NTV Telugu Site icon

Over Sleeping: మహిళలు అతిగా నిద్రపోతున్నారా.. సంతాన సామర్థ్యం తగ్గే అవకాశం..

Over Sleeping

Over Sleeping

Over Sleeping: మహిళలు అతిగా నిద్రపోతున్నారా? అయితే ఇది మీ ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. అతిగా నిద్ర పోవడం వలన దీర్ఘకాలిక సమస్యలను పెంచుతుంది. అందువల్ల, నిద్ర సమయాన్ని అదుపులో ఉంచుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చాలా ముఖ్యం. సరైన నిద్ర సమయాన్ని పాటించడం చాలా ముఖ్యం. మీరు ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొలపడం అలవాటు చేసుకోవాలి. ప్రతి మనిషి శరీరానికి 7-8 గంటల నిద్ర సమయం అవసరం. అధిక నిద్ర జీవనశైలిలో మార్పులకు కారణమవుతుంది. ఇది రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది.

Read also: Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్

ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల మెడ, వెన్నెముక, తలనొప్పి వస్తుంది. అధిక నిద్ర స్త్రీలలో సంతానోత్పత్తిని తగ్గిస్తుంది. సమయం సందర్భం లేకుండా అతిగా నిద్రపోవడం వలన మహిళల శరీరంలో మార్పులు వస్తాయి. అంతేకాకుండా చిరాకు, జీర్ణవ్యవస్థ సరిగా లేకపోవడం వంటివి తలెత్తుతాయి. అతి నిద్ర వలన స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యతలో మార్పులు రావడం మొదలవుతాయి. దీని ఫలితం సంతాన సామర్థ్యం తగ్గుతాయి. దీంతో పిల్లలు పుట్టే అవకాశం కోల్పోతారని వైద్య నిపుణలు చెబుతున్నారు. ఇక అతి నిద్ర మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది.

 

Read also: Elon Musk: ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డ్.. 400 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి టెస్లా చీఫ్

ఎక్కువ నిద్రపోవడం వల్ల రోజువారీ పనులు చేయడానికి తగినంత సమయం దొరకదు, ఇది మానసిక ఒత్తిడిని పెంచుతుంది. డిప్రెషన్, ఆందోళన సమస్యలు తతెత్తుతాయి. అధిక నిద్ర జీవక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది. దీనివల్ల మధుమేహం వంటి వ్యాధులు వస్తాయి. అధిక నిద్ర గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలంలో, ఈ అలవాటు గుండె నరాల పనితీరును తగ్గించడమే కాకుండా.. గుండె జబ్బులకు అవకాశం కల్పిస్తుంది. అధిక నిద్ర శారీరక కదలికలను తగ్గిస్తుంది. వ్యాయామం లేకపోవడం, అనవసరమైన నిద్ర సమయం శారీరక శక్తి వినియోగాన్ని తగ్గిస్తుంది.

Read also: IMD Warning: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. చలి గాలులపై కూడా వార్నింగ్

అతి నిద్ర బరువు పెరగడం లేదా ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుంది. అంతే కాకుండా తలనొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, జీర్ణక్రియ సమస్యలు వంటి శారీరక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ సేపు నిద్రపోయే వారి మెదడు పనితీరు మందగిస్తుంది. దీంతో మతి మరుపు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు వస్తాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం (మెడిటేషన్‌) వంటి చర్యలు తీసుకోవడం మంచిది. మీరు అతి నిద్రకు బానిసలు ఎందుకు అవుతున్నారనే అనుమానం వస్తే వెంటనే వైద్యులకు సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
Rajinikanth Birthday: రామారావుతో రజనీ’బంధం’.. ఈ విషయాలు మీకు తెలుసా?

Show comments