Star Hospitals : 35 సంవత్సరాల వ్యక్తికి విజయవంతంగా కాలేయం ఉభయతమ్మెల మార్పిడి
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ స్టార్ హాస్పిటల్స్ విజయవంతంగా కాలేయం ఉభయతమ్మెల మార్పిడిని (డ్యూవల్ లోబ్ లివర్ ట్రాన్స్ప్లాన్ట్) 16 గంటల్లో పూర్తి చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. కర్నూల్‌కి చెందిన 35 ఏళ్ల మహేశ్ కి తన భార్య, సోదరుడి నుంచి తీసిన రెండు కాలేయతమ్మెల మార్పిడి చేశారు. అతిగా మద్యం సేవించడం వల్ల మహేష్ కు కాలేయవ్యాధి వచ్చింది
116 కిలో గ్రాముల శారీరకబరువు ఉన్న మహేశ్ అంతిమదశలో ఉన్న కాలేయవ్యాధితో స్టార్ హాస్పిటల్స్ లోని డా. రాఘవేంద్ర బాబు (ఛీఫ్ ఆఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్) ఆధ్వర్యంలో అతిసంక్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. ఒకేసారి కాలేయంలోని రెండుతమ్మెలను విజయవంతంగా మార్చిన అతికొద్దిమంది మనదేశ వైద్యులలో ఒకరుగా వారు నిలుస్తూ, ఎందరో వ్యాధిగ్రస్తులలో కొత్త విశ్వాసాన్ని నింపుతున్నారు.
ఆపరేషన్ జరిగిన పద్ధతి:
Also Read
- Palathalikalu Recipe : రుచికరమైన పాలతాలికలు.. పక్కా కొలతలతో తయారీ విధానం ఇలా..!
- Annavaram Prasadam Recipe: అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం.. ఇలా చేస్తే టెంపుల్ టేస్ట్ ఉంటుంది..!
- Achari Lauki Salad Recipe: వేసవిలో చల్లని సొరకాయ ఊరగాయ సలాడ్.. సులభమైన టేస్టీ రెసిపీ..
- Walking 10,000 Steps Daily: రోజుకు 10,000 అడుగులు నడవడం నిజంగా అవసరమా..? మోకాళ్లపై ప్రభావం ఏమిటి?
మద్యపానం అలవాటు వున్న మహేష్ కు ప్రాథమిక పరీక్షల అనంతరం పరిస్థితి, ప్రామాణికమైన కాలేయమార్పిడి మార్గదర్శక నియమాలకు అనుగుణంగా లేదని స్పష్టమయింది. మహేష్ కి, తన భార్య కాలేయాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నా, మహేష్ కాలేయమార్పిడి అవసరాలకు తగినంత పరిణామంలో భార్య కాలేయం లేదని గుర్తించారు. తర్వాత, సుమారు 97 కిలోల శారీరక బరువున్న మహేష్ సోదరుడు కాలేయదాతగా పనికి రావచ్చని వైద్యులు గుర్తించారు. అయితే, ఆ సోదరుడికి గతంలో ఉన్న మద్యపాన దురలవాటు వల్ల వచ్చిన కాలేయనాపు కారణంగా వారి కాలేయం – ఈ మార్పిడికి పనికిరాదని తేలింది. ఆ దశలో ఇటు మహేష్ ఆరోగ్యపరిస్థితికూడా క్షీణిస్తూఉండటంతో – ఎవరైనా మృతుల కాలేయం లభించేంతవరకూ ఆగి ఉండే అవకాశం లేకపోయింది.
పేషంట్ మహేష్ పరిస్థితిని గుర్తించిన ఛీఫ్ ఆఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ డా. రాఘవేంద్ర బాబు ఈ దశలో డ్యుయల్ లోబ్ లివర్ ట్రాన్స్ ప్లాంట్’ ఒక్కటే అతని ప్రాణాలను కాపాడగలదని స్పష్టం చేశారు. (డ్యుయల్ లోబ్ లివర్ ట్రాన్స్ ప్లాంట్) అంటే, కాలేయంలో కుడి, ఎడమ వైపుల ఉండే రెండుతమ్మెలను ఒకేసారి మార్చటం. ఇది చాలా క్లిష్టమైన శస్త్రచికిత్స, మనదేశంలో చాలా అరుదుగా జరుగుతున్న ప్రక్రియ. ఇక, ఈ పద్ధతి శస్త్రచికిత్సలో అత్యంత విజయాలను చూస్తున్న దక్షిణ కొరియా వంటి దేశాలలోనూ, బహు అరుదుగానే జరుగుతున్న ప్రక్రియ ఇది. దీని డా. రాఘవేంద్ర బాబు, వైద్య బృందం 16 గంటల్లో పూర్తి చేసింది.
- Tags
తాజావార్తలు
-
Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
-
KTR : రైతు సమస్యలపై ప్రభుత్వానికి కేటీఆర్ అల్టిమేటం
-
Mamata Banerjee: మమత రాజీనామా చేయకపోతే ఏం జరుగుతుంది? నెక్ట్స్ పరిణామం ఇదేనా?
-
Viral: మమతా బెనర్జీ నన్ను రూ.5 కోట్లు అడిగింది.. ప్రముఖ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
Palathalikalu Recipe : రుచికరమైన పాలతాలికలు.. పక్కా కొలతలతో తయారీ విధానం ఇలా..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!