‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అని తెలిసినా.. చిన్నా పెద్దా తేడా లేదు మందు తాగేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే మద్యానికి అడిక్ట్ అయిన కొంతమంది ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా ఆల్కహాల్ తీసుకుంటుంటారు. వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్‌ను పట్టించుకోకుండా.. ఒకట్రెండు పెగ్గులేగా ఏం కాదులే అనుకుంటారు. కానీ.. ఇటీవల మద్యంపై డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక విడుదల చేసింది. నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది.
READ MORE: India vs UAE: తొలి మ్యాచ్‌లో భారత్ రికార్డు విజయం.. రప్ఫాడించిన బౌలర్లు..
డబ్ల్యూహెచ్ఓ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం… మద్యపానం ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 26 లక్షల మరణాలకు కారణమవుతోంది. పేగు, రొమ్ము క్యాన్సర్ సహా కనీసం ఏడు రకాల క్యాన్సర్‌లకు మద్యమే కారణం. 1.5 లీటర్ల కంటే తక్కువ వైన్ లేదా 3.5 లీటర్ల కంటే తక్కువ బీర్ లేదా 450 మిల్లీ లీటర్ల కంటే తక్కువ స్పిరిట్‌ల శాతం ఉండే మద్యాన్ని అప్పుడప్పుడు మాత్రమే సేవించినా కూడా ప్రమాదకరమని డబ్ల్యూహెచ్ఓ చేసిన ఒక వివరణాత్మక అధ్యయనం కనుగొంది. ఆల్కహాల్‌ని పరిమిత మొత్తంలో (మోడరేట్‌గా) తీసుకుంటే ఆరోగ్యానికి ఏమీకాదనడానికి.. ఆధారాల్లేవని తేల్చి చెప్పింది. ‘‘మద్యం సేవించేవారి ఆరోగ్యం చెడిపోవడం మొదటి మద్యం చుక్క తాగినప్పటి నుంచే మొదలవుతుంది.’’ అని డబ్ల్యూహెచ్ఓ కొత్త మార్గదర్శకాలు చెబుతున్నాయి.
READ MORE: Nepal Palace Massacre: ప్రేమకు బలైన నేపాల్ రాజ కుటుంబం.. ప్యాలెస్‌లో ఊచకోత.. ఆ నాటి విషాద గాథ
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
