Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Rainbow Team Performs Unique And Life Saving Procedure On Unborn Baby Exit

Rainbow Hospitals : ప్రసవం జరుగుతుండగానే వినూత్న శస్త్రచికిత్సను చేసి శిశువు ప్రాణాలు కాపాడిన రెయిన్ బో వైద్య బృందం

Published Date :October 28, 2022 , 4:18 pm
By NTV WebDesk
Rainbow Hospitals : ప్రసవం జరుగుతుండగానే వినూత్న శస్త్రచికిత్సను చేసి శిశువు ప్రాణాలు కాపాడిన రెయిన్ బో వైద్య బృందం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇది ఓ శిశువు యొక్క అసాధారణ కథ. ఆమె లోకాన్ని మునుపే వినూత్నమైన శస్త్రచికిత్స చేయించుకుంది. వరంగల్ కు చెందిన ఓ జంట, తమ సాధ ప్రెగ్నెన్సీ స్కాన్లో ఇంకా నెలలు నిండని తమ బుజ్జాయి మెడమీద భారీ కణితి ఉందని తెలుసుకోగానే తమ కలలు ఒక్కసారిగా కల్లలైపోయాయన్నట్లుగా తల్లడిల్లిపోయారు. అక్కడి డాక్టర్లు, ఈ ఈ శిశువుకు ప్రాణాంతకంగా పరిణమించే అవకాశముందని, గర్భస్రావం చేయించుకోవడం మంచిం సూచించారు. అయితే, ఆ జంట మాత్రం తమ ఆశను వదులుకోలేదు. తమ శిశువును ఎలాగైనా కాపాడుకోవాలని, అందుకు ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా ఉపయోగించుకోవాలని తలచారు వారి ఆశే వారిని హైదరాబాదు తీసుకువచ్చింది. వారు బంజారాహిల్స్లోలోని సుప్రసిద్ధ మల్టీ స్పెషాలిటీ పిడియాట్రిక్, అబ్బైట్రిక్స్ మరియు గైనకాలజీ హాస్పిటల్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వద్ద డాక్టర్ల బృందాన్ని సంప్రదించారు.

బంజారాహిల్స్లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ , దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన గ్వాటెర్నరీ చిల్డ్రన్స్ కీర్ సెంటర్, అత్యంత క్లిష్టమైన, సవాల్లో కూడిన కేసులకు చికిత్స చేయడంతో అత్యాధునిక చికిత్సా పద్ధతులైన ఎక్కో చిన్నారులకు కాలేయం, మూత్రపిండాలు, -బోన్ మారో మార్పిడి సహా అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలను సైతం చేస్తుంది. వీటిలో న్యూరో సర్జరీలతో పాటుగా అత్యాధునిక పెరినాటల్ కేర్ కూడా ఇక్కడ లభిస్తాయి. నియోనాటాలజిస్ట్లు, పీడియాట్రిక్ ఈఎన్టీ స్పెషలిస్ట్లు, పీడియాట్రిక్ సర్జన్స్, పీడియాట్రిక్ ఎనస్తీషియన్లతో పాటుగా ప్రసూతి డాక్టర్లు కూడా ఒకే చోట ఇక్కడ అందుబాటులో ఉండటంతో పాటుగా 24 గంటలూ తమ సేవలను అందుబాటులో ఉంచడం వల్ల అత్యంత క్లిష్టమైన కేసులకు సైతం విజయవంతంగా ఈ హాస్పిటల్ గ్రూప్ సేవలనందిస్తుంది.

ఈ కేసుకు విజయవంతంగా చికిత్సనందించిన బృందంలో ఫిటల్ మెడిసన్ స్పెషలిస్ట్ డాక్టర్ గాయత్రి మరియు డాక్టర్ స్రవంతి తో పాటుగా ప్రసూతి వైద్యురాలు డాక్టర్ కృతి, చీఫ్ అనస్తీషియన్డ్ డాక్టర్ సుబ్రమణ్యం, డాక్టర్ గీత ఈఎన్టీ సర్జన్ డాక్టర్ పీవీఎల్ మెన్ మూర్తి, పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ హరీష్ జయరామ్ ; ఎన్ఎఐసీయు సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ చిర్ల నియోనాటాలజిస్ట్ డాక్టర్ విజయానంద్ ఉన్నారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఫీటల్ మెడిసన్ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రవంతి ఈ జంటకు పరిస్థితిని వివరించారు. శిశువు మెడమీద ఉన్న భారీ కణితి శిశువు శ్వాసనాళం మరియు ఆహార నాళంకు అవరోధంగా నిలిచింది. శిశువు జీవించేందుకు ఏదైనా అవకాశం ఉందా అని అంటే, అత్యంత అరుదైన వినూత్నమైన శస్త్ర చికిత్స ఎక్సిట్ ప్రొసీజర్ (ఎక్స్ యూటెరో ఇంట్రాపార్టమ్ బ్రిజ్మెంట్ ను డెలివరీ -సమయంలో చేయడం ” అని అన్నారు.

శిశువు ఇంకా తల్లిగర్భంలోనే ఉండటం వల్ల, ఆ శిశువుకు ఆక్సిజన్ సరఫరా నూవి (ప్లాసెంటా) ద్వారా ప్రవహరించే తల్లి రక్తంతో జరుగుతుంది. డెలివరీ తరువాత శిశువులు తమంతట తాముగా శ్వాసించాల్సి ఉంటుంది. కానీ మెడమీద భారీ కణితి రావడం వల్ల శ్వాసకాశంలో అవరోధం ఏర్పడి ఆ శిశువు పుట్టిన తరువాత శ్వాసించడం సాధ్యం కాకపోవచ్చు. తగినంతగా ఆక్సిజన్ అందకపోవడం. వల్ల బ్రెయిన్ డ్యామేజీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భాలలో ఏక్సిట్ ప్రక్రియ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీని లక్ష్యమేమిటంటే శిశువును పాక్షికంగా డెలివరీ చేస్తుంది. తద్వారా రక్తం, ఆక్సిజన్ ప్రవాహం ప్లాసెంటా నుంచి యధావిధిగా జరుగుతుంది. దీనివల్ల నిపుణులు శిశువు శ్వాసించేందుకు తగిన అవకాశాలను ప్రత్యేక గొట్టం ద్వారా కల్పించడం వీలవువుతుంది. ఆ తరువాత వారు డెలివరీ పూర్తి చేస్తారు. ఈ జంట ఏక్సిట్ ప్రక్రియ చేసేందుకు తమ సమ్మతి తెలియజేశారు. తద్వారా తమకు ఇంకా జన్మించని శిశువుకు జీవించేందుకు ఉన్న అవకాశాలను మెరుగుపరిచారు. ఫీటల్ మెడిసన్ కన్సల్టెంట్లు, ప్రసూతి వైద్యులు, అనస్తీషియన్లు, ఈఎన్టీ సర్జన్లు, పీడియాట్రిక్ సర్జన్లు, నియో నాటాలజిస్ట్లు సహా పలువురు స్పెషలిస్ట్లు మధ్య వరుసగా పలు దశల చర్చా కార్యక్రమాలు జరిగాయి. పలు బృందాల నడుమ పూర్తి స్థాయి సహకారం ఈ శస్త్రచికిత్సకు అవసరం కావడంతో ఈ బృందం మాక్ డ్రిల్ ను సైతం చేసి సమస్యలను ఊహించి, తగిన ప్రణాళికలతో పూర్తి స్థాయిలో సిద్ధమైంది.. గర్భం దాల్చిన 37 వారాల తరువాత తల్లికి సీజేరియన్ శస్త్రచికిత్స చేయడంతో పాటుగా ఏక్సిట్ ను సైతం చేశారు.

అన్ని స్పెషాలిటీస్ కు చెందిన 25 మంది డాక్టర్లు డెలివరీ సమయంలో హాజరు కావడం కాదు, తల్లి, బిడ్డలకు ఎలాంటి సహాయం అవసరమైనా చేయడానికి సిద్ధమయ్యారు. డెలివరీకి క్షణాల ముందు ఫీటల్ మెడిసన్ బృందం సిస్ట్ రిడక్షన్ చికిత్సనందించడం ద్వారా కణితి పరిమాణం తగ్గించి 1986ువు డెలివరీ సులభంగా సాధ్యమయ్యే అవకాశం కల్పించారు. అనస్తీషియా బృందం ప్రత్యేక అనస్తీషియాను తల్లికి అందించడం వల్ల శిశువుకు ప్లాసెంటల్ బ్లడ్ సరఫరా చేసేలా చేయగలిగారు. చీఫ్ అనస్తీషియస్ట్ డాక్టర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ “ఛాతీ మరియు మిగిలిన శరీరాన్ని గాలికి బహిర్గతం చేయడం వల్ల ప్లాసెంటా వేరుచేయడం కూడా వేగవంతం అవుతుంది. అందువల్ల ప్రత్యేక ఔషదాలను వాడటం ద్వారా శిశువు 11 నిమిషాల వరకూ ఊపిరి పీల్చుకునే వరకూ గర్భాశయం విశ్రాంతిగా ఉంటూనే తల్లి గర్భం నుంచి ప్లాసెంటా వేరయ్యే ప్రక్రియను సైతం ఆలస్యం చేస్తూ, తల్లి రక్తపోటు నిర్వహించేలా చేశాము. అలాగే గర్భాశయం లోపల ఒత్తిడి నిర్వహించడానికి మరియు ప్లాసెంటల్ విభజనను నివారించడానికి ఫ్లూయిడ్ సైతం జొప్పించడం జరిగింది” అని అన్నారు.

సీనియర్ ప్రసూతి వైద్యులు డాక్టర్ కృతి మాట్లాడుతూ “శిశువు తల మాత్రమే ముందుగా బయటకు తీయడం ఓ వినూత్న అనుభూతి కలిగించింది. మిగిలిన శరీర భాగాలను 11 నిమిషాల పాటు తల్లిగర్భంలోనే ఉంచి గాలి మార్గం ఏర్పరిచే వరకూ పిండం యొక్క బొడ్డు తాడు ద్వారా పిండం. ఆరోగ్య స్థితిని పర్యవేక్షించడం జరిగింది” అని అన్నారు. T వీడియో లారీన్లోస్కోప్ పిలువబడే ప్రత్యేక ఉపకరణాలతో పాటుగా బ్రాంకోస్కోపీ వంటి సాధనాలు.. ఉన్నప్పటికీ గాలి మార్గం ఏర్పరచడం అత్యంత కష్టమైన ప్రక్రియగానే నిలిచింది. ఎందుకంటే, మెడపై -భారీ కణితి కారణంగా శ్వాసనాళం ఓ వైపుకు నెట్టి వేయబడింది. ఈఎన్టీ సర్జన్ ట్రాకియోస్టోమీ (వాయు నాళాల ద్వారా ప్రత్యేకంగా పైపును జొప్పిచారు) చేశారు. అప్పటికీ ఆ శిశువు తల్లి గర్భంలోని 100% ప్లాసెంటాతో అనుసంధానించబడే ఉంది. డెలివరీ సమయంలో ఈ శిశువు ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఈ శిశువు జన్మించిన తరువాత శ్వాసించడానికి ఏక్సిట్ ప్రక్రియతో పాటుగా ప్రత్యేక బ్రీతింగ్ ట్యూబ్ తోడ్పడింది.

పీడియాట్రిక్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ మూర్తి తన అనుభవాలను వెల్లడిస్తూ తల్లి గర్భం నుంచి తల మాత్రమే డెలివరీ కావడంతో పాటుగా మెడపై భారీ కణితి ఉండి, స్వల్పకాలం పాటు తల్లి గర్భంతో అనుసంధానించబడిన శిశువుకు ట్రాకియోస్టోమీ చేయడం అత్యంత సవాల్తో కూడిన అంశం. ఒకసారి వాయు మార్గం ద్వారా ట్యూబ్ను జొప్పించిన తరువాత నియోనాటల్ బృందం మరింతగా ఆ శిశువు ఆరోగ్య పరిస్థితి సమీక్షించడంతో పాటుగా ఆ శిశువు ఆరోగ్యం స్థిరంగా ఉండేలా చేశారు” అని అన్నారు. ఒకసారి శిశువు ఆరోగ్య స్థితిని స్థిరీకరించిన తరువాత ఎన్ఎస్ఐసీయుకు ఆ శిశువును తరలించడంతో పాటుగా హై లెవల్ వెంటిలేటర్ మద్దతును అందించారు. పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ హరీష్ ఈ శిశువు మెడమీద ఉన్న భారీ కణితిని తొలగించారు. ఈ కణితి 600 గ్రాముల బరువు ఉండటంతో పాటుగా 8 x 6 × 7 సెంటీ మీటర్ల పరిమాణం ఉంది. ఈ శస్త్ర చికిత్సకు నాలుగు గంటల సమయం పట్టింది.

డాక్టర్ హరీష్ మాట్లాడుతూ “అతి చిన్న శిశువు మెడ పై ఇంత భారీ కణితిని తొలగించడం అనేది శస్త్ర చికిత్స పరంగా అతిపెద్ద సవాల్ గా నిలిచింది. ఎందుకంటే, అత్యంత కీలకమైన నరాలు, నాళాలు అక్కడ ఉన్నాయి” అని అన్నారు. సీనియర్ కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ విజయానంద్ తన అనుభవాలను వెల్లడిస్తూ ” ఇది వినూత్నమైన కేసు. ఎందుకంటే, శిశువు జన్మించక మునుపే చికిత్స చేయడం ప్రారంభమైంది. ఆమెకు అత్యాధునిక హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్ మద్దతు సహా దాదాపు 50 రోజుల పాటు వెంటిలేటర్ మద్దతు అవసరమైంది. ఎన్ఎస్ఐసీయులో ఆమె ఉన్న 12వారాలలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అయినప్పటికీ 24 గంటలూ అత్యద్భుతమైన వైద్య మరియు నర్సింగ్ కేర్ అందుబాటులో ఉండటంతో.. విజయవంతంగా ఆ శిశువుకు చికిత్స చేయడంతో పాటుగా విజయవంతంగా డిశ్చార్జ్ చేశాము. ఇప్పుడు ఆ శిశువును ఐదు నెలల పాపాయిగా చూడటం చాలా ఆనందంగా ఉంది. ఆమె తనంతట శ్వాసించడంతో పాటుగా ఎదుగుదల కూడా బాగుంది” అని అన్నారు.

ఐసీయు డైరెక్టర్ డాక్టర్ దినేష్ చిర్ల మాట్లాడుతూ “ప్రయత్న లోపం లేకుండా కృషి చేయాలి అనేది మా టీమ్ సిద్ధాంతం. అదే ఈ తరహా సవాల్తో కూడిన కేసులలో విజయం సాధించడానికి సహాయపడుతుంది. అత్యద్భుతమైన టీమ్ వర్క్, డాక్టర్లు, నర్సుల సహకారం, అంకిత భావం కారణంగానే రెయిన్బో గతంలో కూడా ఈ తరహా సవాల్తో కూడిన కేసులను విజయవంతంగా నిర్వహించగలిగింది. అయితే మొట్టమొదటిసారిగా ఫీటల్ మెడిసన్ స్పెషలిస్ట్, అబ్స్టెట్రిషియన్ ఎనస్తీషియస్ట్, పీడియాట్రిక్ సర్జన్, ఈఎన్టీ సర్జన్, నియోనాటాలజిస్ట్ సహా అందరూ డెలివరీ సమయంలో హాజరుకావడంతో పాటుగా ప్రణాళిక చేసిన రీతిలో సహకరించుకుంటూ అత్య క్లిష్టమైన, సవాల్తో కూడిన కేసుకు విజయవంతంగా చికిత్స చేశారు. మల్టీ డిసిప్లీనరీ అప్రోచ్ మరియు టీమ్ వర్క్ కారణంగానే ఇది సాధ్యమైంది” అని అన్నారు.

రెయిన్లో చిల్డ్రన్స్ హాస్పిటల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ కంచర్ల మాట్లాడుతూ ప్రతి జీవితమూ విలువైనది. మా డాక్టర్ల బృందం, అత్యంత సవాల్తో కూడిన కేసులలో సైతం శిశువుల ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. రెయిన్బో యొక్క నిష్ణాతులైన నిపుణుల బృందం సమర్థవంతమైన, ప్రభావవంతమైన, చక్కటి సమన్వయంతో కూడిన సంరక్షణ కారణంగానే దీనిని సాధించగలిగింది. భారతదేశమంతటా ఈ తరహా క్వాటర్నరీ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ను ఏర్పాటు చేయాలనేది మా లక్ష్యం” అని అన్నారు.

ఈ తరహా క్లిష్టమైన కేసులు, అత్యంత అరుదైనప్పటికీ, క్లిష్టమైన కేసులలో కూడా అత్యుత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉందనడానికి ఉదాహరణగా నిలుస్తాయి. మాతృమూర్తులుగా నిలువాలనే ఓ జంట కలను సాకారం చేయడంలో తోడ్పడటం పట్ల రెయిన్బో టీమ్ పూర్తి సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటుగా ఈ విజయగాధను అందరితో పంచుకోవడానికి ఆనందిస్తుంది.

For More Information: Dr Dinesh Kumar Chirla: 98497-90003 Dr Vijayanand: 98661-57271

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • Botsa Satyanarayana: గవర్నర్‌కు బొత్స లేఖ.. ఆర్ధిక వ్యవహారాలపై ప్రభుత్వం తప్పుడు సమాచారం..

  • అనిరుధ్ చేసిన ఆ సాయం వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నా.. విఘ్నేష్ శివన్ ఎమోషనల్ కామెంట్స్!

  • Smriti Mandhana and Palash Muchhal Reunite: మళ్లీ కలిసిన స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వీడియో వైరల్‌.. పెళ్లి చేసుకోబోతున్నారా..?

  • Redmi K90 Max: 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్.. కూలింగ్ ఫ్యాన్‌తో రెడ్‌మి 5G ఫోన్

  • Hardik Pandya: “నువ్వు గ్రేట్‌ రా బుడ్డొడా”.. వైభవ్‌ను చూడగానే ఓటమిని మరిచి ముగ్ధుడైన హార్దిక్ పాండ్యా!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions