NTV Telugu Site icon

Ridge Gourd : బీరకాయతో ఇన్ని లాభాలా.. తెలిస్తే తినకుండా ఉండలేరు..!

Birakaya

Birakaya

ridge groud health benefits : మనలో చాలామంది బీరకాయ కూర అనగానే ముఖం అదోలా పెట్టేస్తూ ఉంటారు. చాలా మంది దృష్టిలో బీరకాయ ఒక్క పనికి రానికి కూర. అయితే.. బీరకాయ తిరగడం వలన అనేక ఆరోగ్య లాభాలు కలుగుతాయని మాత్రం వారికి తెలియదు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
Also Read : Beauty Tips: ముఖంపై మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా ?

బీరకాయలో ఉండే లక్షణాలు చక్కెర వ్యాధి నివారించడంలో చాలా అద్భుతంగా సహాయపడతాయి. ఇందులో ఉండే ప్లవనాయిడ్స్‌ యూరిన్‌లోని షుగర్‌ లెవెల్స్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే రక్తంలోని ఇన్సులెన్‌ లెవెల్స్‌ను స్థిరంగా ఉంచుతాయి. బీరకాయ చాలా సులువుగా జీర్ణం అవుతుంది. అలాగే మలబద్దకాన్ని నివారించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. మొలల వ్యాధితో బాధపడే వారికి బీరకాయ చాలా మంచిని చేస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వారు తమ డైట్‌ బీరకాయ తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఇందులో ఫ్యాట్‌ మరియు కొలస్ట్రాల్‌ చాలా తక్కువగా ఉంటాయి. బీరకాయలు నీటి శాతం, పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల త్వరగా ఆకలి వేయదు. బీరకాయ అనారోగ్యాలకు గురైనప్పుడు, చాలా త్వరగా కోలుకొని ఎలా చేస్తుంది? ఇది జీవక్రియలు చురుగ్గా పని చేసేలా చేసి త్వరగా శరీరం కోరుకునే లా చేస్తుంది.

Also Read : Narendra Modi: ఉగ్రవాదుల్ని వదిలి, నన్ను టార్గెట్ చేశారు.. మోడీ సంచలన వ్యాఖ్యలు
అలాగే ఇన్ఫెక్షన్లు, వైరస్‌లు సోకకుండా చేసి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శర్మ ఆరోగ్యానికి బీరకాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. శరీరంపై పెరిగిపోయిన మృతకణాలను తొలగించే అద్భుత మూలకం ఇందులో ఉంది. ఇది మొటిమలు. చర్మంపై ఏర్పడే మచ్చలను తొలగించి ముడతలు లేని యవ్వన వంతమైన చర్మాన్ని తిరిగి ప్రసాదిస్తుంది. బీరకాయ ఉదర ఆరోగ్యానికి చాలా మంచిది. కడుపులో మంట, గ్యాస్‌, యాసిడిటీ వంటి ఉదర సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో అధికంగా ఉండే ఫైబర్ తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం అయ్యేలా చేసి జీర్ణక్రియ వ్యవస్థను క్రమ వర్గీకరించింది. అలాగే బీరకాయలో ఇన్‌ప్లమేటరీ, యాంటీ బయోటిక్‌ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరం మొత్తాన్ని శుద్ధి చేసి శరీరంలోని టాక్సిలను తొలగిస్తుంది. అలాగే ఇందులో ఉండే బీటాకెరోటిన్‌ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.