Nightmares: కలలు కనడం ప్రతి మనిషిలోనూ సహజంగా వస్తుంటాయి. అయితే కొన్నిసార్లు మనసుకు ఆనందాన్ని, ప్రశాంతతను కలగజేసే కలలు వస్తే.. మరికొన్ని సార్లు ఆందోళనను కలగజేసే స్వప్నాలు వస్తుంటాయి. అందులోనూ పీడకలలు మనస్సులో ఉద్రిక్తతను పెంచుతాయి. స్థిరంగా మీకు పీడకలలు వస్తున్నాయంటే అంది అవాంఛనీయ సంఘటనలకు సంకేతంగా పరిగణించాలి. పీడకలలు వచ్చినప్పుడు అవి నిజ జీవితంలోని సంఘటలను ప్రభావితం చేస్తాయి. నిరంతరం పీడకలలు వస్తున్నప్పుడు కొన్ని చర్యలను పాటించాలి. ఫలితంగా అవాంఛనీయత ప్రభావాలు తొలగి మనసకు ప్రశాంతత కలుగుతుంది. మరి పీడకలలు గురించి తెలుసుకుందాం..
READ MORE: Conversion racket: “హిందూ బాలికల”కు వల.. 2050 నాటికి భారత్‌లో ఇస్లాం వ్యాప్తి చేయడమే లక్ష్యం..
పీడ కలలు వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకొనేందుకు ఓ సంస్థ 351 మంది పెద్దలపై పరిశోధనలు చేపట్టింది. ఆ సందర్భంగా కొందరు ఆసక్తికర విషయాలను తెలిపారు. నిద్రలో పీడకలలు వచ్చినప్పుడు ఏదో చెడు శక్తి వెంటాడుతున్న భావన కలుగుతోందని పేర్కొన్నారు. ఈ స్టడీలో పాల్గొన్న వ్యక్తుల్లో సుమారు 2 నుంచి 8 శాతం మంది పీడ కలలు వల్ల నిద్రలేని రాత్రులు గడుతున్నట్లు తెలుసుకున్నారు. తరచూగా వచ్చే పీడకలలు నిద్రకు భంగం కలిగిస్తాయి. అలాంటి సమయంలో అర్ధరాత్రి పూట నిద్రి లేచి వాటి గురించే ఆలోచిస్తుంటారు. అగ్నిపురాణం ప్రకారం ఇలాంటి స్వప్నాల వల్ల నిద్రకు భంగం వాటిల్లితే వీలైనంత వరకు ఆ కలల గురించి ఆలోచించడం మానుకోవాలి. వెంటనే నిద్రపోయేందుకు ప్రయత్నించాలి. ఇలా చేయడం ద్వారా ఆ కల మనస్సు నుంచి బయటకు వెళ్తుంది. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత అర్ధరాత్రి వచ్చిన కలలు గుర్తుకు రావు. ప్రశాంతమైన మనస్సుతో రోజును ప్రారంభంచవచ్చు.
READ MORE: Instagram Love: నాకు ప్రియుడే కావాలి.. కన్నబిడ్డను బస్టాండ్ లో వదిలి తల్లి జంప్
పీడకలలు వచ్చినప్పుడల్లా ఇతరులకు వాటి గురించి చెప్పడం చాలామందికి అలవాటు. అయితే శాస్త్రాల ప్రకారం కొన్ని విషయాలను రహస్యంగా ఉంచితేనే మంచిది. పీడకలలను ఒకే సమయంలోనే మర్చిపోవాలి. అది ఇతరులకు వ్యక్తపరచకూడదు. ఇలా చేయడం ద్వారా మనిషి ఇదే విషయం గురించి మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ కలల్లో ఉంటాడు. కలలో జరిగిన సంఘటన వారి మనస్సులో నుంచి అంత త్వరగా బయటకు రాదు. మళ్లీ మళ్లీ వాటినే గుర్తుకుతెచ్చుకుంటారు. అందువల్ల ఒత్తిడిని నివారించడానికి ఇతరులతో పీడకలలను పంచకోకపోవడం మంచిది.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
