Site icon NTV Telugu

Millet Dosa Recipe: షుగర్ కంట్రోల్ నుంచి గుండె ఆరోగ్యం వరకు.. రైస్ లేకుండా చేసే మిల్లెట్ దోస రెసిపీ మీకోసం

Millet Dosa Recipe

Millet Dosa Recipe

Millet Dosa Recipe: రోజూ ఇంట్లో చేసుకునే ఇడ్లీ, దోసలకంటే భిన్నంగా.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన చిరుధాన్యాలతో తయారుచేసే మిల్లెట్ దోస గురించి ఈ రోజు తెలుసుకుందాం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సరిపోయే ఈ రెసిపీ పోషక విలువలతో నిండి ఉండటమే కాకుండా.. వెయిట్ లాస్ కావాలనుకునేవారికి కూడా బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ముఖ్యంగా ఇందులో బియ్యం అసలు ఉపయోగించకపోవడం దీని ప్రత్యేకత. ఆరోగ్యం + రుచి రెండూ కలిసిన ఈ మిల్లెట్ దోసను ఇంట్లో ఎలా సులభంగా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం.

Rishabh Pant: నేడే న్యూజిలాండ్‌తో వన్డేలకు టీమిండియా జట్టు ఎంపిక .. పంత్‌కు ఛాన్స్ ఉందా?

మిల్లెట్ దోసకు అవసరమైన పదార్థాలు:
ముందుగా దోస బ్యాటర్ తయారుచేయాలి. అందుకోసం ఒక బౌల్ తీసుకుని కింది పదార్థాలను వేసుకోవాలి.
* మినపగుళ్లు – 1 కప్పు

* రాగులు – అర కప్పు

* సామలు – అర కప్పు

* జొన్నలు – అర కప్పు

* కొర్రలు – అర కప్పు

* అటుకులు – అర కప్పు

* మెంతులు – 1 టీ స్పూన్

నానబెట్టడం & పిండి రుబ్బడం:
అన్ని చిరుధాన్యాలు, అటుకులు, మెంతులు వేసిన తర్వాత రెండు, మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఆపై నిండుగా నీళ్లు పోసి కనీసం 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టాలి. చిరుధాన్యాలు మెత్తబడేందుకు సాధారణ దోస పిండికంటే ఎక్కువ సమయం పడుతుంది. నానబెట్టిన తర్వాత మిక్సీ లేదా గ్రైండర్‌లో మీడియం కన్సిస్టెన్సీ వచ్చేలా మెత్తగా రుబ్బుకోవాలి. ఎక్కువ నీళ్లు వేయకూడదు. అలాగే పిండి చాలా గట్టిగా కూడా ఉండకూడదు.

ఇక రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి 8 నుంచి 10 గంటల పాటు ఫెర్మెంట్ అవ్వనివ్వాలి. చలికాలంలో పులియకపోతే పై నుంచి ఒక గుడ్డతో కప్పి ఉంచితే మంచిది. మరుసటి రోజు పిండి బాగా పులిసి పొంగుతుంది. అవసరమైనంత పిండి తీసుకుని మిగిలినదాన్ని ఫ్రిడ్జ్‌లో 3 రోజులు నిల్వ చేసుకోవచ్చు. పిండిలో రుచికి తగినంత ఉప్పు కలపాలి. పిండి కన్సిస్టెన్సీ సరైనట్లుగా ఉండాలి. గట్టిగా ఉంటే కొద్దిగా నీరు కలపవచ్చు. ఆపై పెనాన్ని బాగా వేడెక్కించి కొద్దిగా నీళ్లు చల్లి, రెండు చుక్కల నూనె వేసి ఉల్లిపాయతో రుద్ది దోస వేయాలి.

Virat Kohli: 2026లో విరాట్ కోహ్లీ ముందు మూడు భారీ రికార్డులు.. సాధిస్తాడా..?

చిరుధాన్యాల ఆరోగ్య ప్రయోజనాలు:
రాగులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి.. అలాగే ఎముకలను బలంగా చేస్తాయి. జుట్టు, చర్మానికి కూడా మంచి పోషణ అందిస్తాయి. సామలు షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయడంతో పాటు గుండె సమస్యలు రాకుండా చేస్తాయి. జీర్ణశక్తిని పెంచి కొన్ని రకాల క్యాన్సర్‌లను దూరం ఉంచడంలో కూడా సహాయపడతాయి. జొన్నలు బోన్ హెల్త్, హార్ట్ హెల్త్‌ను మెరుగుపరచి, డైజెస్టివ్ సిస్టమ్‌ను బలోపేతం చేస్తాయి. డయాబెటిస్ కంట్రోల్‌కు కూడా ఉపకరిస్తాయి. కొర్రలు ఎముకలు, మసిల్స్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇమ్యూనిటీని పెంచి జుట్టు, చర్మానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి.

Exit mobile version