నాన్ వెజ్ లో ఎక్కువ చికెన్ ను తింటారు.. అదే విధంగా మటన్ ను కూడా ఎక్కువగా తింటుంటారు.. అయితే మటన్ లో అత్యంత రుచికరమైన కర్రీ అంటే మనకు ఎక్కువగా గుర్తుకు వచ్చేది.. హైదరాబాద్ ధమ్ కా మటన్.. హోటల్ లో టేస్ట్ తో పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..
కావల్సిన పదార్థాలు..
మటన్ – అరకిలో,
ఉప్పు – ఒక టీ స్పూన్,
పసుపు – అర టీ స్పూన్,
కారం – ఒక టీ స్పూన్,
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్,
నీళ్లు – అర గ్లాస్,
బాదంపప్పు – 10,
జీడిపప్పు – 10,
ఎండు కొబ్బరి – రెండు ఇంచుల ముక్క,
తర్బూజ గింజలు – ఒక టీ స్పూన్,
గసగసాలు -ఒక టీ స్పూన్,
దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క,
యాలకులు – 3,
లవంగాలు – 4,
ఫ్రైడ్ ఆనియన్స్ – ఒక కప్పు,
పెరుగు – 200 గ్రా,
ధనియాల పొడి – ఒక టీ స్పూన్,
జీలకర్ర పొడి – అర టీ స్పూన్,
గరం మసాలా – ఒక టీ స్పూన్,
మిరియాల పొడి – ఒక టీ స్పూన్,
తరిగిన పచ్చిమిర్చి – 3,
తరిగిన కొత్తిమీర -కొద్దిగా,
నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్,
నూనె – 3 టేబుల్ స్పూన్స్,
నిమ్మకాయ – ఒకటి
తయారీ విధానం :
ముందుగా మటన్ ను శుభ్రంగా కడిగి ఒక కుక్కర్ లో వేసి ఉడికించాలి..అందులో ఉప్పు కారం, పసుపు వేసి 5 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి..తరువాత ఒక జార్ లో బాదంపప్పు, జీడిపప్పు, గసగసాలు, ఎండు కొబ్బరి ముక్కలు, తర్బూజ గింజలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి.. ఇక ఇప్పుడు అడుగు మందంగా ఉండే కడాయిల్ తీసుకోవాలి..ఉడికించిన మటన్ ను నీటితో సహా తీసుకోవాలి. తరువాత ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ ను ఒకసారి నలిపి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ ను వేసుకోవాలి. ఆ తరువాత మరో రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకటిన్నర టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసి కలపాలి… ఇప్పుడు మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి.. ఆ తర్వాత గిన్నె అంచుల చుట్టు గోధుమపిండి ముద్దను ఉంచి మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా చేసుకోవాలి. తరువాత ఈ మటన్ ను ఇలాగే ఉంచి రెండు గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక మంటను చిన్నగా చేసి దానిపై మటన్ ను గిన్నెను ఉంచి వేడి చేయాలి.. ఇక స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి కలపాలి.. తర్వాత సర్వ్ చేసుకుంటే చాలు ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ.. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి..