Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electrical Switch Boards Cleaning: కిచెన్‌లో వంట చేసేటప్పుడు వెలువడే నూనె పొగ కారణంగా స్విచ్‌బోర్డులు త్వరగా జిడ్డుగా, నల్లగా మారుతుంటాయి. సాధారణంగా పొడి క్లాత్‌తో తుడిచినా ఈ జిడ్డు పూర్తిగా తొలగదు. అయితే ఎలక్ట్రిక్ స్విచ్‌బోర్డులను నేరుగా నీరు లేదా తడి సబ్బు గుడ్డతో శుభ్రం చేయడం ప్రమాదకరం. నీరు లోపలికి వెళ్లే అవకాశం ఉండటంతో స్విచ్‌బోర్డు దెబ్బతినడమే కాకుండా విద్యుత్ షాక్ ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా మెయిన్ పవర్‌ను ఆఫ్ చేసి, సంబంధిత ఎంసీబీని డౌన్ చేసిన తర్వాతే స్విచ్‌బోర్డు శుభ్రం చేయాలి. పవర్ పూర్తిగా ఆఫ్‌లో ఉందని నిర్ధారించుకున్న తర్వాత బయట ఉపరితలాన్ని శుభ్రం చేయడానికి ఈ పద్ధతులను ఉపయోగించవచ్చు.
శానిటైజర్‌తో శుభ్రం
స్విచ్‌బోర్డుపై పేరుకున్న జిడ్డు, నల్లటి మురికిని తొలగించడానికి శానిటైజర్ ఉపయోగించవచ్చు. అయితే శానిటైజర్‌ను నేరుగా స్విచ్‌బోర్డుపై స్ప్రే చేయకూడదు. ముందుగా పవర్ ఆఫ్ చేసి.. ఆ తర్వాత కొద్దిగా శానిటైజర్‌ను శుభ్రమైన పొడి క్లాత్‌పై వేసి స్విచ్‌బోర్డును తుడవాలి.
Also Read
- How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
- Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
- Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
నెయిల్‌పాలిష్ రిమూవర్
జిడ్డు మరకలను తొలగించడానికి నెయిల్‌పాలిష్ రిమూవర్ కూడా ఉపయోగించవచ్చు. అయితే ఇందులోని అసిటోన్ వంటి పదార్థాలు కొన్ని ప్లాస్టిక్ స్విచ్ ప్లేట్లను దెబ్బతీయవచ్చు లేదా రంగును మార్చవచ్చు. కాబట్టి దీనిని ఉపయోగించాల్సి వస్తే ముందుగా చిన్నగా, కనిపించని ప్రాంతంలో పరీక్షించడం మంచిది. పవర్ పూర్తిగా ఆఫ్‌లో ఉన్నప్పుడే రిమూవర్ ను చాలా తక్కువ మొత్తాన్ని క్లాత్‌పై ఉపయోగించాలి.
వైప్స్‌తో శుభ్రం..
మార్కెట్లో లభించే వైప్స్‌తో స్విచ్‌బోర్డు బయట భాగాన్ని తుడవవచ్చు. అయితే వైప్ నుంచి నీరు లేదా ద్రవం కారేంత తడిగా ఉండకూడదు. స్విచ్‌లు, సాకెట్లలోని గ్యాప్‌ల్లోకి తేమ వెళ్లకుండా జాగ్రత్త పడాలి. శుభ్రం చేసిన తర్వాత పూర్తిగా పొడి మైక్రోఫైబర్ క్లాత్‌తో తుడవాలి.
టూత్‌బ్రష్‌తో
స్విచ్‌బోర్డు అంచులు, మూలల్లో పేరుకున్న దుమ్ము, మురికిని తొలగించడానికి పొడి, మెత్తని పాత టూత్‌బ్రష్ ఉపయోగించవచ్చు. అయితే టూత్‌పేస్ట్‌ను స్విచ్‌బోర్డుపై రుద్దడం కంటే పొడి బ్రష్‌తోనే మురికిని తొలగించడం సురక్షితం. అవసరమైతే పవర్ పూర్తిగా ఆఫ్‌లో ఉన్నప్పుడు తక్కువ తేమ ఉన్న క్లాత్‌తో బయట భాగాన్ని శుభ్రం చేసి వెంటనే పొడిగా తుడవాలి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
స్విచ్‌బోర్డు శుభ్రం చేసేటప్పుడు రబ్బర్ చెప్పులు వేసుకోవడం మాత్రమే సరిపోదు. ప్రధానంగా విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేయడం ముఖ్యం. ఎంసీబీని ఆఫ్ చేసిన తర్వాతే శుభ్రపరిచే పని ప్రారంభించాలి. స్విచ్‌బోర్డును తెరవడం, వైరింగ్‌ను తాకడం లేదా లోపలికి ద్రవం వెళ్లేలా శుభ్రం చేయడం మాత్రం చేయకూడదు. బోర్డు లోపల మురికి ఎక్కువగా ఉంటే లేదా ఏదైనా విద్యుత్ సమస్య కనిపిస్తే ఎలక్ట్రీషియన్ సహాయం తీసుకోవడం సురక్షితం.
తాజావార్తలు
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!