Telugu Health Tips : డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టండిలా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవికాలం వచ్చేసింది. ఎండాకాలం ప్రారంభం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రోజురోజుకు ఎండ తీవ్రత అధికమవుతున్న వేళ.. ఎక్కువగా డీహైడ్రేషన్‌కు గురవుతుంటారు. దీంతో డీహైడ్రేషన్ నుంచి బయటపడేందుకు నిమ్మరసం, మంచినీళ్లు, ఫ్రూట్ జ్యూస్‌లు, కొబ్బరి నీళ్లలాంటి ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. అయితే ద్రవపదార్థాలేకాకుండా కొన్ని రకాల ఘనపదార్థాలు కూడా డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
ఆకు కూరలు : వేసవికాలంలో డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగించే ఘన పదార్థాలలో ఆకు కూరలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. తోటకూర, పాలకూర లాంటి ఆకు కూరల్లో నీటి శాతం అధికంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా కూడా చాలా పోషకాలను శరీరానికి అందిస్తాయి. క్యారెట్, కీర దోస, బీట్ రూట్ లాంటి సలాడ్స్‌తో కూడా డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టవచ్చు.
Also Read
- Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
- Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
- Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. "రాజ్మా రైస్"తో హై ప్రోటీన్ లంచ్.!
- Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
జీలకర్ర : శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు జీలకర్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో నీటి శాతం సమంగా ఉంచేందుకు జీలకర్ర సహాయం చేస్తుంది. రాత్రిపూట ఒక గ్లాసు నీళ్లలో కొద్దిగా పటిక బెల్లంతో పాటు జీలకర్రను నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని వడగట్టి త్రాగడం వలన డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడొచ్చు. అంతేకాకుండా ఎన్నో పోషక విలువలున్న జీలకర్ర శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో దోహదపడుతుంది.
సత్తుపిండి : ఈ ఎండాకాలం డీహైడ్రేషన్ నుంచి బయటపడేందుకు సత్తుపిండి ఎంతో సహాయపడుతుంది. ఉదయం టిఫిన్‌గా సత్తుపిండితో పాటు పాలు గానీ, మజ్జిగ గానీ తీసుకోవచ్చు. అంతేకాకుండా జొన్నలు, రాగులతో చేసిన సత్తుపిండి శరీరంలోని వేడిని తగ్గించడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!