NTV Telugu Site icon

World Environment Day: ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. రేప‌టి త‌రాన్ని కాపాడుదాం

Paryavarana12

Paryavarana12

ప్ర‌కృతిలో మనం బాధ్యతగా ఉంటే ప్రకృతి మనల్ని బాగా చూసుకుంటుంది. మనిషికి మాత్రమే సొంతం అనుకుంటే.. మిగిలిన జీవరాసులకూ సమాన హక్కు ఉన్న ప్రకృతిని మనిషి మాత్రమే వాడుకుంటే మనిషి మనుగడకే ప్రమాదం అవుతుంది. ప్రకృతిని ప్రేమిస్తూ.. పర్యావరణాన్ని రక్షిస్తూ.. ముందుకు సాగితే, ప్రకృతి మన భవిష్యత్ తరాలకు సాయం చేస్తుంది. ఇది మనందరికి తెలిసిన విషయమే అయినా మనం మాత్రం మాటలకే పరిమితం చేస్తున్నాం. అయితే నేడు ప్రపంచ పర్యారణ దినోత్సవం సందర్భంగా.. కొన్ని విషయాలు తెలుసుకుందాం..

ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతీ ఏడాది జూన్ 5వ తేదిన జరుపుకుంటున్నాం. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచడానికి ఐక్యరాజ్యసమితి ఈమేరకు పర్యవరణ దినోత్సవం జరపాలని నిర్ణయించింది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) ద్వారా ఈరోజును జరుపుతున్నారు. 1972 జూన్ 5వ తేదీ నుంచి 16వ తేది వరకు మానవ పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశం అయింది. ఈ సందర్భంగా 1972 లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేసింది. 1974లో తొలిసారి ‘ఒకే ఒక్క భూమి’ థీమ్‌తో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. 2019 సంవత్సరంలో ‘బీట్ ఎయిర్ పొల్యూషన్’పేరుతో చైనాలో సదస్సు నిర్వహించారు. 2020లో ‘టైమ్ ఫర్ నేచర్.’ జర్మనీ సహకారంతో కొలంబియాలో నిర్వహించారు.

మొక్కల్ని కాపాడాలి, చెట్లను పెంచాలి, అడవుల్ని డెవలప్ చెయ్యాలి అనుకుంటాం… తీరా చూస్తే… సంవత్సరం తిరిగేసరికి… మన ఇళ్ల చుట్టుపక్కల ఉండే ఎన్నోచెట్లు మాయమవుతాయి. ఆ ప్లేస్‌లో భవనాలు వచ్చేస్తాయి… ఇదే వాస్తవంలో జరుగుతున్నది. మనం చెప్పుకునేది ఒకటి… జరుగుతున్నది మరొకటి. ఐతే… కొన్నిచోట్ల మాత్రం నిజంగానే చెట్ల సంఖ్య పెరుగుతోంది. అలాగే కొంత మంది నిజంగానే చెట్లను పెంచుతూ… వాతావరణాన్ని కాపాడుతున్నారు. అలాంటి వారికి మనం అందరం రుణపడి ఉన్నట్లే.

Bhaskarabhatla : నవతరం నాడి పట్టేసిన భాస్కరభట్ల!