NTV Telugu Site icon

HIV: హెచ్‌ఐవీకి ఇంజెక్షన్..! రెండేళ్లలో వ్యాధి నుంచి విముక్తి..

Hiv

Hiv

హెచ్‌ఐవీలో ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉన్న భారతదేశంలో లక్షల మంది బాధితులు ఉన్నారు. 2004 నుంచి భారతదేశం యాంటీ రెట్రోవైరల్ ఔషధాలను ఉచితంగా సరఫరా చేస్తోంది. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే ఎయిడ్స్ ఔషధాల పై కొన్ని వేల మంది హెచ్ ఐవీ బాధితులు ఆధారపడుతున్నారు. చాలా మంది ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు వదులుతున్నారు. దానికి సరైన డోస్ లేకపోవడమే కారణం. తాజాగా దక్షిణాఫ్రికా, ఉగాండాలో జరిగిన ఓ పెద్ద క్లినికల్ ట్రయల్లో కొత్త ఫ్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ డ్రగ్‌ని సంవత్సరానికి ఒకసారి చొప్పున రెండేళ్లు తీసుకుంటే యువతులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ నుంచి విముక్తి లభిస్తుందని వెల్లడైంది.

READ MORE: BMW Car Accident: బీఎండబ్ల్యూ కార్ ఢీకొని మహిళ మృతి.. శివసేన నేత కుమారుడే ప్రధాన నిందితుడు..

ఈ డ్రగ్ ఇతర ఔషధాల కంటే మెరుగైన రక్షణను అందిస్తుందని… ఇది హెచ్‌ఐవీని తగ్గిస్తుందని వైద్య శాస్త్రవేత్త లిండా-గెయిల్ బెక్కర్ పేర్కొన్నారు. ఫ్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ డ్రగ్‌ని దాదాపు 5000 మందిపై పర్పస్ ట్రయల్ చేశారు. దాని సామర్థ్యాన్ని పరీక్షించారు. లెనాకావిర్ అనే ఫ్యూజన్ క్యాప్‌సైడ్ ఇన్హిబిటర్‌ ఇంజెక్షన్‌(హెచ్‌ఐవీ జన్యుపదార్థం)తో పరీక్షించారు. దీనిని ప్రతిరూపణకు అవసరమైన ఎంజైమ్‌లను రక్షించే ప్రొటీన్ షెల్. ఈ ఇంజక్షన్ ను ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేశారు. ఈ ఇంజెక్షన్‌ను 16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు ఇచ్చారు. ఇది మెరుగైన రక్షణను అందిస్తుందని తేలింది. రెండో ఇంజెక్షన్‌ డెస్కోవీ ఎఫ్/టీఏఎఫ్. ఇది మెరుగైన ఫార్మకోకైనటిక్ లక్షణాలు కలిగి ఉంది. ఇది ఎక్కువగా పురుషులు, లింగమార్పిడి చేసుకున్న స్త్రీలలో ఎక్కువ ఉపయోగం ఉంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 1.3 మిలియన్ల కొత్త హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి.