NTV Telugu Site icon

Beauty Tips: బీట్‌రూట్‌తో ఇలా చేస్తే మెరిసే అందం మీ సొంతం..

Beetroot

Beetroot

చలికాలంలో చర్మం తరచుగా పొడిగా, నిర్జీవంగా మారుతుంది. అలా అని బాధపడాల్సిన అవసం లేదు. ఎందుకంటే బీట్‌రూట్ మీ చర్మానికి అద్భుతంగా పని చేస్తుంది. బీట్‌రూట్ ఆరోగ్యంతో పాటు మీ అందానికి కూడా పని చేస్తుంది. ఇంట్లోనే బీట్‌రూట్ బ్లష్‌ను తయారు చేసుకుని వాడటం వల్ల మీ చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది. బీట్ రూట్ మీ బుగ్గలకు గులాబీ రంగును ఇవ్వడమే కాకుండా.. మీ చర్మానికి పోషణను అందిస్తుంది. బీట్‌రూట్ బ్లష్‌ను ఎలా తయారు చేయడం.. ఎలా ఉపయోగించడం తెలుసుకుందాం.

Vimal Masala Soda: ఎంతకు తెగించార్రా.. విమల్ పాన్ మసాలా ట్రై చేసారా మీరు.. వీడియో వైరల్

బీట్‌రూట్ బ్లష్ చేయడానికి కావలసిన పదార్థాలు:
బీట్‌రూట్
గ్లిజరిన్ (కొన్ని చుక్కలు)
ఒక చిన్న కంటైనర్

బీట్‌రూట్ బ్లష్ ఎలా తయారు చేయాలి..?
ముందుగా బీట్‌రూట్‌ను బాగా కడిగి వేడి నీటిలో ఉడకబెట్టాలి. ఉడకబెట్టడం వల్ల బీట్‌రూట్ రంగు ముదురు, మరింత ప్రకాశవంతంగా మారుతుంది. ఆ తర్వాత ఉడకబెట్టిన బీట్‌రూట్‌ను చల్లారనిచ్చి, తొక్క తీసి దాని గుజ్జును తీయాలి. కావాలంటే బ్లెండర్‌లో కూడా రుబ్బుకోవచ్చు. ఆ తర్వాత.. బీట్‌రూట్ గుజ్జులో కొన్ని చుక్కల గ్లిజరిన్ కలపాలి. గ్లిజరిన్ బ్లష్‌ను మాయిశ్చరైజింగ్ చేస్తుంది.. మీ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.. తయారు చేసిన మిశ్రమాన్ని చిన్న, శుభ్రమైన కంటైనర్‌లో వేసుకుని రిఫ్రిజిరేటర్‌లో స్టోరేజ్ చేసుకోవచ్చు.

బీట్‌రూట్ బ్లష్ ఉపయోగించడం ఎలా..?
బ్లష్ అప్లై చేసే ముందు మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
మీరు మీ వేళ్లు లేదా ఫేస్ బ్రష్ సహాయంతో మీ బుగ్గలపై బ్లష్‌ను అప్లై చేయవచ్చు.
బ్లష్‌ను సున్నితంగా పూయాలి.. తద్వారా ఇది సహజంగా కనిపిస్తుంది.
బ్లష్‌ను ఎక్కువగా పూయవద్దు, మీ ముఖం కృత్రిమంగా కనిపిస్తుంది.

బీట్‌రూట్ బ్లష్ ఎందుకు ప్రయోజనకరం..?
బీట్‌రూట్ బ్లష్ పూర్తిగా సహజమైనది.. హానికరమైన రసాయనాలను కలిగి ఉండదు.
బీట్‌రూట్‌లో మీ చర్మాన్ని పోషించే విటమిన్లు, మినరల్స్ ఉంటాన్నాయి.
బీట్‌రూట్ మీ చర్మానికి సహజమైన పింక్ గ్లో ఇస్తుంది.