Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kitchen Hacks: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాలా మంది ఇల్లాళ్లకు వంటింట్లోనే వారి సగం కాలం గడిచిపోతుంది. ఎంత శుభ్రం చేసినా వదలని మొండి జిడ్డు, ఎంత కడిగినా పోని మిక్సీ జార్ల మురికి గృహిణులకు నిరంతరం తలనొప్పిగా మారుతుంటాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని అద్భుతమైన కిచెన్ హ్యాక్స్ చూస్తే.. ‘అరే! ఇన్నాళ్లూ ఈ సింపుల్ చిట్కాలు తెలియక ఎంత కష్టపడ్డాం’ అని ముక్కున వేలేసుకోవడం ఖాయం! వంటింటి కష్టాలకు ఇన్‌స్టంట్‌గా చెక్ పెట్టే ఆ సీక్రెట్ ట్రిక్స్ ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
మురికి మిక్సీ జార్ల పనిపట్టే చిట్కాలు..
చాలా రోజులు వాడటం వల్ల మిక్సీ జార్లు లోపల, బయట మురికిగా మారుతుంటాయి. దీనికోసం పాత టూత్ బ్రష్‌ను కొద్దిగా వేడి చేసి, దాని బ్రిజిల్స్ (పళ్ళు) వెడల్పుగా ఉండేలా ప్లయర్స్తో మార్చుకోవాలి. ఆ తర్వాత జార్లో బేకింగ్ సోడా, సర్ఫ్, వెనిగర్ వేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత మీరు ముందుగా రెడీ చేసుకున్న బ్రష్‌తో దానిని రుద్ది, ఆ నీటితో కడిగితే మిక్సీ జార్ కొత్త దానిలా మెరుస్తుంది.
Also Read
- Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
- Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
- Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
- Dark Circles Under Eyes: కళ్ల కింద నల్లటి వలయాలకు ఇంటి చిట్కా.. బంగాళాదుంపతో ఈ విధంగా!
ఆ జిడ్డు వదలడానికి ఇలా చేయండి..
చాలా మంది ఆడవాళ్లకు వారి వంటింట్లో తలపోటు తెప్పించే పెద్ద సమస్య గ్యాస్ స్టవ్ బర్నర్ స్టాండ్లు జిడ్డుగా, నల్లగా మారడం. ఈ సమస్యకు సింపుల్‌గా చెక్ పెట్టడానికి.. ఒక టబ్‌లో వేడి నీటిని తీసుకుని అందులో బేకింగ్ సోడా, లిక్విడ్ డిటర్జెంట్, వెనిగర్ వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమంలో జిడ్డుగా ఉన్న స్టాండ్‌ను 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత స్క్రబ్బర్‌తో కాస్త రుద్ది కడిగితే ఆ జిడ్డు మొత్తం వదిలిపోయి కొత్త వాటిలా మెరిసిపోతాయి.
క్యాబేజీ/వెల్లుల్లి తురిమేటప్పుడు సులువైన పద్ధతి..
సాధారణంగా గ్రేటర్ (తురుముకునేది) సహాయంతో వెల్లుల్లి లేదా ఇతర కూరగాయలు తురిమేటప్పుడు ముక్కలు అందులోనే ఇరుక్కుపోయి వృథా అవుతుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే గ్రేటర్‌కు ఒక ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ను చుట్టి, ఆ పైన వెల్లుల్లిని తురమాలి. ఇలా చేయడం వల్ల తురుము అంతా ప్లాస్టిక్ కవర్ పైనే ఉండి, గ్రేటర్‌కు అంటుకోకుండా సులువుగా వస్తుంది.
హాట్ బాక్స్‌లలో వచ్చే దుర్వాసనకు ఇలా చెక్ పెట్టండి..
హాట్ బాక్స్‌లు లేదా క్యాస్రోల్లలో ఎక్కువసేపు ఆహార పదార్థాలు ఉంచడం వల్ల వాటి నుంచి ఒక రకమైన చెడు వాసన వస్తుంది. ఈ దుర్వాసనను పోగొట్టడానికి హాట్ బాక్స్‌లో కొద్దిగా ఉప్పు, వేడి నీటిని పోసి మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత ఆ నీటిని పారబోసి ఒక పొడి గుడ్డతో తూడిస్తే ఎలాంటి దుర్వాసన లేకుండా శుభ్రంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
-
Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
-
Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్‌కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
-
Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని
-
IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!