అధిక బరువు సమస్య ఈరోజుల్లో ప్రతి ఒక్కరిని బాదిస్తుంది.. అధిక బరువు వల్ల అనారోగ్య సమస్యలు కన్నా ముఖ్యంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.. శరీరంలోని అధిక కొవ్వు సమస్య కొలొరెక్టల్, పోస్ట్ మెనోపాజ్ రొమ్ము, గర్భాశయం, అన్నవాహిక, మూత్ర పిండాలు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లతో సహా అనేక క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.. అలా వస్తుందని చెప్పడానికి తక్కువ ఆధారాలు ఉన్నా కూడా కొన్ని భాగాల్లో అధికంగా కొవ్వు పెరగడం వల్ల వచ్చే…
Weight Loss: సరైన ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్ కారణంగా ఇటీవల యువత భారీగా బరువు పెరుగుతున్నారు. ఆ తరువాత వేగంగా బరువు తగ్గాలని భావిస్తూ అడ్డమైన మెడిసిన్స్, హెవీ వర్కౌట్స్ చేసి ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే చైనాలో జరిగింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన 21 ఓళ్ల యువతి 90 కిలోలు తగ్గాలనే లక్ష్యంతో పెట్టుకుంది. తీవ్రమైన వ్యాయామం కారణంగా మరణించింది.
సముద్రం ఎంతో సంపదకు ఆలవాలం. ఎన్నోరకాల చేపలు వలకు చిక్కుతుంటాయి. అప్పుడు తిమింగలాలు కూడా పడతాయి. కానీ అరుదైన చేపలు మాత్రం అరుదుగా మత్స్యకారులకు దొరుకుతాయి. రోజుల తరబడి సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు మంచి చేపలు దొరికితే ఆనందంతో గంతులేస్తారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో మత్స్యకారుల పంట పండింది. అంతర్వేదిలో మినీ హార్బర్లో ఉప్పాడ మత్స్యకారులకు అదృష్టం వరించింది. వారు వేసిన వలకు చిక్కింది మామూలు ఆషామాషీ చేప కాదండోయ్. సుమారు…
కరోనా కేసులు ప్రపంచంలో పెరిగిపోతూనే ఉన్నాయి. కరోనా కారణంగా పిల్లలు ఇంటికే పరిమితం అవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లు తెరిచినప్పటికి కరోనా భయంతో పిల్లలను ఇంటినుంచే చదివించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. కరోనా సమయంలో ఇంటిపట్టునే ఉండటంతో పిల్లలు అధిక బరువు పెరుగుతున్నట్టు అమెరికన్ మెడికల్ అసోసియోషన్ జర్నల్ సర్వేలో తేలింది. 5-11 ఏళ్ల వయసున్న పిల్లలు కరోనా కాలంలో బరువు పెరిగినట్టు ఈ సర్వే పేర్కొన్నది. కోవిడ్ కాలంలో 5-11 ఏళ్ల లోపున్న పిల్లలు 2.5…