Breathing: ఒక్కో మనిషి రోజుకు ఎన్ని సార్లు శ్వాస తీసుకుంటాడో తెలుసా?
- మానవ శరీరం ఒక అద్భుతం
- శారీరక ప్రక్రియలలో శ్వాస ఓ భాగం
- నిమిషానికి 12 నుంచి 20 సార్లు శ్వాస
- 24 గంటల్లో సుమారు 22000 నుంచి 28800 సార్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవ శరీరం ఒక అద్భుతం. దాని శారీరక ప్రక్రియలలో శ్వాస ఓ భాగం. ఇది మనందరి రోజువారి జీవితంలో భాగమైన సహజ ప్రక్రియ. శ్వాస ద్వారా శరీరానికి ఆక్సిజన్‌ను అందిస్తాము. అది శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఒక వ్యక్తి రోజులో ఎన్నిసార్లు ఊపిరి పీల్చుకుంటాడో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకుందాం..
READ MORE: Hamas: గాజాపై దాడి కారణంగానే ఆమ్‌స్టర్‌డామ్‌లో ఇజ్రాయెలీలపై దాడి
Also Read
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
ఒక వ్యక్తి యొక్క శ్వాస రేటు అతని వయస్సు, ఆరోగ్యం, శారీరక స్థితిపై ఆధారపడి ఉంటుంది. కెనడియన్ లంగ్ అసోసియేషన్ ప్రకారం.. ఆరోగ్య కరమైన వ్యక్తి నిమిషానికి 12 నుంచి 20 సార్లు శ్వాస తీసుకుంటాడు. అంటే ఒక వ్యక్తి 24 గంటల్లో సుమారు 22000 నుంచి 28800 సార్లు శ్వాస తీసుకుంటాడట. గణించడం అంత సులభం కానప్పటికీ.. ఈ గణాంకాలు సగటు ప్రాతిపదికన లెక్కించబడ్డాయి. ఈ సంఖ్య సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తికి వర్తిస్తుంది. ఇలా కాకుండా ఆ వ్యక్తి ఏదైనా ఆరోగ్య సమస్య లేదా శారీరక సమస్యను ఎదుర్కొంటే అది మారవచ్చు. కాగా.. సగటు వయోజన పురుషుని ఊపిరితిత్తులు గరిష్ఠంగా 6 లీటర్ల గాలిని వాటిలో ఉంచుకోగలవని అమెరికన్ లంగ్ అసోషియేషన్ తెలిపింది. ప్రతి రోజూ ఒక వ్యక్తి 7,570 లీటర్ల వాయువును తీసుకుంటాడని సంఘం అంచనా వేసింది.
READ MORE:Donald Trump: ట్రంప్ రాకతో బంగ్లాదేశ్‌లో అసలు “గేమ్” ప్రారంభం కానుందా..?
అయితే.. మనం తీసుకునే గాలిలో 20శాతం ఆక్సిజన్, వదిలే గాలిలో 15శాతం ఆక్సిజన్ ఉంటుంది. అంటే ప్రతి శ్వాసకు 5 శాతం వాయువు.. కార్బన్ డై ఆక్సైడ్‌గా మారుతుంది. ఈ లెక్కన మనిషి ఒక రోజుకు 378 లీటర్ల స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను వినియోగిస్తాడు. మన ఊపిరితిత్తుల నుంచి ఎంత గాలి వెళ్తుందో తెలుసుకోవడానికి ఓ విధానం ఉంది. ఒక నిర్దిష్ట పరిమాణంలో ఉన్న ప్లాస్టిక్ సంచి తీసుకొని, దానిలోకి గాలి వదలాలి. ప్రతి శ్వాసకు అది ఎంత నిండుతుందో చూడాలి. పూర్తిగా నిండటానికి ఎంత సయమం పడుతుందో లెక్కించడం ద్వారా ఓ అంచనాకు రావొచ్చు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..