Washing Machine: మీ వాషింగ్ మెషీన్ బ్యాడ్ స్మెల్ వస్తోందా? కేవలం ఇంట్లోనే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Washing Machine: ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ వాషింగ్ మెషీన్ అనేది ఒక కచ్చితమైన వస్తువుగా మారిపోయింది. చాలా మంది రోజూ దుస్తులు ఉతకడానికి దీనిపైనే ఆధారపడుతుంటారు. అయితే, చాలామంది వాషింగ్ మెషీన్‌ను వాడుతుంటారే కానీ, దానిని క్రమం తప్పకుండా శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. దీని ఫలితంగా మెషీన్ త్వరగా పాడైపోవడమే కాకుండా, ఉతికిన దుస్తుల నుంచి కూడా ఒక రకమైన మురికి వాసన రావడం స్టార్ట్ అవుతుంది. మీ వాషింగ్ మెషీన్ ఎక్కువ కాలం మన్నికగా ఉండాలన్నా, దుర్వాసన లేకుండా బట్టలు తెల్లగా మెరవాలన్నా కొన్ని సులువైన హోమ్ క్లీనింగ్ చిట్కాలను పాటించడం ఎంతో ముఖ్యం. అవి ఎంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
* మనం నిరంతరం ఉపయోగించడం వల్ల వాషింగ్ మెషీన్ లోపలి భాగంలో మురికి, డిటర్జెంట్ (సబ్బు పొడి) అవశేషాలు, గట్టి నీటి వల్ల వచ్చే లవణాలు పేరుకుపోతాయి. అందువల్ల కనీసం నెలకు ఒకసారైనా మెషీన్‌ను డీప్ క్లీన్ చేయాలి. దీనికోసం ప్రత్యేకంగా లభించే ట్యాబ్లెట్లను లేదా వెనిగర్, బేకింగ్ సోడా మిశ్రమాన్ని ఉపయోగించి మెషీన్‌ను ‘టబ్ క్లీన్’ మోడ్‌లో రన్ చేయాలి. ఇది లోపలి మురికిని పూర్తిగా తొలగిస్తుంది.
Also Read
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
* చాలామంది బట్టలు ఉతకడం పూర్తయిన వెంటనే వాషింగ్ మెషీన్ తలుపును (డోర్) గట్టిగా మూసేస్తుంటారు. ఇలా చేయడం వల్ల లోపల ఉన్న తేమ అలాగే ఉండిపోయి బ్యాక్టీరియా, బూజు పట్టడానికి కారణమవుతుంది. అందుకే బట్టలు తీసిన తర్వాత కనీసం అరగంట నుంచి గంట పాటు మెషీన్ డోర్ తెరిచి ఉంచాలి. దీనివల్ల గాలి ఆడి లోపలి భాగం పూర్తిగా ఆరిపోతుంది మరియు ఎలాంటి దుర్వాసన రాదు.
* అవసరానికి మించి ఎక్కువ డిటర్జెంట్ లేదా లిక్విడ్ వాడటం వల్ల అది పూర్తిగా కరిగిపోక మెషీన్ పైపుల్లో, డ్రమ్ వెనుక భాగంలో పేరుకుపోతుంది. ఇది మెషీన్ లోపలి భాగాలను తుప్పు పట్టేలా చేస్తుంది. కాబట్టి బట్టల పరిమాణాన్ని బట్టి సరైన మోతాదులోనే డిటర్జెంట్ ఉపయోగించాలి. అలాగే, డిటర్జెంట్ వేసే ట్రేని కూడా తరచూ తీసి విడిగా శుభ్రం చేసుకోవాలి.
* వాషింగ్ మెషీన్ కింద భాగంలో ఉండే డ్రైనేజీ లేదా కాయిన్ ఫిల్టర్‌ను నెలకు ఒకసారి కచ్చితంగా చెక్ చేయాలి. బట్టల్లో ఉండే నాణేలు, పిన్నులు, దారాలు ఇందులో ఇరుక్కుపోతుంటాయి. దీనివల్ల నీరు బయటకు వెళ్లడం ఆగిపోయి మెషీన్ రిపేర్ వచ్చే అవకాశం ఉంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు, క్లీనింగ్ టిప్స్‌ను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా పెద్ద పెద్ద రిపేర్ల ఖర్చులను సులభంగా తగ్గించుకోవచ్చు. వీటితో మీ వాషింగ్ మెషీన్ లైఫ్ కూడా రెట్టింపు అవుతుంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!