NTV Telugu Site icon

Health: చన్నీళ్ల స్నానంతో మేలే ఎక్కువ

Health

Health

Health: ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగిన తరువాత స్నానం చేసుకొని తమ పనులు ప్రారంభిస్తారు. అయితే స్నానం చేసే విషయంలో కొందరు చన్నీళ్లతో చేస్తే.. మరికొందరు వేడి నీటితో చేస్తారు. కొందరు కాలాలకు అతీతంగా ఎప్పుడూ చన్నీళ్లతోనే స్నానం చేస్తారు. మరికొందరు ఎప్పుడూ వేడి నీటితో స్నానం చేస్తారు. కానీ వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయో చాలామందికి తెలియదు. చల్లని నీటితో స్నానం వల్ల దీర్ఘకాలికంగా లాభం లేదా నష్టం చేకూర్చే అంశాలేంటో పరిశీలిస్తే…

Read also: Lemon For Diabetes: డయాబెటిక్ పేషెంట్లకు నిమ్మరసం ఎంతో మేలు.. ఐదు రకాలుగా తీసుకోవచ్చు!

చాలామంది చల్లని నీళ్లు తాగినా, చల్లటి నీటితో స్నానం చేసినా జలుబు, దగ్గు వస్తుందని భయపడుతుంటారు. వాస్తవానికి ఇది నిజం కాదు. చన్నీటితో స్నానం చేస్తే నెల రోజుల్లో బరువు తగ్గుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. చన్నీటితో స్నానం చేస్తే రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుందంటున్నారు. చన్నీళ్లు శరీరానికి తగిలినప్పుడు రక్తప్రసరణ పెరిగి గుండె ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. ముఖ్యంగా శరీరంలో అనారోగ్యాలతో పోరాడే తెల్ల రక్తకణాల వృద్ధికి చన్నీళ్లు దోహదపడతాయని.. రోగ నిరోధక శక్తి మెరుగుపడటానికి కూడా చన్నీళ్ల స్నానం ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

Read also: TS Congress: నేడు ‘దశాబ్ది దగా’ ధర్నా.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల హౌస్ అరెస్ట్

శరీరానికి అలసట, మనసుకు ఒత్తిడిగా ఉన్నప్పుడు చల్లని నీటితో స్నానం చేస్తే మంచి ఉపశమనం ఉంటుందంటున్నారు. ఇక ఊపిరితిత్తులు బాగా పనిచేయడానికి కూడా చన్నీటి స్నానం ఎంతో ఉపయోగపడుతుందట. కాలాలకు అతీతంగా చన్నీటి స్నానం చేస్తే మంచిదనే చెబుతున్నారు. చలికాలంలో సైతం చల్లని నీటితో స్నానం చేయడం మంచిది. శరీర దృఢత్వానికి కూడా చన్నీళ్ల స్నానం ఉపయోగపడుతుందంటున్నారు. చర్మ సంరక్షణకు కూడా చన్నీళ్లు ఎంతగానో ఉపయోగపడుతాయని వైద్యుల సలహా. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల కలిగే లాభాలతోపాటు కొంత నష్టం కూడా ఉంది. చల్లటి నీళ్లు రక్తప్రసరణను వేగవంతం చేస్తాయి. కాబట్టి చల్లటి నీటితో స్నానం చేసినపుడు ఒక్కసారిగా వేడిగా ఉన్న శరీరంపై చల్లటి నీళ్లు పోస్తే గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుందని.. కాబట్టి చల్లటి నీటితో స్నానం చేసే సమయంలో పాదాల నుంచి ప్రారంభించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వలన గుండెపై ఎటువంటి ప్రెషర్‌ పడదని వైద్యులు చెబుతున్న మాట.