉంచడంలో సహాయపడుతుంది.
Also Read
- Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
- Steel Tap Cleaning Tips: జిడ్డుగా మారిన స్టీల్ ట్యాప్‌ల క్లీనింగ్‌కు బెస్ట్ చిట్కా.. 2 నిమిషాల్లో క్లీనింగ్
- White Shoes Cleaning Tip: వైట్ షూపై మొండి మరకలు పోవడం లేదా?.. రూ.10తో తెల్లటి బూట్లకు కొత్త లుక్..
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
ఏ ఉప్పు.. ఏం చేయాలి..?
కొంతసేపటి తర్వాత ఉప్పు తడిగా మారడం గమనించవచ్చు. ఇది గదిలోని తేమను అది గ్రహిస్తోందని సంకేతం. దీంతో గదిలో ఉండే బూజు వాసన, జిగురు భావన కూడా తగ్గుతుంది. తేమను తగ్గించడంలో ముతక ఉప్పు మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. రాతి ఉప్పు, సముద్రపు ఉప్పు లేదా ముతక ఉప్పును ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు. ఇవి పెద్ద రేణువులుగా ఉండటం వల్ల గాలిలోని తేమను సులభంగా గ్రహిస్తాయి. ఉప్పు గిన్నెను కూలర్ దగ్గర, గది మూలలో, కిటికీ పక్కన లేదా బట్టలు ఉంచే అల్మారాల దగ్గర ఉంచితే మంచి ఫలితం ఉంటుంది. అయితే అది పడిపోకుండా జాగ్రత్తగా ఉంచాలి.
ఇది చాలా ముఖ్యం..
దీనిని ఉపయోగించే సరైన విధానం కూడా చాలా ముఖ్యం. ఒక వెడల్పాటి గాజు లేదా ప్లాస్టిక్ గిన్నెలో ముతక ఉప్పు నింపి గదిలో ఉంచాలి. ప్రతి మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి ఉప్పును పరిశీలించి, అది పూర్తిగా తడిగా మారితే కొత్త ఉప్పును మార్చాలి. అయితే గోడల్లో లీకేజీలు, అధిక తేమ లేదా నీరు ఇంకడం వంటి పెద్ద సమస్యలు ఉంటే కేవలం ఉప్పు మాత్రమే సరిపోదు. కానీ తేలికపాటి తేమ, దుర్వాసన, జిగట వంటి సమస్యలకు ఇది చాలా సులభమైన, చవకైన మరియు ప్రభావవంతమైన ఇంటి చిట్కాగా ఉపయోగపడుతుంది.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!