WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్‌పై WHO షాకింగ్ నివేదిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WHO Cancer Report 2026: ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు రాబోయే 25 ఏళ్లలో భారీగా పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ క్యాన్సర్–2026లో వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలో ఏటా నమోదవుతున్న 2.06 కోట్ల కొత్త క్యాన్సర్ కేసులు 2050 నాటికి దాదాపు 3.5 కోట్లకు చేరే అవకాశం ఉంది. క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు (స్క్రీనింగ్), సమర్థవంతమైన చికిత్సపై దేశాలు మరింత దృష్టి పెట్టకపోతే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందని WHO హెచ్చరించింది.
ప్రపంచంలో రెండో అతిపెద్ద ప్రాణాంతక వ్యాధి
Also Read
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే "మసాలా గుత్తివంకాయ" చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
- Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. 'మునగాకు పొడి'.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
గుండె సంబంధిత వ్యాధుల తర్వాత ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధి క్యాన్సర్. ప్రస్తుతం ప్రతి ఏడాది దాదాపు 1 కోటి మంది క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే రోజుకు సగటున 26 వేల మందికి పైగా మరణిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. క్యాన్సర్ ప్రభావం కేవలం రోగిపైనే కాకుండా వారి కుటుంబాలపై కూడా తీవ్రంగా పడుతుందని WHO తెలిపింది. చికిత్స ఖర్చులు, మానసిక ఒత్తిడి, సామాజిక సమస్యలు కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వివరించింది.
క్యాన్సర్ చికిత్సలో తీవ్ర అసమానతలు
ప్రపంచ దేశాల మధ్య క్యాన్సర్ చికిత్సలో పెద్ద ఎత్తున అసమానతలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. అధిక ఆదాయ దేశాల్లో రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళల్లో 87 శాతం మంది కనీసం ఐదేళ్లు జీవించే అవకాశం ఉండగా, తక్కువ ఆదాయ దేశాల్లో ఈ శాతం 42కే పరిమితమైంది. అంతేకాకుండా ప్రపంచంలోని మూడింట ఒక వంతు దేశాల్లో కూడా సమగ్ర క్యాన్సర్ చికిత్సను యూనివర్సల్ హెల్త్ కవరేజ్‌లో భాగంగా అందించడం లేదని WHO పేర్కొంది.
ఆసియాపై అత్యధిక భారం
ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న క్యాన్సర్ కేసులు, మరణాల్లో సగానికి పైగా ఆసియా ఖండంలోనే నమోదవుతున్నాయి. మరోవైపు ప్రపంచ జనాభాలో కేవలం 9 శాతం మాత్రమే ఉన్న యూరప్, ప్రపంచ క్యాన్సర్ కేసులు, మరణాల్లో సుమారు 20 శాతం వాటా కలిగి ఉండటం ఆందోళన కలిగించే అంశమని నివేదిక తెలిపింది.
ఏ క్యాన్సర్లు ఎక్కువగా?
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలకు ప్రధాన కారణంగా ఊపిరితిత్తుల (లంగ్) క్యాన్సర్ కొనసాగుతోంది. పురుషుల్లో లంగ్, ప్రోస్టేట్, కొలొరెక్టల్ క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతుండగా, మహిళల్లో రొమ్ము (బ్రెస్ట్), లంగ్, కొలొరెక్టల్ క్యాన్సర్లు అధికంగా కనిపిస్తున్నాయి.
40 శాతం క్యాన్సర్ కేసులను నివారించవచ్చు
WHO అంచనా ప్రకారం, ప్రపంచంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో దాదాపు 40 శాతం నివారించగలిగినవే. పొగాకు వినియోగం, మద్యం సేవించడం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, అలాగే HPV, హెపటైటిస్-B, హెపటైటిస్-C, హెలికోబాక్టర్ పైలోరి వంటి ఇన్ఫెక్షన్లు క్యాన్సర్‌కు ప్రధాన ప్రమాద కారకాలని WHO పేర్కొంది.. ప్రజల్లో అవగాహన పెంచడం, పొగాకు నియంత్రణ, ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించడం, టీకా కార్యక్రమాలను విస్తరించడం ద్వారా ఈ కేసుల్లో గణనీయమైన తగ్గుదల సాధించవచ్చని నివేదిక సూచించింది.
సానుకూల పరిణామాలు కూడా ఉన్నాయి
ప్రపంచవ్యాప్తంగా 2010తో పోలిస్తే పొగాకు వినియోగం 27 శాతం తగ్గింది. అనేక దేశాలు జాతీయ క్యాన్సర్ నియంత్రణ ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. కొత్త చికిత్సలపై పరిశోధనలు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ తక్కువ, మధ్యస్థ ఆదాయ దేశాల్లో అత్యవసర క్యాన్సర్ మందులు ఇంకా అందుబాటులో లేకపోవడం ప్రధాన సవాలుగా ఉందని WHO పేర్కొంది.
ప్రభుత్వాలకు WHO సూచనలు
ప్రతి ఒక్కరికీ సమానంగా క్యాన్సర్ చికిత్స అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని WHO సూచించింది. స్క్రీనింగ్, ముందస్తు నిర్ధారణ, చికిత్స, పునరావాస సేవలను బలోపేతం చేయడంతో పాటు రోగులు, వారి కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించాలని సూచించింది. అలాగే క్యాన్సర్ నివారణ, పరిశోధనలపై మరింత పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చింది. నేడు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తులో లక్షలాది మంది ప్రాణాలను కాపాడగలవని WHO స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
-
VIJAY – TRISHA : విజయ్ – త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
ట్రెండింగ్
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!