శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జీవనశైలి, ఆహారం రెండూ సరిగ్గా ఉండటం అవసరం. వేగంగా పెరుగుతున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ఊబకాయం ప్రధాన కారణం. అధిక బరువు వల్ల మధుమేహం, రక్తపోటు, కాలేయం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రోజుల్లో పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ బరువు పెరుగుట సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా బరువును నియంత్రించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే.. ప్రతి వ్యక్తి వారి వయస్సు.. ఎత్తును బట్టి ఎంత బరువు ఉండాలో తెలుసుకోవడం ముఖ్యం. స్త్రీలు, పురుషులు వారి వయస్సు.. ఎత్తు ప్రకారం ఎంత బరువు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది వ్యక్తులు తమ బరువు ఎలా ఉండాలో తెలుసుకోవాలనుకుంటారు. అయితే.. అందరికీ ఒకే రకమైన బరువు ఉండకూడదు. అందుకోసం.. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ద్వారా బరువు స్థితిని తెలుసుకోవాలి. సాధారణంగా BMI 18.5 నుండి 24.9 మధ్య ఉంటే ఆరోగ్యంగా పరిగణించబడుతుంది. అయితే 25 నుండి 30 మధ్య ఉన్న BMI అధిక బరువుగా పరిగణించబడుతుంది. ఇక.. పెరుగుతున్న పిల్లల బరువు వారి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ఒక నెల శిశువు ఎత్తు 53 సెం.మీ ఉంటే.. బరువు 4.35 కిలోలు ఉండాలి. అదేవిధంగా.. 3 నెలల పిల్లల ఎత్తు 60 సెం.మీ ఉంటే.. బరువు 6 కిలోలు ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లని అర్థం.
పిల్లల్లో వయస్సు, ఎంత బరువు ఉండాలో తెలుసుకుందాం..
4 నెలల పిల్లలు 62 సెం.మీ పొడవు, 6.5 కిలోలు ఉండాలి.
6 నెలల పిల్లలు 64 సెం.మీ పొడవు, 7.5 కిలోలు ఉండాలి.
9 నెలల పిల్లలు 70 సెం.మీ పొడవు, 8.5 కిలోలు ఉండాలి.
12 నెలల పిల్లలు 74 సెం.మీ పొడవు, 9-10 కిలోలు ఉండాలి
ఏడాదిన్నర పిల్లలు 80 సెం.మీ పొడవు, 10-11
రెండు సంవత్సరాల పిల్లలు 85 సెం.మీ పొడవు, 11.75-13 కేజీల బరువు ఉండాలి.
పురుషుల ఎత్తు, బరువు:
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధ్యస్థ శరీర నిర్మాణం 5’4 నుండి 6’0 ఎత్తు ఉన్న పురుషులకు అనువైన బరువు 50 నుండి 73 కిలోలు. బరువు ఎంత అదుపులో ఉంటే వ్యాధుల నుంచి అంత రక్షణ ఉంటుంది.
4’6 పొడవు, బరువు 29-34
4’8 పొడవు, బరువు 34-40
4’10 పొడవు, బరువు 38-45
5’0 పొడవు, బరువు 43-53
5’2 పొడవు, బరువు 48-58
5’4 పొడవు, బరువు 53-64
5’6 పొడవు, బరువు 58-70
5’8 పొడవు, బరువు 63-76
6’0 పొడవు, బరువు 72-88 ఉండాలి.
మహిళల ఎత్తు, బరువు..
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధ్యస్థ శరీర నిర్మాణం మరియు 4’10” నుండి 5’8″ మధ్య ఎత్తు ఉన్న మహిళలకు అనువైన బరువు 45-59 కిలోలు ఉండాలి.
4’6 పొడవు, బరువు28-34
4’8 పొడవు, బరువు 32-39
4’10 పొడవు, బరువు 36-44
5’0 పొడవు, బరువు 40-49
5’2 పొడవు, బరువు 44-55
5’4 పొడవు, బరువు 49-59
5’6 పొడవు, బరువు 53-64
5’8 పొడవు, బరువు 57-69
6’0 పొడవు, బరువు 65-79 ఉండాలి.