నడక (వాకింగ్).. ఆరోగ్యంగా ఉండేందుకు ఉదయాన్నే లేచి చేసే ఓ వ్యాయామం. వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతారు.. గుండె ఆరోగ్యం ఉంటుంది. అంతేకాకుండా.. మానసిక ఆరోగ్యం, రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. అందుకోసమని ఉదయాన్నే ఓ గంటసేపు వాకింగ్ చేయడం చాలా మంచిది. అయితే కొందరు వాకింగ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు. అలా చేయడం వల్ల గుండెపై ప్రభావం పడుతుంది. అందుకోసమని.. వాకింగ్ చేసేటప్పుడు ఆ తప్పులు సరిదిద్దుకుని జాగ్రత్త పాటించాలి. ఇంతకు వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
Read Also: CM Chandrababu: పోలవరం నాకు సెంటిమెంట్.. ఎక్కువ బాధ పడేది నేనే..
1. చాలా వేగంగా లేదా చాలా నెమ్మదిగా నడవడం
వాకింగ్ చేయేటప్పుడు సరైన వేగం అనేది చాలా ముఖ్యం. చాలా నెమ్మదిగా నడవడం వల్ల శరీరానికి అవసరమైన వ్యాయామం అందదు. దీనివల్ల మన శరీరానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే ఒకేసారి చాలా వేగంగా నడవడం వల్ల గుండె స్పందన రేటు పెరిగి.. గుండెపై అదనపు ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. సరైన నడక వేగం అంటే.. మీరు హాయిగా మాట్లాడగలిగే స్థాయిలో నడవాలి.
2. వార్మప్ చేయకపోవడం
వాకింగ్ ప్రారంభంలో కానీ.. ముగింపులో కానీ వార్మప్ చేయాలి. వార్మప్ లేకుండా వేగంగా వాకింగ్ ప్రారంభించినట్లైతే కండరాలపై ఒత్తిడి పెరిగి.. హృదయ స్పందన (హార్ట్ బీట్) పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే వాకింగ్ ముగిసే ముందు కూడా.. వార్మప్ చేయాలి. లేదంటే రక్తపోటు తగ్గి శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువల్ల.. వాకింగ్ కు ప్రారంభానికి, ముగింపుకు ముందు 5-10 నిమిషాలు వార్మప్ చేయాలి.
3. తప్పు భంగిమలో నడవడం
నడిచే విధానం కూడా ముఖ్యం.. మీరు వంగి నడవడం లేదా కరెక్ట్‌గా నడవకపోవడం వల్ల శ్వాసక్రియపై ప్రభావం పడుతుంది. దీంతో.. గుండెకు తగిన ఆక్సిజన్ అందించదు. అందుకోసమని.. నిటారుగా నిలబడి, భుజాలను వదిలి, చేతులను సరిగా ఊపుతూ నడవాలి.
4. సరైన మొత్తంలో నీరు తాగకపోవడం
నిర్జలీకరణం గుండెపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నీరు తాగకపోవడం వల్ల రక్తం మందమైపోతుంది.. ఇది గుండెను మరింత కష్టపెట్టుతుంది. ముఖ్యంగా వేసవిలో వాకింగ్ ముందు, వాకింగ్ చేసేటప్పుడు నీరు తాగడం చాలా ముఖ్యం.
5. ఎక్కువగా తినడం
వాకింగ్ ప్రారంభించే ముందు ఎక్కువగా ఆహారం తీసుకోవద్దు. ఒకవేళ తీసుకున్నారంటే.. జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరిగి, గుండెపై కూడా అదనపు ఒత్తిడి వస్తుంది. అందుకోసం.. లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి తేలికపాటి ఆహారాలు తీసుకోవడం మంచిది.
6. కలుషిత ప్రాంతంలో నడవడం
రద్దీగా ఉండే రోడ్లపై.. పొగ, ధూళి, కలుషిత ప్రాంతాలలో వాకింగ్ చేయద్దు. అలాంటి ప్రదేశాలలో నడుస్తే ఊపిరితిత్తులకు, గుండెకు హానికరంగా మారుతుంది. పార్కులు, స్వచ్ఛమైన వాతావరణం ఉన్న ప్రాంతాలలో వాకింగ్ చేయాలి.
7. అతిగా శ్రమించడం
వాకింగ్ ఎక్కువగా చేయడం మంచిది కాదు. అది గుండెపై ఎఫెక్ట్ చూపుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం లేదా ఛాతీ నొప్పి వచ్చినట్లైతే వెంటనే వాకింగ్ ఆపడం మంచిది. ఇది గుండె జబ్బుల రిస్క్‌ను పెంచుతుంది, కాబట్టి లిమిట్‌గా చేయండి.
8. క్రమబద్ధత లేకుండా నడవడం
వాకింగ్ ఒకేసారి చేసే బదులు ప్రతిరోజూ 30-40 నిమిషాలు క్రమం తప్పకుండా నడవండి. అలా నడవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.