మహిళలు ప్రసవానికి ముందు, తర్వాత బరువు విపరీతంగా పెరుగుతారు. ప్రసవానికి ముందు ఆహారంలో పరిమాణం ఎక్కువగా ఉంటుంది. తనతో పాటు తన కడుపులో వున్న శిశువు గురించి ఆలోచిస్తారు కాబట్టి, కొసరి కొసరి తినిపించే వారు ఎక్కువగా ఉంటారు. వివిధ ఆహారపదార్ధాలు తీసుకునే విషయంలో నిబంధనలు ఉండవు. అయితే ప్రసవం అనంతరం బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. గర్భం ధరించినపుడు పెరిగే బరువు గురించి ఎక్కువ ఆందోళన పడడం సహజం. అప్పటివరకు మెయిన్ టైన్ చేసిన శారీరక ఆకృతి మార్చుకుంటుంది. ఈ విషయం గురించి గర్భిణి స్త్రీలు ముందు ఆందోళన తగ్గించుకోవాలి. గర్భం ధరించినపుడు బరువు పెరగడం అనేది సర్వ సాధారణమైన విషయం అని గుర్తించాలి.
గర్భంలో పెరిగే బిడ్డ గురించి పోషకాహారం తీసుకోవడం జరుగుతుంటుంది. ప్రసవం జరిగాక బరువు తగ్గే ప్రయత్నాలు చేయవచ్చు. తర్వాత యథాప్రకారం పూర్వపు ఆకృతి వచ్చేస్తుంది కూడా. మొదటి ఆరు నెలలు బిడ్డకు పాలిచ్చే క్రమంలో బరువు శీఘ్రంగానే తగ్గిపోతుంది కూడా. ప్రసవించిన ఆరు వారాల తర్వాత నుంచి వ్యాయామం మొదలు పెట్టుకోవచ్చు. కాబట్టి గర్భిణిగా వున్న సమయంలో పెరిగే బరువు గురించి ఆందోళన చెందవద్దు. డాక్టర్ల సలహాతో బరువు తగ్గించుకునే విషయాల గురించి ఆలోచించవచ్చు. బరువు తగ్గే విషయంలో డాక్టర్లు సూచించే వాటిని అమలుచేయాలి. ప్రతిరోజూ ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రసవం అనంతరం వ్యాయామంపై ఫోకస్ పెట్టాలి. ఉదయం ఖచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ అలవాటు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్పాహారం తీసుకునే అలవాటు వదలవద్దు.
అలాగే నిద్ర విషయంలో ప్లానింగ్ అవసరం. రోజూ ఏడుగంటలు రాత్రిళ్ళు ఖచ్చితంగా నిద్రపోవాలి. ఆహారం సమయానుకూలంగా ఉండాలి. ఆలస్యంగా ఆహారం తీసుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు. ఉదయం ఆహారంలో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉండాలి. ఎక్కువ ఫైబర్ ఉండే ఆహారం ఉండాలి. కొవ్వుపదార్ధాలు తక్కువగా తీసుకోవాలి. రాత్రి ఆహారం తక్కువగా ఉండాలి. తిన్న వెంటనే నిద్రపోవడం మంచిది కాదు. రోజూ అరగంట పాటు నడక వల్ల బరువు అదుపులో ఉంటుంది. ప్రసవం అనంతరం బరువు తగ్గడంపై దృష్టిపెడితే మీరు సంతూర్ బేబీలా మారతారు. స్లిమ్ గా తయారవుతారు.
Itlu Maredumilli Prajaneekam Teaser: మరో ‘నాంది’ని చూపించబోతున్న అల్లరి నరేష్