Papaya Face Mask: ఇంట్లో బొప్పాయి ఉంటే చాలు.. ముఖం బంగారంలా మెరిసిపోయే చిట్కా మీ కోసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Papaya Face Mask: అందమైన, మెరిసే చర్మం కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడరు.. ఖరీదైన పార్లర్ చుట్టూ కూడా తిరిగిన సందర్భాలు ఎన్నో ఉంటాయి.. అయితే, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేకుండా.. పార్లర్ చుట్టూ తిరిగే అవసరం లేకుండా.. ఖర్చు కూడా పెద్దగా పెట్టాల్సిన అవసరం లేకుండా.. మీ వంటగదిలో ఉన్న బొప్పాయి, పెరుగు వంటి సహజ పదార్థాలతోనే చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు.. అంటే, బొప్పాయి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉన్న పపైన్ (Papain) ఎంజైమ్ మృత చర్మాన్ని తొలగించి సహజ మెరుపును తీసుకువస్తుంది. విటమిన్ C మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. పెరుగులోని లాక్టిక్ ఆమ్లం సున్నితంగా ఎక్స్ఫోలియేట్ చేసి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
బొప్పాయి – పెరుగు ఫేస్ మాస్క్ ప్రయోజనాలు
– మృత చర్మాన్ని తొలగిస్తుంది
– చర్మానికి సహజ కాంతి అందిస్తుంది
– మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది
– మొటిమలు తగ్గించడంలో సహాయపడుతుంది
– చర్మాన్ని మృదువుగా, తాజాగా ఉంచుతుంది
– యాంటీఆక్సిడెంట్లు అకాల వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి
Also Read
- Saltలో ఈ ఒక్క మార్పు చేయండి.. లక్షలాది ప్రాణాలు కాపాడండి! పరిశోధనలో కీలక విషయాలు
- Healthy Breakfast: బియ్యం లేకుండానే క్రిస్పీ జొన్న దోశలు.. షుగర్, బరువు నియంత్రణకు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్!
- Care Health Insurance పాలసీదారులకు షాక్.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్స నిలిపివేత.!
- Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే 'సన్న కారపూస'.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
బొప్పాయి ఫేస్ మాస్క్ అప్లై చేసే సులభమైన మార్గాలు
1. మెరిసే చర్మం కోసం ఫేస్ మాస్క్: పండిన బొప్పాయిని మెత్తగా చేసి పెరుగుతో కలపాలి.. ఈ మాస్క్‌ను మీ ముఖం మరియు మెడకు అప్లై చేయండి.. అప్లై చేసిన తర్వాత 15–20 నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఈ మాస్క్ మీ చర్మాన్ని శుభ్రపరుస్తుంది.. దాని సహజ మెరుపును పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.
2. మాయిశ్చరైజింగ్ మాస్క్: మాయిశ్చరైజింగ్ మాస్క్ తయారు చేయడానికి, బొప్పాయి, పెరుగు మరియు 1 టీస్పూన్ తేనెను బాగా కలపండి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచండి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. పొడి చర్మం ఉన్నవారికి ఈ మాస్క్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
3. బ్రైటెనింగ్ మాస్క్: బొప్పాయి నుండి బ్రైటెనింగ్ మాస్క్ తయారు చేయడానికి, బొప్పాయిని పెరుగు మరియు చిటికెడు పసుపుతో కలపండి. ఈ ప్యాక్‌ను మీ ముఖానికి 10–15 నిమిషాలు అప్లై చేసి, తర్వాత బాగా కడగాలి. ఇది మచ్చలను తగ్గించి మీ చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుంది.
4. ఎక్స్‌ఫోలియేటింగ్ మాస్క్: బొప్పాయితో ఎక్స్‌ఫోలియేటింగ్ మాస్క్ తయారు చేయడానికి, బొప్పాయి, పెరుగు మరియు ఓట్స్ రుబ్బి బాగా కలపండి. ఈ మాస్క్‌ను మీ ముఖానికి అప్లై చేసి వృత్తాకార కదలికలలో సున్నితంగా మసాజ్ చేయండి. 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఈ మాస్క్ మోడుబారిన మీ చర్మాన్ని తొలగించడంలో సహాయపడుతుంది మరియు చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
* జాగ్రత్తలు
– ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయండి
– కోతలు, గాయాలపై అప్లై చేయవద్దు
– 20 నిమిషాల కంటే ఎక్కువ ఉంచవద్దు
– అలెర్జీ లేదా చికాకు ఉంటే వెంటనే ఆపండి
– పచ్చి బొప్పాయి వాడకండి
అయితే, బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగడం.. ఎక్కువ డబ్బులు ఖర్చు చేయడం వంటివి చేయకుండా.. సహజ పదార్థాలతో చర్మ సంరక్షణ సురక్షితమైన మరియు ఖర్చు తక్కువ మార్గం. వారానికి 1–2 సార్లు ఈ మాస్క్ ఉపయోగిస్తే, మీ ముఖం బంగారంలా మెరిసిపోతుంది.
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు
-
Ananya Agarwal: 21 ఏళ్ల వయసులోనే బిజినెస్.. కేవలం 50 రోజుల్లోనే రూ. 15 లక్షల రెవెన్యూ రాబట్టిన కాలేజీ స్టూడెంట్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Telangana Student Missing: అమెరికాలో తెలంగాణ యువతి మిస్సింగ్.. బోస్టన్‌లో తీవ్ర కలకలం
-
Hyderabad: భర్తలు తేవడం.. భార్యలు అమ్మడం.. ఆల్వాల్‌లో డిఫెన్స్ మద్యం దందా!
-
Ex-Girlfriend Case: మాజీ ప్రేయసి వివరాల కోసం యువకుడి ప్రయత్నం.. 97 RTI దరఖాస్తులు, 1,887 ప్రశ్నలు! షాకైన కమిషన్
ట్రెండింగ్
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!
-
క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. 286cc ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో Honda Rebel 300 వచ్చేస్తోంది..