ప్రస్తుత రోజుల్లో కిడ్నీలో రాళ్లు ఉండడం కామన్ సమస్యగా మారింది. అయితే.. దీన్ని సీరియస్‌గా తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. కిడ్నీ శరీరంలోని చాలా ముఖ్యమైన అవయవంలో ఒకటి. ఇది రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి పనిచేస్తుంది. రక్తాన్ని ఫిల్టర్ చేసేటప్పుడు సోడియం, కాల్షియం, ఇతర ఖనిజాల సూక్ష్మ కణాలు మూత్రంతో శరీరం నుంచి బయటకు వెళ్తాయి. అయితే రక్తంలో కాల్షియం, భాస్వరం, సోడియం, ఇతర ఖనిజాల పరిమాణం పెరిగినప్పుడు అది రక్తంలో పేరుకుపోతుంది. దాంతో వాటిని మూత్రపిండాలు రాళ్లను ఏర్పరుస్తాయి. ఇది ఒక సాధారణ సమస్య. కానీ., తీవ్రమైన వ్యాధి. ఈ సమస్యను తగ్గించే సహజ పద్ధతుల గురించి తెలుసుకుందాం..
READ MORE: Delhi: ధాన్యం మార్కెట్‌పై ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రభావం?
ముందుగా రాళ్ల పరిమాణం, వ్యాధి స్థితి గురించి తెలుసుకునేందుకు వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుడి సూచనలతో పాటు ఈ సహజ పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ఆపిల్ వెనిగర్ లోని సిట్రిక్ యాసిడ్ కిడ్నీ రాళ్లను చిన్న ముక్కలుగా విడగొడుతుంది. మూత్రాశయం గుండా రాళ్లు బయటకు వెళ్లేందుకు సహకరిస్తుంది. ఆపిల్ సీడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల కిడ్నీల నుంచి ట్యాక్సిన్లు బయటకు వెళ్లి శుద్ధి అవుతాయి. రాళ్లు తొలగిపోయే వరకు రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సీడర్ వెనిగర్‌ను వెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం మంచిది.
READ MORE: Minister Gottipaati Ravi Kumar: గడిచిన ఐదేళ్లలో విద్యుత్ కొనుగోళ్లలో పారదర్శకత లేదు..
ఎండబెడ్టిన తులసి ఆకులను పొడిగా నలిపండి. ఒక టేబుల్ స్పూన్ పొడిని నీటిలో కలిపి తేనీరు తయారు చేయండి. ఈ టీని రోజులో మూడు సార్లు తాగండి. ఇది కడుపులోని ఎసిటిక్ యాసిడ్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. దీని వల్ల కిడ్నీలోని రాళ్లు సైతం విచ్ఛిన్నమై సులభంగా బయటకు పోతాయి. కిడ్నీ బీన్స్ కూడా మూత్ర పిండాల్లో రాళ్లను బయటకు పంపేందుకు సహకరిస్తాయి. కిడ్నీ బీన్స్‌ను 8 నుంచి 12 గంటలు నీటిలో నానబెట్టి ఉడకబెట్టి తినండి. కిడ్నీ బీన్స్‌లో ఉండే ఫైబర్ మూత్ర పిండాల్లోని రాళ్లను బయటకు గెంటేస్తాయి. రోజులో ఒక్కసారైనా వీటిని తీసుకోండి.