Site icon NTV Telugu

వ్యాక్సినేషన్ పూర్తయితే మాస్క్ అవసరం లేదా ?

WHO recommends fully vaccinated People also to continue to wear masks

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ఎంతో అవసరం అనే విషయాన్ని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్క్ ధరించడం, రెగ్యులర్ గా శానిటైజర్ ఉపయోగించడం కూడా చాలా ముఖ్యం. అయితే ముందుగా వ్యాక్సిన్ వేయించుకోవడానికి జనాలు భయపడ్డారు. కానీ ఇప్పుడు అందరిలో అవగాహన రావడంతో వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో రకరకాల అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి. వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చా? లేదా? తీసుకోవడం వల్ల కలిగే పరిణామాలు, సైడ్ ఎఫెక్ట్స్ తదితర విషయాలపై ఇప్పటికే అందరికీ కొంత అవగాహన వచ్చేసింది. అయితే రెండు డోసుల వాక్సిన్ పూర్తయిన తర్వాత మాస్కు ధరించే అవసరం ఉందా లేదా? అనే విషయంపై ఇంకా చర్చ నడుస్తుంది.

Read Also : అఫిషియల్ : “ఫాస్ట్10” షూటింగ్ కు టైమ్ ఫిక్స్

తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘డబ్ల్యూహెచ్ఓ’ వారు ఫుల్ గా వాక్సినేషన్ వేయించుకున్న వారు కూడా కచ్చితంగా మాస్క్ ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రకటించింది. అయితే ఇంతకు ముందు అగ్రరాజ్యమైన అమెరికాలో యు.ఎస్. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) వారు పూర్తిగా వ్యాక్సినేషన్ వేయించుకున్న ప్రజలు ఇక మాస్కు ధరించే అవసరం లేదని వెల్లడించింది. అయితే తాజాగా ‘డబ్ల్యూహెచ్ఓ’ మాత్రం మళ్లీ కరోనా విజృంభించకుండా ఉండాలంటే మాస్క్ ధరించాల్సిందే అని, సోషల్ డిస్టెన్స్ కూడా పాటించాల్సిందేనని హెచ్చరించింది. అందుకే మళ్ళీ మరోసారి లాక్ డౌన్ వంటి పరిస్థితులను చూడకుండా ఉండాలంటే, కరోనా మరోసారి మనల్ని వణికించకుండా మనమే దాన్ని భయపడి పారిపోయేలా చేయాలంటే వ్యాక్సినేషన్ వేయించుకున్నా కూడా అ మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజర్ వాడడం తప్పనిసరి.

Exit mobile version