నాన్ వెజ్ ప్రియులకు రోజూ ముక్క లేనిదే ముద్ద దిగదు.. ఇప్పుడు ఒకవైపు వేడి ఎక్కువగా ఉన్నా కూడా మరోవైపు తమకు ఇష్టమైన మాంసాన్ని ఆరగిస్తారు.. అయితే తక్కువగా తినడం మంచిదే.. ఇష్టం కదా అని లాగిస్తే ఇక చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అధిక మొత్తంలో ప్రాసెస్ చేసిన మాంసం, రెడ్ మీట్ తినడం పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని ఇటీవల జరిపిన అధ్యయనం లో తేలింది..
సాదారణంగా చికెన్, ఫిష్ వంటి ఇతర ప్రోటీన్ వనరులను తీసుకోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించదని అధ్యయనం కనుగొంది. రెడ్ మీట్ తీసుకోవడం పరిమితం చేయడం మంచిది.. ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది.. ఎక్కువగా ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినే వ్యక్తులకు పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 20శాతం వరకు ఉంటుందని అధ్యయనం కనుగొంది. అదే సమయంలో, రెడ్ మీట్ ఎక్కువగా తినే వారిలో, ఈ ప్రమాదం 9 శాతం పెరిగినట్లు వెల్లడించింది.
అందుకే వీటికి బదులుగా తాజా కూరగాయలు, తృణ దాన్యాలు పండ్లు వంటి వాటిని తీసుకోవడం మంచిది.. ఇవి డైట్ కంట్రోల్ గా కూడా ఉపయోగ పడతాయి. అలాగే ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ను కూడా తీసుకోవద్దని చెబుతున్నారు.. వీటిని ఒకే ఆయిల్ తో ఎక్కువ సార్లు తయారు చేస్తారు.. అలాగే వీటిని తయారు చెయ్యడానికి అనేక రకాల రంగులను కూడా వాడుతారు.. దానివల్ల మన శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది.. మాంసాన్ని కూడా సమ్మర్ లో వీలైనంత తక్కువ తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.