NTV Telugu Site icon

Health Tips: నీరు ఎక్కువ తాగుతున్నారా.. ? అయితే..

Water

Water

నీళ్లు ఎంత తాగితే అంత మంచిది ఇది మ‌నం ఎప్పుడు అందినోట వినే మాట‌. దాని వ‌ల్ల చాలా అనారోగ్యాల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌నీ మ‌న‌కు తెలుసు. కానీ, త‌గిన మోతాదుకు మించి నీళ్లు తాగ‌డం అన్న‌ది అనారోగ్యం నుంచి బ‌య‌ట ప‌డొచ్చ‌ని మ‌నంద‌రికి తెలుసు కానీ.. మోతాదుకు మించి నీళ్లు తాగడం అన్నది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఓవర్‌హైడ్రేషన్‌ వల్ల శరీరం రకరకాల ఇబ్బందులకు గురి అవుతుంది.

మనిషికి జీవించేందుకు నీరు అత్యవసరం. సరైన మోతాదులో నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతులంగా ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఒత్తిడి, ఆందోళనలు దూరం అవుతాయి. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. ముఖ్యంగా రక్తపోటు అదుపులో ఉంటుంది. మంచినీళ్లను తీసుకోవడం వల్ల ఇలా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే, నీళ్లు తాగడం మంచిదన్నారు కదా అని, నిరంతరం అదే పనిలో ఉండకూడదు. అధిక మోతాదులో నీళ్లు తాగడం వల్ల చెడు పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు.

అతిగా నీళ్లు తాగడం వల్ల ఆ నీటిని వడబోసే శక్తిగానీ, నిల్వ ఉంచుకునే సామర్థ్యం గానీ కిడ్నీలకు ఉండదు. అప్పుడు అధికమైన ఆ నీరు రక్తంలో కలిసిపోతుంది. ఫలితంగా రక్తంలో ఉండే సోడియం సహా ఎలక్ట్రోలైట్ల శాతం తరిగిపోతుంది. శరీరంలోని ద్రవాల స్థాయిని సరిగ్గా ఉంచేవీ, ఆమ్ల క్షారాల సమతుల్యతని కాపాడేవీ ఎలక్ట్రోలైట్లే. కండరాలూ, నరాలూ సరిగ్గా పనిచేయాలంటే సోడియం ఎంతో కీలకం. కణాల లోపల నీరు ఎంత ఉండాలన్న నియంత్రణ కూడా సోడియంపైనే.

సోడియం క్షీణించడం వల్ల కణాల్లోకి నీరు చేరి అవి ఉబ్బిపోతాయి. దానివల్ల రక్తపోటు పెరుగుతుంది. హృదయ సమస్యలు వచ్చే అవకాశం అధికం అవుతుంది. తలనొప్పి, తలతిరగడం, డయేరియాలాంటి సమస్యలూ రావచ్చు. మగతగా అనిపించడం, ఒత్తిడి పెరగడం, తికమక పడటం జరగొచ్చు. అంతేకాదు అధిక మోతాదులో నీళ్లు తీసుకోవడం వల్ల మెదడు కూడా ప్రభావితం అవుతుంది. మూర్ఛ రావడం, లేదా కోమాలోకి వెళ్లడంలాంటివి కూడా జరగవచ్చు. కాబట్టి ఆరోగ్య పరిస్థితిని బట్టి కావలసినంత నీరు మాత్రమే తీసుకుంటే చెడు ప్రభావాల నుంచి దూరంగా ఉండొచ్చు.

Karnataka: ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులంతా హైదరాబాద్ వాసులే