అధిక బరువు సమస్య ఈరోజుల్లో ప్రతి ఒక్కరిని బాదిస్తుంది.. అధిక బరువు వల్ల అనారోగ్య సమస్యలు కన్నా ముఖ్యంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.. శరీరంలోని అధిక కొవ్వు సమస్య కొలొరెక్టల్, పోస్ట్ మెనోపాజ్ రొమ్ము, గర్భాశయం, అన్నవాహిక, మూత్ర పిండాలు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లతో సహా అనేక క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.. అలా వస్తుందని చెప్పడానికి తక్కువ ఆధారాలు ఉన్నా కూడా కొన్ని భాగాల్లో అధికంగా కొవ్వు పెరగడం వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది..
అధిక విసెరల్ కొవ్వు శరీరంలోని కొన్ని ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. శరీరం ఇన్సులిన్ , ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లను ఎలా నిర్వహిస్తుంది. ఇవన్నీ కణాలు ఎలా , ఎప్పుడు విభజించబడి చనిపోతాయో ప్రభావితం చేయడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు..
అధిక బరువు కలిగిన వాళ్ళు క్యాన్సర్ ప్రమాదం నుంచి ఎలా బయట పడాలాంటే?
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి చేయగలిగే ముఖ్యమైన విషయాలలో ఒకటి ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటం. ఊబకాయాన్ని నివారించడానికి సరైన చర్యలు చేపట్టటం ముఖ్యమైనవి. రోజు చురుకుగా ఉండాలంటే వారానికి 150 నిమిషాల మితమైన వ్యాయామాలు, లేదంటే రోజుకు 75 నిమిషాల తీవ్రమైన వ్యాయామాలు లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.. యోగా చెయ్యడం కూడా మంచిదే..తినే ఆహారంలో కనీసం 2/3 భాగాన్ని పిండి లేని కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు లేదా చిక్కుళ్ళు , 1/3 లేదా అంతకంటే తక్కువ జంతు ప్రోటీన్‌తో కూడిన ఆహారాలను తీసుకోవాలి.
మంచి విశ్రాంతి తీసుకోవటం. అలసట వలన ఎక్కువ తినాలని ఆసమయంలో అనారోగ్యకరమైన ఎంపికలను దూరంగా ఉంచాలి. ఊబకాయం , అధిక బరువు మీ శరీరం బాగా పని చేసే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.. అధిక బరువు తగ్గితేనే క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది..