Health Care: సైనస్‌ను సీరియస్ గా తీసుకోకపోతే.. బ్రెయిన్ ఫీవర్ కి దారితీస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health Care: వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రజలు ఆరోగ్య సమస్యలతో బాధ పడతారు. ప్రధానంగా వాతావరణ మార్పుతో సీజనల్ వ్యాధులు బాగా ఇబ్బంది పెడతాయి. వాటిలో చల్లదనంతో వచ్చే వ్యాధులు ఉన్న వారికైతే వర్షాకాలం ముగిసే వరకు నరకంగా ఉంటుంది. అటువంటి వాటిలో ఒకటి సైనస్. సైనస్‌ను సీరియస్‌గా తీసుకోవాలని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా సైనస్‌ను సీరియస్ గా తీసుకోకపోతే.. బ్రెయిన్ ఫీవర్ కి దారితీసి పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే సైనస్ అనేది సీజన్‌తో సంబంధం లేకుండా వచ్చే సమస్య. అయితే అందరూఈ సమస్యని కామన్ గా తీసుకుంటారు. కానీ అశ్రద్ధ చేస్తే బ్రెయిన్ ఫీవర్ కి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తునా్నరు. ఎలా అంటే ..
Read also: Loksabha Election : 2024లో ప్రతిపక్షాల ఐక్యత మోడీని ఓడించగలదా ? ప్రజల అభిప్రాయం ఏంటి?
Also Read
- Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
ఇపుడు సైనస్ సాధారణ సమస్యగా మారిపోయింది. అయితే సైనస్ వల్ల కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. దీనివల్ల వచ్చే ఇబ్బంది భరించిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఇది వర్షాకాలంలో మాత్రమే ఇబ్బంది పెడుతుంది అని చాలామంది అనుకుంటారు.. కానీ కాలాలతో సంబంధం లేకుండా ఇబ్బంది పెట్టే సమస్య సైనస్. చాలామంది ఈ సైనస్ సమస్యని సీరియస్ గా తీసుకోరు.. ఒకానొక దశ దాటితే సైనస్ బ్రెయిన్ ఫీవర్ కి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి సైనస్‌తో జాగ్రత్త ఉండాలని సూచిస్తున్నారు. సైనస్ అంటే.. ముఖంలో కళ్ళ దగ్గర ముక్కు పక్క భాగంలో ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండిన ప్రదేశాన్ని సైనస్ అంటారు. ఇందులో మెత్తని పొర ఉంటుంది. ఇది మ్యూకస్ మెమరీయన్ అనే పలుచని ద్రవాన్ని తయారు చేస్తుంది. ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరంలో పీల్చుకున్న గాలికి సరి అయిన ఉష్ణోగ్రత తేమని కల్పిస్తుంది ఈ ద్రవపదార్థం. ఈ భాగం ఇన్ఫెక్షన్లకి గురైతే.. దాన్నే సైనసైటిస్(సైనస్) అంటారు.
Read also: OMG: కోపంతో ప్రియుడిపైకి ఐదు సార్లు కారు ఎక్కించి చంపిన ప్రియురాలు
సైనస్ సాధారణ స్థితిలో ఉన్నప్పుడు చిన్నచిన్న చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. శరీరంలోకి ఎక్కించే సెలైన్ ను పీలిస్తే ముక్కు రంధ్రాలు క్లియర్ అవుతాయని ఎన్హెచ్ఎస్ నివేదిక వెల్లడించింది. దాంతోపాటు నీటిలో కొంచెం ఉప్పు బేకింగ్ సోడా వేసి దానిని వాసన చూసినా ముక్కు రంధ్రాలు శుభ్రపడతాయని చెబుతున్నారు. అలాగే ఆవిరి పట్టటం అయితే సైనస్ కి బ్రహ్మాస్త్రం లాంటిది. సైనస్ ని తొలగించాలి అనుకుంటే ఎక్కువ మీరు త్రాగండి. గోరువెచ్చని నీరు తాగటం వల్ల సైనస్ నొప్పి తగ్గుతుంది. వీలైనంత మటుకు ఫ్రిజ్లో ఆహారాన్ని తినకుండా అవాయిడ్ చేయాలి. వేడి వేడి ఆహార పదార్థాలను తినడం వల్ల సైనస్ దరి చేరకుండా ఉంటుంది. గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల వేపర్ వేసి దానిని ఆవిరి పీల్చినా ఉపశమనం లభిస్తుంది. ఇదంతా సైనస్ అదుపులో ఉన్నప్పుడు మాత్రమే పాటించవలసిన చిట్కాలు మాత్రమే. అదే సమస్య చేయి దాటినప్పుడు తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.
- Tags
- brain fever
- care
- Health
- Seriously
- Sinus
తాజావార్తలు
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!