Viral Pre Wedding Shoot: ప్రస్తుతం పెళ్లిళ్లు అంటే.. పంతులు ఉన్నా లేకున్నా ప్రీ వెడ్డింగ్ షూట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. పెళ్ళికి ముందు పెళ్లి కూతురు, పెళ్ళికొడుకు బిడియం లేకుండా ఒకరినొకరు అర్ధం చేసుకుంటారని ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ను మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు అంతా నార్మల్ గానే ఉంది. ఆ తరువాతే ఇందులో కొత్త కొత్త ఐడియాలు పెట్టి నాశనం చేసేస్తున్నారు. ఒక జంట బురదలో ఫోటోషూట్ అంటే.. ఇంకో జంట బోటులో అంటున్నారు.. ఇంకో జంట అర్ద నగ్నంగా, మరో జంట సమాధుల మధ్య. దేవుడా ఈ ఫోటోషూట్లు చూసిన వారికి పిచ్చి పలురకాలు అన్న మాటను గుర్తుచేసుకుంటున్నారు.
ఇకపోతే తాజాగా ఒక జంట శృతి మించి నగ్న ఫోటోషూట్ చేశారు. ఒంటిపై నూలుపోగు లేకుండా ఈ జంట తమ ప్రీ వెడ్డింగ్ షూట్ ను షూట్ చేసుకున్నారు. సాధారణంగా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ను ఎవరికి చూపించకుండా ఒక జ్ఞాపకంగా ఉంచుకోవాలని వరుడు సోదరి- బావ ఈ పనిని ఒక ఫోటోగ్రాఫర్ కు అప్పగించారు. అయితే పెళ్లి మరో రోజులు ఉంది అనగా ఈ నగ్న ఫోటోషూట్ లీక్ అయ్యాయి. పెళ్ళికి ముందే వరుడు- వధువు నగ్నంగా ఉన్న ఫోటోలు బంధువుల ఇళ్లలో లీక్ అయ్యి వారి పరువు పోయింది. కొత్త జంటను అలా చూసి అందరు నోళ్లు నొక్కుకున్నారు. దీంతో వీరి పెళ్లి కాస్తా వాయిదా పడింది. ఈ జంట తమ ముఖాన్ని బంధువులకు ఎలా చూపించాలో అని తడబడుతున్నారట. ఇకనుంచైనా ఇలాంటి విష సంస్కృతిని యువత పాటించకుండా ఉండాలని పలువురు కోరుతున్నారు.