NTV Telugu Site icon

Tomatos Benefits: టొమేటోలు తింటే.. వీర్యం నాణ్యత పెరుగుతుందా?

Collage Maker 19 Feb 2023 05.30 Pm

Collage Maker 19 Feb 2023 05.30 Pm

Tomato Juice for Sperm count: ఇటీవలి కాలంలో వంధ్యత్వ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెళ్ళయి ఏళ్ళు గడుస్తున్నా.. పిల్లలు కలగడం లేదు. ఏడాది.. రెండేళ్ళు.. ఐదేళ్ళు.. ఇలా పిల్లల కోసం భార్యాభర్తలు (wife and husband) ఎదురుచూస్తున్నారు. వీర్యం నాణ్యతను మెరుగుపరిచేందుకు, పురుషుల సంతాన సామర్థ్యం పెంచే శక్తి టొమేటోలకు (tomatos) ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. టొమాటోలలో ఉండే లైకోపీన్ అనే పోషక పదార్థం వీర్యం నాణ్యతను మెరుగుపరిచే అవకాశం ఉందని అంటున్నారు. ఆరోగ్యంగా ఉన్న పురుషులు రోజూ రెండు చెంచాల టొమేటో రసం తీసుకుంటే వారి వీర్యం నాణ్యత పెరుగుతుందని ఇంగ్లాండ్ కి చెందిన పరిశోధకులు వెల్లడించారు. సంతానోత్పత్తి సమస్యలు ఉన్న పురుషులపై మరింత విస్తృత అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచంలో దాదాపు సగం మంది దంపతులు వంధ్యత్వం వల్ల ఇబ్బంది పడుతున్నారని, సంతానోత్పత్తి సమస్యలు ఉన్న పురుషులపై చేసిన అధ్యయనాల వల్ల అనేక విషయాలు బయటపడ్డాయి. సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్న పురుషులు ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాలి. వదులుగా ఉండే లోదుస్తులను ధరించడంతో పాటు ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు పాటించాలి. మందులతో కాకుండా ఆహారం ద్వారా వీర్యంలో నాణ్యత పెంచుకోవాలని సూచిస్తున్నారు. మహిళలు కూడా సాధ్యమైనంత మేరకు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని, గర్భం దాల్చే అవకాశాలను పెంచేందుకు క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనాలని కూడా నిపుణులు చెబుతున్నారు.

టొమేటోలు పురుషుల సంతాన సామర్థ్యాన్ని పెంచుతాయి. విటమిన్- ఇ, జింక్ మాదిరిగానే లైకోపీన్ కూడా యాంటీఆక్సిడెంట్‌లా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆహారం ద్వారా తీసుకునే లైకోపీన్‌ను జీర్ణం చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి, ఈ అధ్యయనంలో లైకోపీన్ ఉండే సప్లిమెంట్‌ను ఉపయోగించారు. అలాగే, సప్లిమెంట్ ద్వారా అయితే ఆ పోషక పదార్థం అందరికీ రోజూ ఒకే మోతాదులో అందించే వీలుంటుందన్నది పరిశోధకులు పేర్కొన్నారు. టొమేటోలలో లైకోసిన్ ఎక్కువగా ఉంటుంది. సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న పురుషులకు లైకోపీన్ ఇచ్చి, వారి వీర్యం నాణ్యతను పరిశీలించారు. ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే, ఆ దంపతులకు సంతానం కలిగే అవకాశం ఉందని తేలింది.

Read Also: Tarakaratna Political: ఎమ్మెల్యే టికెట్ ఇద్దామనుకున్నా.. ఇంతలోనే ఇలా

టొమేటోలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోగనిరోధక శక్తి (immunity power) ని పెంచడానికి కొత్తగా పెళ్ళయిన జంటలు, పెళ్ళై పిల్లలు కలగని జంటలు టోమాటోల సహాయం తీసుకోవచ్చు. టొమాటో శరీరంలో విటమిన్ సి లోపాన్ని తీర్చడం ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో టమాటో రసం తాగడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. వంధ్యత్వంతో బాధపడేవారు టొమేటాలను విరివిగా ఉపయోగించాలి. అయితే ఈ విషయంలో డాక్టర్ల సలహా తప్పనిసరి. కొంతమంది బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు గ్లాసుల టమాటా రసం తాగాలి. ఇలా చేయడం వల్ల బరువు త్వరగా తగ్గి, కొద్ది రోజుల్లోనే స్థూలకాయాన్ని దూరం చేసుకోవచ్చు. టమాటా రసం తాగడమే కాకుండా తినడం కూడా మంచిదే. దీనివల్ల చర్మ సమస్యలు కూడా దూరమై చర్మం మెరుస్తుంది.

Read Also: Bird Watch Festival: జనం అడవి బాట.. పక్షుల కోసం కెమేరాల వేట.. బర్డ్ వాచ్ ఫెస్టివల్