Air Cooler: రోజుకు 8 గంటలు కూలర్ ఆన్‌లో ఉంటే ఎంత బిల్లు వస్తుందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air Cooler: ఎండలు ముదురుతున్న వేళ కూలర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. వేసవి కాలంలో సామాన్యులకు ఏసీ కంటే కూలర్లే ప్రధాన ఆధారం. తక్కువ ధరలో లభించడం, మెరుగైన కూలింగ్ ఇవ్వడం వల్ల చాలా మంది వీటిని ఇష్టపడతారు. అయితే కూలర్ వాడితే కరెంట్ బిల్లు ఎంత వస్తుంది? ఒక కూలర్ నెలకు ఎన్ని యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తుంది? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. కూలర్ ఎంత విద్యుత్తును ఖర్చు చేస్తుంది అనేది దాని మోటార్ సామర్థ్యం (Watts), వాడే సమయంపై ఆధారపడి ఉంటుంది.
విద్యుత్ వినియోగాన్ని లెక్కించే ఫార్ములా..
ఓరియంట్ ఎలక్ట్రిక్ ప్రకారం.. మీ కూలర్ ఖర్చు చేసే యూనిట్లను ఈ సూత్రంతో సులభంగా తెలుసుకోవచ్చు.. విద్యుత్ వినియోగం (kWh/యూనిట్లు) = (వాటేజ్ × వాడే గంటలు) ÷ 1000. ఉదాహరణకు 1: 190W కూలర్ నెలకు చేసే ఖర్చు ఒకవేళ మీరు 190 వాట్ల సామర్థ్యం గల కూలర్‌ను రోజుకు 8 గంటలు వాడితే.. దాని రోజువారీ వినియోగం (190 × 8) ÷ 1000 = 1.52 యూనిట్లు వస్తుంది. అదే నెలవారీ వినియోగం విషయానికి వస్తే.. 1.52 × 30 = 45.6 యూనిట్లు అవుతుంది. దీని ఖర్చు యూనిట్ ధర రూ.5 అనుకుంటే.. 45.6 × 5 = రూ.228 సుమారుగా అవుతుంది.
Also Read
- Smoking While Drinking Tea: 'టీ'తో పాటు 'సిగరెట్' తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
- Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
- Fridge Cleaning Tips: ఫ్రిడ్జ్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి..
- Bathroom Cleaning Tips: కుళాయిలు, సింక్లు కొత్తవిగా మెరవాలంటే.. ఈ చిట్కాలతో నిమిషాల్లో కొత్త మెరుపు!
ఒకవేళ మీరు 180 వాట్ల కూలర్‌ను రోజుకు 8 గంటలు వాడితే .. దాని రోజువారీ వినియోగం 180 × 8 ÷ 1000 = 1.44 యూనిట్లు గా వస్తుంది. అదే నెలవారీ వినియోగం విషయానికి వస్తే.. 1.44 × 30 = 43.2 యూనిట్లు. ఖర్చు విషయానికి వస్తే యూనిట్ ధర రూ.5 అనుకుంటే.. 43.2 × 5 = రూ.216 సుమారుగా ఉంటుంది. పై లెక్కలను బట్టి చూస్తే 190W కూలర్ కంటే 180W కూలర్ వాడటం వల్ల నెలకు కొంత విద్యుత్ ఆదా అవుతుంది. మొత్తంగా చూస్తే ఏసీలతో పోలిస్తే కూలర్ల వల్ల వచ్చే కరెంట్ బిల్లు చాలా తక్కువ. నెలకు కేవలం రూ.200 నుంచి రూ.250 మధ్య ఖర్చుతో వేసవిలో హాయిగా చల్లటి గాలిని ఆస్వాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మీ ఇంట్లోని కూలర్ వెనుక ఉండే స్టిక్కర్‌పై దాని Wattage చూసి, మీరు రోజుకు ఎన్ని గంటలు వాడుతున్నారో లెక్కవేసుకుంటే మీ కరెంట్ బిల్లు ఎంతో మీకే అర్థమవుతుంది. కుదిరితే ఒకసారి ప్రయత్నించి చూడండి.
తాజావార్తలు
-
OTR: చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కొత్త లొల్లి..?
-
OTR: పాలకుర్తి టిక్కెట్ గురించి అప్పుడే కాంగ్రెస్‌లో చర్చలు
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన సౌదీ అరేబియా.. అమెరికాతో చెడిందా?
-
Jupally Krishna Rao : రూ.8.21 లక్షల కోట్ల అప్పు.. జూపల్లి బిగ్ ఛాలెంజ్.!
-
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ భీకర దాడులు.. 15 మంది మృతి
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్‌లో లాంచ్..!