Site icon NTV Telugu

Kaju Paneer Masala: రెస్టారెంట్ స్టైల్‌లో ‘కాజు పన్నీర్ మసాలా’ ఇంట్లోనే ఇలా చేయండి.. మీవారితో శబాష్ అనిపించుకోండి!

Kaju Paneer Masala

Kaju Paneer Masala

Kaju Paneer Masala: ‘కాజు పన్నీర్ మసాలా’ అనేది రిచ్, క్రీమీ, రుచికరమైన నార్త్ ఇండియన్ గ్రేవీ వంటకం. ఇది ముఖ్యంగా పన్నీర్, కాజుల సమ్మేళనంతో తయారవుతుంది. శాకాహారులు అమితంగా ఇష్టపడే ఈ కర్రీని ప్రతిసారి రెస్టారెంట్ నుండి ఆర్డర్ చేసే బదులు మీరే ఇంట్లోనే తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళతో వావ్ అనిపించుకోండి. మరి దీని కోసం ఏమి చేయాలో ఒకసారి చూద్దామా..

కాజు పన్నీర్ మసాలా తయారీ విధానం:
అవసరమైన పదార్థాలు:
పన్నీర్ – 200 గ్రాములు (చిన్న ముక్కలుగా కోసినవి)

కాజు (జీడిపప్పు) – 10 నుండి 12.

ఉల్లిపాయ – 1 (తరిగినది)

టమోటా – 2 (తరిగినవి)

అల్లం – 1 చిన్న ముక్క

వెల్లుల్లి రెబ్బలు – 2

నెయ్యి/నూనె – 2 టేబుల్ స్పూన్లు

Tamannaah : వాళ్లు నా బాడీని అలానే చూస్తారు.. తమన్నా షాకింగ్ కామెంట్స్

జీలకర్ర – అర టీస్పూన్

లవంగం – 2

దాల్చిన చెక్క – 1 చిన్న ముక్క

బిర్యాని పత్తా – 1

మిరప పొడి – అర టీస్పూన్

ధనియాల పొడి – అర టీస్పూన్

జీలకర పొడి – పావు టీస్పూన్

గరం మసాలా – పావు టీస్పూన్

ఉప్పు – రుచికి తగినంత

ఫ్రెష్ క్రీమ్ లేదా పాలు – 2 టేబుల్ స్పూన్లు లేదా అర కప్పు

కొత్తిమీర – గార్నిష్‌కు తగినంత

తయారీ విధానం:

ముందుగా పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో కాజులు, తరిగిన ఉల్లిపాయ, టమోటాలు, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు వేసి 4-5 నిమిషాలు మీడియం మంటపై వేయించాలి. అలా వేయించగా అవి మెత్తగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీకి వేసి నీళ్లు తక్కువగా వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.

ఇక మరో పాన్‌లో నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర, లవంగం, దాల్చిన చెక్క, బిర్యాని పత్తా వేసి వేయించాలి. ఇప్పుడు ముందుగా తయారుచేసిన పేస్ట్‌ను వేసి బాగా కలపాలి. మిశ్రమం నుండి నూనె బయటకు వచ్చే వరకూ మీడియం మంటపై వేయించాలి. అప్పుడప్పుడు మధ్యలో గరిటతో కలబెట్టుకోవాలి. పాన్‌లో పన్నీర్ ను ముందుగా లైట్‌గా రోస్ట్ చేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది.

Prajwal Revanna: ఖైదీ నెంబర్ 15528.. ప్రజ్వల్ రేవణ్ణ ‘‘జీవిత ఖైదు’’ ప్రారంభం..

ఇక ఆ మిశ్రమంలో మిరప పొడి, ధనియాల పొడి, జీలకర పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. నీరు అవసరమైతే కొద్దిగా వేసి కర్రీ చిక్కగా ఉండేలా చేసుకోండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసి మసాలాలో బాగా కలపాలి. ఆ తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు సిమ్మర్ మంటపై ఉడకనివ్వాలి. చివరగా ఫ్రెష్ క్రీమ్ లేదా పాలు వేసి మిశ్రమాన్ని కొంచెం చిక్కగా అయ్యేలా మరిగించాలి. ఇక స్టవ్ ఆఫ్ చేశాక కొత్తిమీరతో గార్నిష్ చేయండి. ఇక అంతే మీకు కావాల్సిన కమ్మని రెస్టారెంట్ స్టైల్ లో ‘కాజూ పన్నీర్ మసాలా’ ఇంట్లోనే రెడీ. ఈ కాజూ పన్నీర్ మసాలాను నాన్, రోటీ, పుల్కా, బటర్ నాన్, జీరా రైస్ వంటి వాటితో వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.

Exit mobile version