Vitamin Guide for Every Organ: మెదడు నుంచి ఎముకల వరకు.. ఏ అవయవానికి ఏ విటమిన్ కీలకం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vitamin Guide for Every Organ: మన శరీరం ఆరోగ్యంగా పనిచేయాలంటే విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే అన్ని విటమిన్లు ఒకే విధంగా పనిచేయవు. ప్రతి అవయవం సక్రమంగా పనిచేయడానికి ప్రత్యేక విటమిన్లు అవసరం. అవి లోపిస్తే వెంటనే లక్షణాలు కనిపించకపోయినా, కాలక్రమేణా అవయవాల పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలసట, రోగనిరోధక శక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, అవయవాల పనితీరు మందగించడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
మెదడుకు – విటమిన్ B12, విటమిన్ D, ఒమేగా-3
మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నరాల ఆరోగ్యానికి విటమిన్ B12, విటమిన్ D, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అవసరం. ఇవి మానసిక స్థితిని కూడా సమతుల్యం చేస్తాయి. గుడ్లు, పాలు, కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు, ఫోర్టిఫైడ్ ఆహారాల్లో ఇవి లభిస్తాయి.
Also Read
- Homemade Recipes: రొటీన్ పచ్చళ్లు బోర్ కొట్టాయా? ఈ పచ్చడి ట్రై చేయండి.. ఒక్క ముద్ద తిన్నా వదిలిపెట్టరు!
- Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ "ఎగ్ లబాబ్దార్" సులువుగా చేసుకోండి ఇలా..!
- Heart Health Tips: గుండె ఆరోగ్య రహస్యం ఇదే.. మంచి ఆహారంతో పాటు మంచి అనుబంధాలు కూడా!
- Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
కళ్లకు – విటమిన్ A, C, E
కంటి చూపు, రెటీనా ఆరోగ్యం కోసం విటమిన్ A చాలా ముఖ్యం. అలాగే విటమిన్ C, E కళ్లను ఆక్సిడేటివ్ నష్టం నుంచి కాపాడతాయి. క్యారెట్, చిలగడదుంప, పాలకూర, నారింజ వంటి సిట్రస్ పండ్లు మంచి వనరులు. లోపం ఉంటే రాత్రిపూట చూపు తగ్గడం, కళ్ల పొడిబారడం వంటి సమస్యలు రావచ్చు.
గుండెకు – విటమిన్ D, B గ్రూప్, మెగ్నీషియం
గుండె ఆరోగ్యం కోసం విటమిన్ D, B గ్రూప్ విటమిన్లు, మెగ్నీషియం అవసరం. ఇవి రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంతో పాటు రక్తపోటు నియంత్రణకు, శక్తి ఉత్పత్తికి సహాయపడతాయి. నట్స్, విత్తనాలు, చేపలు, తృణధాన్యాలు వీటికి మంచి మూలాలు.
ఊపిరితిత్తులకు – విటమిన్ C, D, E
ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడేందుకు విటమిన్ C, D, E ఉపయోగపడతాయి. ముఖ్యంగా విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచి వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. బెల్ పెప్పర్, సిట్రస్ పండ్లు, మష్రూమ్స్, బాదం వంటి ఆహారాల్లో ఇవి లభిస్తాయి.
కాలేయానికి – B కాంప్లెక్స్, విటమిన్ E, కోలిన్
కాలేయం కొవ్వు జీవక్రియ, శక్తి ఉత్పత్తి సక్రమంగా జరగాలంటే B కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ E, కోలిన్ అవసరం. గుడ్లు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, నట్స్ తీసుకోవడం వల్ల ఈ పోషకాలు లభిస్తాయి.
మూత్రపిండాలకు – విటమిన్ B6, D, యాంటీ ఆక్సిడెంట్లు
మూత్రపిండాలు శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వాటి పనితీరు కోసం విటమిన్ B6, విటమిన్ D, యాంటీ ఆక్సిడెంట్లు అవసరం. అరటిపండ్లు, చేపలు, ఆకుకూరలు, బెర్రీలు మంచి ఎంపికలు.
జీర్ణవ్యవస్థకు – విటమిన్ D, B12, ఫోలేట్
పేగుల ఆరోగ్యం, మంచి బ్యాక్టీరియా (గట్ మైక్రోబయోటా) సమతుల్యత కోసం విటమిన్ D, B12, ఫోలేట్ అవసరం. పెరుగు, ఫెర్మెంటెడ్ ఆహారాలు, ఆకుకూరలు, పప్పులు తీసుకోవడం మంచిది.
చర్మానికి – విటమిన్ A, C, E
చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి, కణాల రక్షణ కోసం విటమిన్ A, C, E అవసరం. టమాటాలు, క్యారెట్, సిట్రస్ పండ్లు, నట్స్ వంటి ఆహారాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఎముకలకు – విటమిన్ D, K, కాల్షియం
బలమైన ఎముకల కోసం విటమిన్ D, విటమిన్ K, కాల్షియం తప్పనిసరి. ఇవి కాల్షియం పరిణామాన్ని మెరుగుపరచి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. పాలు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, ఫోర్టిఫైడ్ ఆహారాలు వీటికి మంచి మూలాలు.. అయితే, విటమిన్ లోపం ఉందో లేదో తెలుసుకోవడానికి వైద్యుల సలహాతో అవసరమైన రక్తపరీక్షలు చేయించుకోవడం మంచిది. స్వయంగా సప్లిమెంట్లు తీసుకోవడం కంటే వైద్యుడు లేదా పోషకాహార నిపుణుల సూచన మేరకు ఆహారం, చికిత్సను అనుసరించడం సురక్షితం.. కానీ, సొంత వైద్యం కొన్ని సార్లు వికటించే ప్రమాదం లేకపోలేదు..
తాజావార్తలు
-
UP Elections: హిందూ ఓటర్లపై ఎస్పీ గురి.. ఎట్టకేలకు అయోధ్యకు అఖిలేష్.!
-
Tabitha Sukumar: గొడవ మధ్యలోనే సుకుమార్ అలా చేస్తారట.. తబిత సుకుమార్ చెప్పిన ముచ్చట వింటే నవ్వాగదు!
-
New Pensions: కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం.. నవంబర్ 19న అకౌంట్లోకి డబ్బులు జమ..
-
IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‌గా కొత్త బాస్..
-
TG SAFE: పెద్ద బ్రాండ్లే కదా అని సేఫ్ అనుకుంటున్నారా? డొమినోస్, కేఎఫ్‌సీ స్టోర్లలో తనిఖీలతో కలకలం!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!