Kitchen Tips: పాత గ్యాస్ స్టౌ కొత్తదానిలా మెరవాలా? అయితే ఈ అద్భుతమైన క్లీనింగ్ చిట్కా మీ కోసమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kitchen Tips: మనం ప్రతిరోజూ వంటగదిలో ఉపయోగించే వస్తువులలో అత్యంత ముఖ్యమైనది గ్యాస్ స్టౌ. దీనిపై నిరంతరం వంట చేయడం వల్ల నూనె జిడ్డు, అన్నం గంజి లేదా కూరల మరకలు పడి ఈ గ్యాస్ స్టౌ మొండిగా తయారవుతుంటాయి. ఈ గ్యాస్ స్టౌ మరకలు మామూలు నీళ్లతో లేదా సబ్బుతో కడిగినా అంత త్వరగా వదలవు, పైగా ఎంత కడిగినా ఈ స్టౌ పాతదానిలా కనిపిస్తుంది. ఇలాంటి మొండి జిడ్డును వదిలించి, మీ గ్యాస్ స్టౌను కేవలం 15 నిమిషాల్లో మళ్లీ కొత్తదానిలా మెరిపించే ఒక అద్భుతమైన చిట్కాను ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read
- Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
- Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
కావలసిన పదార్థాలు:
బేకింగ్ సోడా
విమ్ జెల్ లేదా ఏదైనా డిష్ వాష్ లిక్విడ్
స్క్రబ్బర్
శుభ్రం చేసే విధానం:
ముందుగా మీ స్టౌపై జిడ్డు ఎక్కువగా ఉన్న చోట బేకింగ్ సోడాను చల్లాలి. ఇది మొండి మరకలను వదిలించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆ తర్వాత బేకింగ్ సోడాపైన కొద్దిగా విమ్ జెల్ వేయాలి. దీనిని ఒక స్క్రబ్బర్ సహాయంతో స్టౌ అంతటా బాగా రుద్దాలి. జిడ్డు ఎక్కువగా ఉన్న చోట కొంచెం గట్టిగా రుద్దడం వల్ల ఆ మరకలు త్వరగా వదులుతాయి. మీ గ్యాస్ స్టౌపై ఈ మిశ్రమంతో రుద్దిన తర్వాత దానిని సుమారు 15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. దీనివల్ల బేకింగ్ సోడా, జెల్ కలిసి ఆ జిడ్డును పూర్తిగా తొలగిస్తాయి. 15 నిమిషాల తర్వాత ఒక తడి గుడ్డతో స్టౌను శుభ్రంగా తుడిచేయాలి. తర్వాత చూస్తే మీ గ్యాస్ స్టౌ ఎటువంటి జిడ్డు లేకుండా కొత్తదానిలా మెరిసిపోతుంది. ఈ చిట్కాను వారానికి ఒకసారి పాటించడం వల్ల మీ స్టౌ ఎప్పుడూ శుభ్రంగా ఉండటంతో పాటు కొత్త దానిలా మెరిసిపోతుంది.
READ ALSO: Dhurandhar 2: బాలీవుడ్ ‘ఫేక్ లవ్’ బట్టబయలు.. ధురందర్ 2 సక్సెస్‌పై షాకింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
-
Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!