How to Reduce Belly Fat: మనం రోజు తినే ఆహారంలో గానీ, తినే సమయం గాని.. తూచా తప్పకుండా సరైన పద్ధతిలో వెళితే ఆరోగ్యం మన చెంతే ఉంటుంది. ప్రతీ ఒక్కరికి బరువు అనేది ప్రమాదకరమే. దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే డాక్టర్లు బరువు తగ్గడానికి వ్యాయామాలు చేయడం మంచిదని సలహాలు ఇస్తుంటారు. అయితే దానికోసం రకరకాల ఎక్సర్‌సైజ్‌లు చేయడం మొదలు పెడతారు. ఒకటి రెండు రోజులు చేయగానే బద్దకంతోనో, పని ఒత్తిడితోనో మధ్యలోనే మానేస్తుంటారు. దీని వల్ల బరువు తగ్గాలన్న కల.. కలగానే ఉండిపోతుంటుంది. అలాగే ప్రస్తుత కాలంలో పొట్ట బాగా పెరిగిపోతుంది.. పొట్ట తగ్గేందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం…
READ MORE: Papikondalu Boat Tourism: పర్యాటకులకు గుడ్‌న్యూస్.. పాపి కొండల విహారయాత్ర మళ్లీ ప్రారంభం..
బరువు తగ్గకుండా బొజ్జ కరగటం అసాధ్యం. బరువు హఠాత్తుగా తగ్గటమూ మంచిది కాదు. ఆహార, వ్యాయామాలతో వారానికి కిలో చొప్పున తగ్గేలా చూసుకోవాలి. ఆహారంలో రోజుకు 500 కేలరీలు తగ్గించుకోవాలి. అలాగే 45 నిమిషాల సేపు వ్యాయామాలు చేయటానికి ప్రయత్నించాలి. బస్కీలు, పుషప్స్ వంటి వ్యాయామాలు కడుపు, వెన్నెముక కండరాలు బలోపేతం కావటానికి తోడ్పడతాయి. ఇవి భంగిమను సరిచేయటం ద్వారా బొజ్జ లోపలికి వెళ్లేలా చూస్తాయి కూడా. సేతు బంధాసనం, భుజంగాసనం లాంటివీ మేలు చేస్తాయి. వ్యాయామాలకు తగినంత సమయం దొరక్కపోతే మధ్యమధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకుంటూ అతి వేగంగా వ్యాయామాలు చేసే పద్ధతి పాటించొచ్చు. ఇలా కొన్ని రోజులు చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. తప్పకుండా బొజ్జ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
READ MORE: Jodhpur University: యూనివర్సిటీ నిర్వాకం.. 100కి 123 మార్కులు.. మెమో చూసుకుని విద్యార్థులు ఆశ్చర్యం
