NTV Telugu Site icon

Adulterated Sweets Test : కల్తీ స్వీట్స్, పాల ఉత్పత్తులను ఎలా గుర్తించాలి?

Sweets

Sweets

భారతదేశం పండుగలకు నిలయం. మరికొన్ని రోజుల్లో వెలుగులు, ఆనందాల మాధుర్యంతో దీపావళి పండుగ రాబోతోంది. ఈ పండుగ నాడు ప్రజలు మిఠాయిలు పంచుకుంటారు. అయితే ప్రతి ఏటా కల్తీ మిఠాయిలు తిని అనారోగ్యానికి గురవుతున్నారనే వార్తలు పండుగ మజాను పాడుచేస్తున్నాయి. పండుగ సీజన్‌లో ఏయే వస్తువులు కల్తీ అవుతాయి? ఎలా గుర్తించాలనే అంశాలను తెలుసుకుందాం..

సిల్వర్ పూత..
స్వీట్లలో ఉపయోగించే సిల్వర్ పూతలో కూడా కల్తీ ఉంటుంది. దీన్ని గుర్తించడానికి, మీరు స్వీట్లలో కొన్ని చుక్కల కాస్టిక్ సోడా వేయాలి. సిల్లర్‌కి బదులుగా అల్యూమినియంతో చేస్తే అది వెంటనే కరిగిపోతుంది. అంతే కాకుండా.. అల్యూమినియం పూత, సిల్వర్ పూత కంటే కొంచెం మందంగా ఉంటుందని గమనించాలి. ఇది కాకుండా.. స్వీట్లపై ఉన్న సిల్లర్ పూతను కాలిస్తే.. చిన్న బంతులు ఏర్పడినట్లయితే అది అలైందిగా.. కాలిపోయి బూడిద రంగులోకి మారితే నకిలీపూతగా గుర్తించవచ్చు.

నెయ్యి ఆధారిత స్వీట్లు..
నెయ్యితో చేసిన స్వీట్లలో కూడా కల్తీ జరుగుతోంది. ఈ స్వీట్లను వేడి చేసిన వెంటనే, అవి ముదురు గోధుమ రంగులోకి మారి.. ప్రత్యేకమైన వాసనను వస్తే..ఇది కల్తీ అని గమనించాలి.

రంగుల స్వీట్లు..
స్వీట్‌ను ప్లేట్‌లో ఉంచినప్పుడు లేదా తిన్న తర్వాత చేతులు, నోటికి రంగు అంటినట్లయితే అవి కల్తీ అని తెలుస్తుంది. ఈ స్వీట్లలో ఫుడ్ కలర్స్ కాకుండా బట్టల డైస్ వాడారని దీని అర్థం.

గడువు తేదీ..
మార్కెట్లలో లభించే ప్యాక్ చేసిన స్వీట్ల గడువు తేదీని తప్పకుండా తనిఖీ చేయండి. రుచి బాగోలేకపోతే.. వెంటనే ఫిర్యాదు చేయండి. ఎందుకంటే కల్తీ స్వీట్లు చెడు రుచిని కలిగి ఉంటాయి.

మార్కెట్లో కల్తీగా మారిన పాల ఉత్పత్తులను ఈ పరీక్షల ద్వారా తెలుసుకోండి..

కల్తీ పాల గుర్తింపు టెస్ట్..
ఇంట్లో ఫ్లాట్ బండపై రెండు చుక్కల పాలను వేయండి. అది ఏదో ఓవైపు పారుతుంది. పాలు పారిన వైపు తెల్లగా కనిపిస్తే.. అవి స్వచ్ఛమైనవి అని నిర్ధారించుకోవాలి. కల్తీ పాలు అయితే.. తెల్లగా కనిపించవు. మార్కెట్లో దొరికే పీహెచ్ స్ట్రిప్‌తోనూ పాల కల్తీని కనిపెట్టవచ్చు. స్ట్రిప్‌పై చుక్క పాలను వేయండి. ph రేషియో 6.4 – 6.6 మధ్యలో ఉంటే స్వచ్ఛమైన పాలని గుర్తించుకోవాలి. అంతకన్నా తక్కువ కానీ, ఎక్కువ ఉంటే పాలు కల్తీ పాలు జరుగుతుందని అర్థం.

అయోడిన్ ద్రావణ పరీక్ష..
ఈ టెస్ట్ ద్వారా కూడా పాల కల్తీని కనిపెట్టవచ్చు. ఇందుకోసం ముందుగా టెస్ట్ ట్యూబ్‌లో 5మి.లీ పాలు తీసుకోవాలి. ఇందులో 2ml అయోడిన్ ద్రావణాన్ని కలపండి. ఇది బాగా మిక్స్ చేయండి. స్వచ్ఛమైన పాలు అయితే.. దాని రంగు లేత గోధుమ రంగులోకి మారిపోతుంది. అదే, కల్తీ పాలు అయితే.. దాని రంగు లైట్ చాక్లెట్ కలర్‌లోకి మారుతుంది. పాలలో గంజి లేదా ఏదైనా పిండి పదార్థం కలిపితే.. ఆ రంగు మాత్రం నీలంలో ఉంటుందని గుర్తించుకోవాలి. ఇలా టెస్ట్ చేసి.. పాల క్వాలిటీని తెలుసుకోవచ్చు.

డిటర్జెంట్ పొడి పరీక్ష..
పాలలో డిటర్జెంట్ పొడిని కూడా కలుపుతారు. ఈ పొడిని కలిపారేమో గుర్తించాలంటే.. ఒక గ్లాసులో కొంచెం పాలు తీసుకోండి. అంతే మొత్తంలో నీరు కూడా తీసుకోండి. ఈ రెండింటి బాగా మిక్స్ చేసి.. గిరాగిరా తిప్పండి. డిటర్జెంట్ అవశేషాలు ఉంటే అవి బాగా నురగ వస్తాయి. దీంతో.. పాలు కల్తీ జరిగిందని గుర్తించాలి. ఒకవేళ స్వచ్ఛమైన పాలైతే.. చాలా తక్కువ నురగ వస్తుందంటున్నారు నిపుణులు.

పాలలోని యూరియాను గుర్తించండిలా..
కల్తీ పాలు కోసం.. 100 లీటర్ల నీటిలో 5 కిలోల యూరియాను బాగా కలుపుతారు. దీంతో ఆ మిశ్రమం పాలలా తెల్లగా మారిపోతుంది. పాల వాసన వచ్చేందుకు కొన్ని కెమికల్స్ కూడా మిక్స్ చేస్తారు. ఇక, పాలలో యూరియా అవశేషాలు గుర్తించడానికి మార్కెట్‌లో యూరియాసే స్ట్రిప్స్ దొరుకుతాయి. వాటి మీద కొంచెం పాలు పోయాలి. అందులో గీతలు కనిపించాయంటే.. పాలు యూరియాతో తయారు చేశారని అర్థం. ఈ పాలు ఆరోగ్యానికి చాలా డేంజర్.

పాల ఉత్పత్తులలో పిండి పదార్ధాలను ఎలా గుర్థించాలంటే…
2-3 మి.లీ పదార్థాలను అంటే కోవా, పనీర్ వంటివి 5 మి.లీ నీటితో ఉడకబెట్టండి. అది చల్లబరచండి. దానికి 2 నుండి 3 చుక్కల అయోడిన్ టింక్చర్ జోడించండి. మిశ్రమానికి నీలం రంగు ఉంటే అది స్టార్చ్‌కు సంకేతం. రంగు తెల్లగా ఉంటే,మీ పన్నీర్, కోవా స్వచ్ఛంగా ఉంటాయి.

నకిలీ నెయ్యిని ఎలా గుర్తించాలి?
అర టీస్పూన్ నెయ్యి లేదా వెన్నని పారదర్శక పాత్రలో ఉంచండి. ఇప్పుడు దానికి 2 నుండి 3 చుక్కల అయోడిన్ టింక్చర్ జోడించండి. తియ్యటి బంగాళా దుంపలు, మెత్తని బంగాళాదుంపలు లేదా ఇతర పిండి పదార్ధాలు ఆ నెయ్యిలో కలిపితే దాని రంగు నీలం రంగులోకి మారుతుంది. అది కల్తీ నెయ్యి అని గుర్తించాలి.

Show comments