NTV Telugu Site icon

Healthy Skin: జిడ్డు చర్మం ముడతలు పడదా?.. నిజ‌మేనా !!

Skincare

Skincare

చర్మ సంరక్షణకు సంబంధించి అర్థంలేని ప్రచారాలు అనేకం. వాటిలో నిజమెంత, అసత్యాలెన్ని అన్నది తెలుసుకోవాల్సిందే. ఈ మధ్యకాలంలో ఆర్గానిక్‌, కెమికల్‌ ఫ్రీ అనే పదాలు సౌందర్య ఉత్పత్తుల విషయంలో బాగా వినిపిస్తున్నాయి. నిజానికి రసాయనాలు లేకుండా ఏ సౌందర్య సాధనాన్నీ తయారు చేయలేరు. కానీ, ఆయా ఉత్పత్తుల మీద ఉన్న పేర్లను బట్టి ఏదేదో ఊహించుకుంటాం. చర్మానికి కొన్ని ఉత్పత్తులు రాసినప్పుడు కొంత మంట కలుగుతుంది. అందులోని ఆల్కహాల్‌ లేదా మెంథాల్‌ దీనికి కారణం. విపరీతమైన మంట కలిగినా లేదా ఎర్రగా కందినా ఉత్పత్తి బాగా పనిచేస్తున్నట్టు అర్థం కాదు. మరీ మంటగా అనిపిస్తే కడిగేసుకోవడం మేలు.

జిడ్డు చర్మ తత్వం ఉన్నవాళ్లలో సహజంగా సీబం అనే నూనె పదార్థం విడుదల అవుతుంది. ఆ కారణంగా ముడతలు లేదా గీతలు తక్కువగా కని పిస్తాయి. అంతేకానీ జిడ్డు చర్మం ఉన్న వాళ్లకు చర్మం ముడతలే పడదని అర్థం కాదు. జిడ్డు చర్మమైనా, పొడి చర్మమైనా యవ్వనంగా కనిపించడం అన్నది ఆయా వ్యక్తుల చర్మ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. చర్మ సంరక్షణ కోసం క్రీములూ, ప్యాక్‌లూ, క్లెన్సర్లలాంటివి వాడేప్పుడు ముందుగా మృతకణాలను తొలగించేవి వినియోగించాలి. తర్వాతే మిగతావి. అంటే తక్కువ గాఢత ఉన్న ఉత్పత్తుల నుంచి మొదలుపెట్టి ఎక్కువ గాఢత ఉన్న వాటిని చివర్లో వాడాలి. మృతకణాలను తొలగించాక ఏం రాసినా అవి చర్మంలోకి చక్కగా ఇంకుతాయి.

మీ చర్మానికి తగిన మాయిశ్చరైజర్‌ను ఎంచుకునేందుకు చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించటం మంచిది. చర్మాన్ని మృదువుగా ఉంచే ప్రయోజనకరమైన హైలురోనిక్ యాసిడ్, గ్లిసరిన్ వంటివాటిని ఎంచుకోవాలి. అంతేకాకుండా గోరువెచ్చని నీటి తో చర్మాన్ని శుభ్రం చేసుకోవటం మంచిది. వేడి నీరు చర్మానికి జిడ్డు కలిగించే నూనెలను తొలగించటంలో సహాయపడుతుంది.

ఇక కంప్యూటర్ స్క్రీన్ ను చూడటానికి అనుక్షణం కళ్ళు చిట్లించి చూడటం, మెడను వంచటం వలన కళ్ళచుట్టూ సన్నని ముడతలు వస్తాయి. అందుకని 1 ½ నుంచి 2 అడుగుల దూరంలో మీ కంటికి ఎలా సౌకర్యంగా ఉంటే అలా కూచోండి. మీ మెడను నిటారుగా వుంచి, మెడపై అడ్డగీతలు రాకుండా చూసుకోండి. ప్రైస్టోవ్స్కీ గంటకి రెండు మూడు సార్లు బ్రేక్ తీసుకుని కాళ్ళూ చేతులు కదిలించి సరిగా కూచోమని చెప్తున్నారు.

రోజంతా కూడా మధ్యమధ్యలో కాస్త విశ్రాంతి తీసుకుంటూ ఉండటం మంచిది. చూసారా మ‌న చ‌ర్మ ర‌హ‌స్యం మ‌న‌చేతుల్లోనే వుంది. అలా చేస్తే మన చ‌ర్మం మెస్తుంది. ఇలా అయితే మ‌న చ‌ర్మం ముడ‌త‌లు ప‌డుతుంది అనుకోవ‌డం మన భ్రమో అవుతుంది. ఏది ఎలావున్నా.. మ‌న వ‌య‌సుతో పాటు మ‌న ముఖంలోని చ‌ర్మ కూడా వాటి ప్ర‌భావాలు చూపిస్తాయి. అంతే గానీ క్రీములు, మొద‌ల‌గున‌వి వాడ‌టం వ‌ల్ల అయినా త‌క్కువ వ‌యస్సులో తొంద‌ర‌గా కూడా ముడ‌త‌లు వ‌చ్చే అవ‌కాశాలు వున్నాయి. మన ముఖం ఆయిల్ గా వుంటే ముడ‌త‌లు రావ‌నుకోవ‌డం మ‌న భ్ర‌మే అవుతుంది.

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం, వెండి ధరలు