Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sugarcane Juice Side Effects: ఎండలు మండిపోతున్న వేళ చల్లని చెరకు రసం తాగితే ఆ మజాయే వేరు. దేహానికి తక్షణ శక్తిని, ఉత్తేజాన్ని ఇవ్వడంలో చెరకు రసం అగ్రస్థానంలో ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అయితే ఇది అందరికీ ఆరోగ్యకరం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు చెరకు రసం విషయంలో కొన్ని కీలక సూచనలు చేశారు. ఎవరెవరు చెరకు రసానికి దూరంగా ఉండాలి, ఎందుకు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
షుగర్ వ్యాధితో బాధపడేవారు లేదా బ్లడ్ షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉండేవారు చెరకు రసానికి దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచించారు. ఎందుకంటే చెరకు రసంలో సహజ సిద్ధమైన చక్కెర అధికంగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచే ప్రమాదం ఉంది. అందుకే డయాబెటిస్ రోగులు దీన్ని తాగడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని చెప్పారు. బరువు తగ్గాలనుకునే వారు లేదా ఇప్పటికే అధిక బరువు ఉన్నవారు చెరకు రసాన్ని తక్కువగా తీసుకోవాలని సూచించారు. ఎందుకంటే ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరంలోకి వెళ్లిన వెంటనే షుగర్ లెవల్స్ పెంచడంతో పాటు బరువు పెరగడానికి కారణమవుతుందన్నారు. ఒకవేళ తాగాలనిపిస్తే, షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు వారానికి ఒకసారి చిన్న గ్లాసు తాగవచ్చు.
Also Read
- Blood Sugar Test Timing: తిన్న ఎంతసేపటి తర్వాత షుగర్ చెక్ చేయాలి? చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే!
- Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే 'ఫ్లఫీ ఆమ్లెట్' చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
- Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
- Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ 'బ్రెడ్ పకోడా'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
తరచుగా అజీర్తి, కడుపు నొప్పి లేదా గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడేవారు చెరకు రసం తాగకపోవడమే ఉత్తమం. చెరకు రసం తీసుకుంటే కడుపులో గ్యాస్ సమస్య పెరిగే అవకాశం ఉంది. ఇది జీర్ణ సంబంధిత ఇబ్బందులను మరింత క్లిష్టతరం చేస్తుందన్నారు. నిజానికి ఆరోగ్యంగా ఉన్నవారు కూడా రోజుకు అతిగా చెరకు రసం తాగకూడదన్నారు. పరగడుపున చెరకు రసం తాగడం వల్ల రక్తంలో ఇన్సులిన్ స్థాయిల్లో అసమతుల్యత ఏర్పడవచ్చన్నారు. రోడ్డు పక్కన అమ్మే చోట చెరుకు రసం తయారీలో ఎంతవరకు శుభ్రత పాటిస్తున్నారో గమనించడం ముఖ్యం అని వైద్యులు సూచించారు.
తాజావార్తలు
-
Microsoft Layoffs: ఐటీ ఉద్యోగులకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్‌లో 5,000 మంది అవుట్! ఎవరెవరి ఉద్యోగాలు ఊడనున్నాయంటే?
-
OG 2: పవన్ కళ్యాణ్ కొత్త లుక్ వైరల్.. ‘ఓజీ 2’పై ఒక్క ఫోటోతోనే భారీ హైప్
-
UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
-
Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటాయి
-
Android 17 Wrong Password Lock Feature: గూగుల్ కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ప్రతి యూజర్ తెలుసుకోవాల్సిందే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?