NTV Telugu Site icon

Breathing: ఒక్కో మనిషి రోజుకు ఎన్ని సార్లు శ్వాస తీసుకుంటాడో తెలుసా?

Breathing

Breathing

మానవ శరీరం ఒక అద్భుతం. దాని శారీరక ప్రక్రియలలో శ్వాస ఓ భాగం. ఇది మనందరి రోజువారి జీవితంలో భాగమైన సహజ ప్రక్రియ. శ్వాస ద్వారా శరీరానికి ఆక్సిజన్‌ను అందిస్తాము. అది శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఒక వ్యక్తి రోజులో ఎన్నిసార్లు ఊపిరి పీల్చుకుంటాడో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకుందాం..

READ MORE: Hamas: గాజాపై దాడి కారణంగానే ఆమ్‌స్టర్‌డామ్‌లో ఇజ్రాయెలీలపై దాడి

ఒక వ్యక్తి యొక్క శ్వాస రేటు అతని వయస్సు, ఆరోగ్యం, శారీరక స్థితిపై ఆధారపడి ఉంటుంది. కెనడియన్ లంగ్ అసోసియేషన్ ప్రకారం.. ఆరోగ్య కరమైన వ్యక్తి నిమిషానికి 12 నుంచి 20 సార్లు శ్వాస తీసుకుంటాడు. అంటే ఒక వ్యక్తి 24 గంటల్లో సుమారు 22000 నుంచి 28800 సార్లు శ్వాస తీసుకుంటాడట. గణించడం అంత సులభం కానప్పటికీ.. ఈ గణాంకాలు సగటు ప్రాతిపదికన లెక్కించబడ్డాయి. ఈ సంఖ్య సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తికి వర్తిస్తుంది. ఇలా కాకుండా ఆ వ్యక్తి ఏదైనా ఆరోగ్య సమస్య లేదా శారీరక సమస్యను ఎదుర్కొంటే అది మారవచ్చు. కాగా.. సగటు వయోజన పురుషుని ఊపిరితిత్తులు గరిష్ఠంగా 6 లీటర్ల గాలిని వాటిలో ఉంచుకోగలవని అమెరికన్ లంగ్ అసోషియేషన్ తెలిపింది. ప్రతి రోజూ ఒక వ్యక్తి 7,570 లీటర్ల వాయువును తీసుకుంటాడని సంఘం అంచనా వేసింది.

READ MORE:Donald Trump: ట్రంప్ రాకతో బంగ్లాదేశ్‌లో అసలు “గేమ్” ప్రారంభం కానుందా..?

అయితే.. మనం తీసుకునే గాలిలో 20శాతం ఆక్సిజన్, వదిలే గాలిలో 15శాతం ఆక్సిజన్ ఉంటుంది. అంటే ప్రతి శ్వాసకు 5 శాతం వాయువు.. కార్బన్ డై ఆక్సైడ్‌​గా మారుతుంది. ఈ లెక్కన మనిషి ఒక రోజుకు 378 లీటర్ల స్వచ్ఛమైన ఆక్సిజన్​ను వినియోగిస్తాడు. మన ఊపిరితిత్తుల నుంచి ఎంత గాలి వెళ్తుందో తెలుసుకోవడానికి ఓ విధానం ఉంది. ఒక నిర్దిష్ట పరిమాణంలో ఉన్న ప్లాస్టిక్ సంచి తీసుకొని, దానిలోకి గాలి వదలాలి. ప్రతి శ్వాసకు అది ఎంత నిండుతుందో చూడాలి. పూర్తిగా నిండటానికి ఎంత సయమం పడుతుందో లెక్కించడం ద్వారా ఓ అంచనాకు రావొచ్చు.

Show comments