నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ అంటే దాదాపు అందరికి ఇష్టమైన వంటకం. చికెన్ రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చికెన్లో ఉండే ప్రోటీన్ మంచి మూలం తినడం వల్ల.. శరీరంలో ప్రోటీన్ లోపం సమస్య ఉండదు. ఇదిలా ఉంటే.. చికెన్లో ఎక్కువగా చికెన్ బిర్యానీ, బటర్ చికెన్ ను జనాలు తింటారు. అయితే ప్రతిసారీ ఇలాంటివి కాకుండా.. కొన్నిసార్లు కొత్తగా ట్రై చేయండి. చికెన్తో చికెన్ కీమా మటర్‌ను తయారు చేసుకోండి. అప్పుడు ఎంతో ఇష్టంతో లొట్టలేసుకుని తింటారు. చికెన్ కీమా మటర్ తయారు చేసుకునే పద్ధతి తెలుసుకుందాం.
Skoda: బ్రెజ్జా, నెక్సాన్‌కి పోటీగా రాబోతున్న స్కోడా కార్..
కావాల్సిన పదార్ధాలు:
1 కిలో చికెన్ కీమా
కప్పున్నర పచ్చి బఠానీలు
4 నల్ల ఏలకులు
2 బే ఆకులు
1/2 టీస్పూన్ నల్ల మిరియాలు
1/2 టీస్పూన్ జీలకర్ర
2 టేబుల్ స్పూన్లు అల్లం-వెల్లుల్లి పేస్ట్
కప్పున్నర సన్నగా తరిగిన ఉల్లిపాయ
2 కప్పులు సన్నగా తరిగిన టమోటాలు
1/2 కప్పు పెరుగు
1 టీస్పూన్ కాశ్మీరీ ఎర్ర మిరపకాయ
1 టీస్పూన్ కొత్తిమీర పొడి
1 టీస్పూన్ గరం మసాలా
2 టీస్పూన్లు కసూరి మేతి
2 టేబుల్ స్పూన్లు మాంసం మసాలా
నెయ్యి/నూనె
ఉప్పు (సరిపడినంత)
IND vs BAN: భారత్ – బంగ్లాదేశ్ మధ్య జరిగిన కీలక ఒప్పందాలు ఇవే…
తయారు చేసే పద్ధతి
ఒక పాన్ తీసుకుని అందులో కొంచెం నూనె వేసి వేడి చేయాలి. అది వేడి అయ్యాక బే ఆకులు, ఎండు యాలకులు, ఎండుమిర్చి వేసి సువాసన వచ్చే వరకు ఉడికించి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత.. జీలకర్ర వేసి అవి పగిలిపోయే వరకు ఉడికించాలి. ఆ తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఉడికించాలి. తర్వాత మంటను తక్కువకు తగ్గించి, తరిగిన ఉల్లిపాయను పాన్‌లో వేసి కొద్దిగా కలర్ వచ్చే వరకు ఉడికించాలి. ఆ తర్వాత.. అందులో టొమాటో ముక్కలు వేసి బాగా కలపాలి. తర్వాత పాన్ పై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. ఆ తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి.
నూనె వేరు అవుతున్న సమయంలో కొత్తిమీర పొడి, కాశ్మీరీ ఎర్ర కారం పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, పొడి మసాలా దినుసులు వేయాలి. తర్వాత కొంచెం పెరుగులో కసూరి మేతి కలిపి వేయాలి. ఆ తర్వాత బాగా కలపాలి. ఆ తర్వాత చికెన్ ముక్కలు వేయండి. ముద్దలు ఉండకుండా కలుపుతూనే ఉండాలి. అరగంట సేపు ఉడికిన తర్వాత చికెన్ మసాలా వేసి బాగా కలపాలి. ఆ తర్వాత.. చికెన్ కీమా మటర్ రెడీ. చివర్లో కొత్తిమీర వేసి కలిపి తినేయడమే.