Miracle Drug: క్యాన్సర్.. ఈ వ్యాధి వస్తే మరణమే అని తెలుసు. అయితే వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడానికి మాత్రం సరైన చికిత్స అందుబాటులో లేదనే చెప్పవచ్చు. క్యాన్సర్ చివరి దశల్లో ఈ వ్యాధి దేనికీ లొంగడం లేదు. అయితే క్యాన్సర్ వ్యాధుల్ని పూర్తిగా నయం చేయడానికి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో క్యాన్సర్ వ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి పరిశోధనలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే యూకేకు చెందిన ఓ మహిళను క్యాన్సర్ బారి నుంచి రక్షించడానికి ఓ ఔషధం అద్భుతంగా పనిచేసింది. వేల్స్‌కి చెందిన క్యారీడౌనీ అనే మహిళ థర్డ్ స్టేజ్ ప్రేగు క్యాన్సర్ బారిన పడ్డారు. అయితే ‘డోస్టార్లిమాబ్’ అనే మందును తీసుకున్న తర్వాత ఆరు నెలల్లోనే ఆమె కొలుకున్నట్లు బీబీసీ నివేదిక వెల్లడించింది. 42 ఏళ్ల సివిల్ సర్వేంట్ అయి క్యారీ డౌనీ ఒక ఏడాది క్రితం క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. డోస్టార్లిమాబ్ మందుతో చికిత్స చేయడంతో క్యాన్సర్ వ్యాధి సంబంధించిన ఆధారాలు శరీరం నుంచి తొలిగిపోయినల్లు పరీక్షలు సూచించాయని స్వాన్సీబే యూనివర్సిటీ హెల్త్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
Read Also: Israel-Hamas War: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలపై భద్రతా మండలి సమావేశం..
డోస్టార్లిమాబ్ క్యాన్సర్ మందు శస్త్రచికిత్స, రేడియో థెరపీ వంటి క్యాన్సర్ చికిత్సల్లోని దుష్ఫలితాలను దూరం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే దీనిపై ట్రయల్స్ జరుగుతున్నాయి, ఇది ఇప్పటికే మంచి ఫలితాలను చూపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. డోస్టార్లిమాబ్ అనే మందు ఇమ్యూనోథెరపీకి సహాయపడుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను నాశనం చేసేవిధంగా పనిచేస్తుంది. మోనోక్లోనల్ యాంటీబాడీలకు అవసరమయ్యే ప్రొటీన్లను అడ్డుకుంటుంది. ఫలితంగా క్యాన్సర్ ట్యూమర్లు పెరగడాన్ని నిరోధిస్తుంది.
క్యారీడౌనీ హెర్రియా మెష్ హెర్నియా మెస్ఇంఫ్లాంట్ కారణంగా నొప్పులు ఉన్నాయని వైద్యులను సంప్రదించగా.. ఆమెకు క్యాన్సర్ ఉందని తేలింది. యూకేలోని క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ బారింగ్టన్ డోస్టార్లిమాబ్ మందును సూచించారు. ప్రతీ మూడు వారాలకు ఈ మందు ద్వారా చికిత్స చేశారు. చికిత్స అనంతరం శరీరాన్ని స్కాన్ చేస్తే.. కణితి గణనీయంగా తగ్గిపోయినట్లు తేలింది. గతేడాది ఇలాగే 18 మంది రెక్ట్ క్యాన్సర్ రోగులకు ఆరు నెలల పాటు ఈ మందుతో చికిత్స చేయగా క్యాన్సర్ తగ్గిపోయినట్లుగా తేలింది.