Kaju Paneer Masala: రెస్టారెంట్ స్టైల్‌లో ‘కాజు పన్నీర్ మసాలా’ ఇంట్లోనే ఇలా చేయండి.. మీవారితో శబాష్ అనిపించుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaju Paneer Masala: ‘కాజు పన్నీర్ మసాలా’ అనేది రిచ్, క్రీమీ, రుచికరమైన నార్త్ ఇండియన్ గ్రేవీ వంటకం. ఇది ముఖ్యంగా పన్నీర్, కాజుల సమ్మేళనంతో తయారవుతుంది. శాకాహారులు అమితంగా ఇష్టపడే ఈ కర్రీని ప్రతిసారి రెస్టారెంట్ నుండి ఆర్డర్ చేసే బదులు మీరే ఇంట్లోనే తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళతో వావ్ అనిపించుకోండి. మరి దీని కోసం ఏమి చేయాలో ఒకసారి చూద్దామా..
కాజు పన్నీర్ మసాలా తయారీ విధానం:
అవసరమైన పదార్థాలు:
పన్నీర్ – 200 గ్రాములు (చిన్న ముక్కలుగా కోసినవి)
Also Read
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
కాజు (జీడిపప్పు) – 10 నుండి 12.
ఉల్లిపాయ – 1 (తరిగినది)
టమోటా – 2 (తరిగినవి)
అల్లం – 1 చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు – 2
నెయ్యి/నూనె – 2 టేబుల్ స్పూన్లు
Tamannaah : వాళ్లు నా బాడీని అలానే చూస్తారు.. తమన్నా షాకింగ్ కామెంట్స్
జీలకర్ర – అర టీస్పూన్
లవంగం – 2
దాల్చిన చెక్క – 1 చిన్న ముక్క
బిర్యాని పత్తా – 1
మిరప పొడి – అర టీస్పూన్
ధనియాల పొడి – అర టీస్పూన్
జీలకర పొడి – పావు టీస్పూన్
గరం మసాలా – పావు టీస్పూన్
ఉప్పు – రుచికి తగినంత
ఫ్రెష్ క్రీమ్ లేదా పాలు – 2 టేబుల్ స్పూన్లు లేదా అర కప్పు
కొత్తిమీర – గార్నిష్‌కు తగినంత
తయారీ విధానం:
ముందుగా పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో కాజులు, తరిగిన ఉల్లిపాయ, టమోటాలు, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు వేసి 4-5 నిమిషాలు మీడియం మంటపై వేయించాలి. అలా వేయించగా అవి మెత్తగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీకి వేసి నీళ్లు తక్కువగా వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.
ఇక మరో పాన్‌లో నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర, లవంగం, దాల్చిన చెక్క, బిర్యాని పత్తా వేసి వేయించాలి. ఇప్పుడు ముందుగా తయారుచేసిన పేస్ట్‌ను వేసి బాగా కలపాలి. మిశ్రమం నుండి నూనె బయటకు వచ్చే వరకూ మీడియం మంటపై వేయించాలి. అప్పుడప్పుడు మధ్యలో గరిటతో కలబెట్టుకోవాలి. పాన్‌లో పన్నీర్ ను ముందుగా లైట్‌గా రోస్ట్ చేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది.
Prajwal Revanna: ఖైదీ నెంబర్ 15528.. ప్రజ్వల్ రేవణ్ణ ‘‘జీవిత ఖైదు’’ ప్రారంభం..
ఇక ఆ మిశ్రమంలో మిరప పొడి, ధనియాల పొడి, జీలకర పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. నీరు అవసరమైతే కొద్దిగా వేసి కర్రీ చిక్కగా ఉండేలా చేసుకోండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసి మసాలాలో బాగా కలపాలి. ఆ తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు సిమ్మర్ మంటపై ఉడకనివ్వాలి. చివరగా ఫ్రెష్ క్రీమ్ లేదా పాలు వేసి మిశ్రమాన్ని కొంచెం చిక్కగా అయ్యేలా మరిగించాలి. ఇక స్టవ్ ఆఫ్ చేశాక కొత్తిమీరతో గార్నిష్ చేయండి. ఇక అంతే మీకు కావాల్సిన కమ్మని రెస్టారెంట్ స్టైల్ లో ‘కాజూ పన్నీర్ మసాలా’ ఇంట్లోనే రెడీ. ఈ కాజూ పన్నీర్ మసాలాను నాన్, రోటీ, పుల్కా, బటర్ నాన్, జీరా రైస్ వంటి వాటితో వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.
తాజావార్తలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?