NTV Telugu Site icon

Mobile Phones: ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడుతున్నారా..? అయితే మీరు హైబీపీ బారిన పడొచ్చు..

Mobile Phones

Mobile Phones

Mobile Phones: ప్రస్తుత జీవిత కాలంలో సెల్ ఫోన్లు మన జీవితంలో భాగం అయ్యాయి. ఇక ఇంటర్నెట్ చౌకగా అందుబాటులోకి వచ్చేసరికి చాలా మంది సెల్ ఫోన్లలోనే గుడుపుతున్నారు. ఇదిలా ఉంటే చాలా సేపు మొబైల్ ఫోన్లు వాడటం దీర్ఘకాలంలో పలు ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అదే పనిలో సెల్ ఫోన్లలో గంటల తరబడి మాట్లాడే వారికి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వారానికి 30 నిమిషాల కన్నా ఎక్కువ సేపు మొబైల్ ఫోన్లలో మాట్లాడే వారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశం 12 శాతం పెరుగుతోందని చైనా శాస్త్రవేత్తలు వార్నింగ్ ఇచ్చారు.

Read Also: Texas Shooting: అమెరికాలో కాల్పుల మోత.. 9 మంది…

ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్ల సంఖ్యను పరిశీలిస్తే.. 10 ఏళ్ల వయసు దాటిన వారిలో మూడొంతుల మందికి సెల్ ఫోన్లు ఉన్నాయి. సెల్ ఫోన్ల నుంచి తక్కువ స్థాయిలో ప్రీక్వెన్సీ వెలువడుతుంది. వీటికి ఎక్కువ సేపు మానవశరీరం గురైతే రక్తపోటు పెరుగొచ్చని పరిశోధకులు చెప్పారు. గుండె పోటు, పక్షవాతానికి ఈ హైబీపీ కారణం అవుతుంది. ఈ ఆరోగ్య సమస్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షల మంది మరణిస్తున్నారు. బ్రిటన్ లోని బయోబ్యాంక్ నుంచి.. 37 ఏళ్ల నుంచి 73 ఏళ్ల మధ్య వయసు ఉన్న రెండు లక్షల మందికి సంబంధించిన డేటాను శాస్త్రవేత్తలు పరిశీలించారు. వీరంతా సెల్ ఫోన్లలో ఎంత సేపు మాట్లాడుతున్నారనే విషయాన్ని తెలుసుకున్నారు. 12 ఏళ్ల తర్వాత వారిని పరిశీలించినప్పుడు 7 శాతం మందిలో అధిక రక్తపోటును గుర్తించారు. వారానికి అరగంట పాటు మాట్లాడేవారికి 12 శాతం, 30-59 నిమిషాలు ముచ్చటించే వారికి 13 శాతం, 1-3 గుంటల మాట్లాడేవారికి 16 శాతం మేర అధిక రక్తపోటు ముప్పు పెరగొచ్చని వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.