NTV Telugu Site icon

Heart disease: స్త్రీల కన్నా పురుషులకే ఎక్కువ గుండె జబ్బులు..ఎందుకు..?

Heart Disease

Heart Disease

Heart disease: స్త్రీల కన్నా పురుషులే ఎక్కువగా గుండె వ్యాధుల బారిన పడుతుండటం చూస్తాం. గుండెపోటు మరణాలు వంటివి పురుషులకే ఎక్కువగా వస్తుంటాయి. అయితే, దీనికి జీవసంబంధమైన, హార్మోన్, జీవనశైలి అలవాట్లు కూడా కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. కార్డియో వాక్యులర్ డిసీసెస్(CVDs) ఏడాదికి 17.9 మిలియన్ల మరణాలకు కారణమవుతున్నాయి. స్త్రీలతో పోలిస్తే పురుషులు చాలా తరుచుగా చిన్న వయసులోనే ఈ జబ్బుల బారిన పడుతున్నారు.

Read Also: Breaking News: జమ్మూలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదిని హతమార్చి.. కానిస్టేబుల్ వీరమరణం

హర్మోన్లు, జీవనశైలి, జన్యు సంబంధ కారణాలు స్త్రీలు గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడుతున్నాయి. గుండె జబ్బుల్లో హార్మోన్లు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. మెనోపాజ్‌కి ముందు మహిళల్లో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్, స్త్రీలలో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తోంది. రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడకుండా రక్షిస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తోంది.

పురుషుల్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది ఉత్పత్తి కాదు. దీంతో గుండె పరిస్థితులను చక్కదిద్దే అవకాశం ఉండదు. మరోవైపు ధూమపానం, అనారోగ్యమైకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణాలు కూడా మగవారిలో గుండె వ్యాధులకు కారణమవుతుంది. స్మోకింగ్ ధూమపానం కరోనరీ ధమనులపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది ధమనులు కుచించుకుపోవడానికి కారణమవుతుంది. దీంతో గుండెకు రక్తప్రసరణ తగ్గుతుంది. గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. స్త్రీలతో పోలిస్తే స్మోకింగ్ అలవాటు పురుషుల్లోనే ఎక్కువ. పురుషులు కూడా అధిక స్థాయిలో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ (“చెడు” కొలెస్ట్రాల్) కలిగి ఉంటారు, ఇది ధమని అడ్డంకులకు దోహదం చేస్తుంది.

Show comments