Viral Home Remedy: ఇంట్లో ఒక్కసారి ఎలుకల బెడద మొదలైతే ఇక ప్రశాంతత ఉండదు. ఆహార పదార్థాలను పాడుచేయడం, విలువైన బట్టలు, సామాన్లను కొరికేసి నానా రచ్చ చేస్తుంటాయి. వీటిని వదిలించుకోవడానికి మార్కెట్లో దొరికే విషపూరిత మందులు పెడితే, అవి ఎక్కడో ఒక మూల చనిపోయి దుర్వాసన వస్తుందనే భయం చాలామందిలో ఉంటుంది. బోన్లు పెట్టినా ఫలితం కనిపించక విసిగిపోతుంటారు. అయితే మన ఇంట్లో జ్వరం వచ్చినప్పుడు వాడే సాధారణ పారాసిటమాల్ టాబ్లెట్లతోనే ఎలుకలను చిటికెలో తరిమికొట్టవచ్చని మీకు తెలుసా? ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారుచేసుకునే ఈ పద్ధతి ఇప్పుడు ప్రతి ఒక్కరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ సింపుల్ రెమెడీని తయారుచేయడానికి కేవలం రెండు నిమిషాల టైం చాలు.
* ముందుగా ఇంట్లో ఉండే ఏవైనా రెండు పారాసిటమాల్ టాబ్లెట్లను తీసుకుని మెత్తటి పొడిలా దంచుకోవాలి.
* ఆ పొడిలో కొద్దిగా గోధుమ పిండి, బియ్యం పిండి లేదా మైదా పిండిని కలపాలి.
* ఆ తర్వాత తగినన్ని నీళ్లు చల్లుతూ ఆ మిశ్రమాన్ని చపాతీ ముద్దలా గట్టిగా కలుపుకోవాలి.
* తయారైన ముద్దను చిన్న చిన్న గోళీలుగా చుట్టుకుని, కాసేపు ఎండలో బాగా ఆరబెట్టాలి.
ఎలా ఉపయోగించాలంటే..
ఎండబెట్టిన ఈ చిన్న పిండి ఉండలను ఎలుకలు ఎక్కువగా తిరిగే వంటింటి అరలు, సింక్ కింద, గ్యాస్ బండ వెనుక, తలుపు మూలల్లో ఉంచాలి. పిండి వాసనకు ఆకర్షితమై వచ్చే ఎలుకలు వీటిని తిన్న వెంటనే, ఆ టాబ్లెట్ పొడికి ఉన్న ఘాటు శరీరంలోకి వెళ్లి ఊపిరాడక ఇంటిని వదిలి పారిపోతాయి. విష రసాయనాలు వాడకుండా, చచ్చిపోతాయన్న భయం లేకుండా ఇంట్లోనే ఎలుకల పీడ విరగడ చేసుకోవడానికి ఇదొక బెస్ట్ హోమ్ రెమెడీగా పనిచేస్తుందని చెబుతున్నారు.

