NTV Telugu Site icon

Lemon For Diabetes: డయాబెటిక్ పేషెంట్లకు నిమ్మరసం ఎంతో మేలు.. ఐదు రకాలుగా తీసుకోవచ్చు!

Lemon For Diabetes

Lemon For Diabetes

5 ways to add lemon to your Diabetes Diet: మనం ఎక్కువగా ఉపయోగించే కూరగాయలలో ‘నిమ్మకాయ’ ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ‘విటమిన్ సి’ పుష్కలంగా ఉంటుంది. పుల్లని రుచి కలిగిన కలిగిన వాటిని తినాలని ఆరోగ్య నిపుణులు తరచుగా చెబుతుంటారు. ఇందులో ఫైబర్, క్యాల్షియం, పొటాషియం, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. నిమ్మకాయతో రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రించచ్చు. మధుమేహ రోగులకు ఇది దివ్యౌషధం ( Health Benfits of Lemon) లాంటిది. నిమ్మకాయను ఎన్ని రకాలుగా తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

# మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే.. భోజనానికి ముందు ఒక గ్లాసు నీరులో నిమ్మరసం, గల్ల ఉప్పు కలుపుకుని తాగడం మంచిది.

# రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఒక ప్రభావవంతమైన మార్గం రోజూ భోజనంలో నిమ్మరసం తీసుకోవడం. పప్పు, కూరగాయలు, నాన్-వెజ్ ఐటమ్స్ వండినా అందులో నిమ్మరసం కలపాలి.

Also Read: Increase Blood Tips: ఈ జ్యూస్‌లు తాగితే.. శరీరంలో రక్తం ఇట్టే పెరుగుగుతుంది! టాబ్లెట్స్ అవసరం లేదు

# ఉదయం నుంచి సాయంత్రం వరకు టీ తాగే వారు మనలో చాలా మంది ఉన్నారు. కానీ మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే బ్లాక్ టీ లేదా గ్రీన్ టీలో నిమ్మరసం కలిపి తాగితే ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

# మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే మీరు చిరుతిళ్లతో నిమ్మరసం కలుపుకుని తొనొచ్చు. ముఖ్యంగా వేరుశెనగతో కలిపి తింటే చాలా ప్రయోజనం ఉంటుంది. ఇలా చేయడం వల్ల షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది.

# రోజువారీ భోజనం సమయంలో చాలా మంది తరచుగా సలాడ్ తీసుకుంటారు. అందులో నిమ్మరసం కలిపి తినండి. నిమ్మకాయలో ఉండే పొటాషియం మరియు విటమిన్లు మధుమేహ రోగులకు చాలా మేలు చేస్తాయి.

Also Read: Fastest Hundred in ODI: వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు.. అగ్రస్థానంలో ఏబీ డివిలియర్స్! టాప్ 10లో భారత్ నుంచి ఒక్కడే

Show comments